breaking news
Jolly LLB 3 Movie
-
ఓటీటీలోకి కితకితలు పెట్టించే సినిమా.. ‘జాలీ ఎల్ఎల్బి 3 ’ కథేంటి?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం జాలీ ఎల్ఎల్బి 3 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. పక్కవాడు బాగుంటే ఆనందపడేవాళ్ళు కొందరైతే... మనవాళ్ళైనా సరే బాగుపడుతుంటే చూసి ఈర్ష్య పడేవాళ్ళు మరికొందరు. ఆ మరికొందరిపై అల్లుకున్న కథే ఈ ‘జాలీ ఎల్ఎల్బి 3’ సినిమా. వాదన ప్రతివాదన అనేది నిత్యం ఎక్కువగా జరిగేది న్యాయవాదుల మధ్యనే కదా. అంటే... న్యాయస్థానాలు దాదాపుగా గంభీర వాతావరణంలో ఉంటాయి. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ ‘జాలీ ఎల్ఎల్బి 3’ సినిమా చూస్తే మాత్రం మీకు కితకితలు ఖాయం. ‘జాలీ ఎల్ఎల్బి’ సిరీస్‌లో వచ్చిన మూడవ భాగమిది. మొదటి భాగం నుండి ఇప్పటివరకు ప్రతి సిరీస్‌లో కనిపించిన నటుడు అర్షద్ వార్సీ, ఇతని కాంబినేషన్లో అక్షయ కుమార్ నటించిన ఈ చిత్రానికి సిరీస్‌లో అన్ని చిత్రాలను తెరకెక్కించిన సుభాష్ కపూరే దర్శకత్వం వహించారు. నిజజీవిత ఆధారిత ఘటనల చుట్టూ కథలను అల్లుకొని రూపొందించిన ఈ ప్రతి సిరీస్‌లోని హ్యూమర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అలరిస్తుంది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేసి, ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేశారు ఈ జాలీ ఎల్ఎల్బి. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... దేశాన్ని కుదిపేసిన రైతుల ఉద్యమం చుట్టూ ఈ కథ నడుస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజారాం సోలంకి అనే రైతుకి సంబంధించిన ఓ పొలం వివాదం పై కోర్టులో జానకి అనే ఆవిడ కేసు వేసి ఉంటుంది. బికనీర్ టు బోస్టన్ ప్రాజెక్టు కోసం పరసూల్ ప్రాంతంలో ఉన్న పొలాలన్నిటినీ కేతన్ అనే వ్యాపారవేత్త అక్రమంగా లాక్కుంటాడు. జానకితో పాటు చాలా మంది రైతులు ఇదే వివాదంపై కోర్టు మెట్లెక్కుతారు. ఢిల్లీ సెషన్స్ కోర్టు ప్రాంగణంలో మీరట్‌కు చెందిన జగదీష్ త్యాగి, కాన్పూర్‌కి చెందిన జగదీష్ మిశ్రా ‘లా’ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇద్దరి పేర్లు దాదాపుగా ఒకటవడం వల్ల ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఇదే నేపథ్యంలో జానకి తన పిటిషన్‌తో వీళ్ళిద్దరి మధ్యకు చేరుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు లాయర్లతో అవతల కోట్లకు పడగెత్తిన ప్రముఖ వ్యాపారవేత్తపై తాను చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో జానకి గెలుస్తుందా? లేదా అన్నది ‘జాలీ ఎల్ఎల్బి 3’ సినిమాలోనే చూడాలి. చాలా సీరియస్ సబ్జెక్ట్ అయినా సరదా సరదాగా సాగిపోతుందీ సినిమా. ఓ పక్క మెయిన్ పాయింట్ నుండి పక్కకు వెళ్ళకుండా... అలా అని ప్రేక్షకుడిని మరీ సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్ళకుండా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందీ సినిమా. మస్ట్ వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి లీగల్ కామెడీ మూవీ.. అధికారిక ప్రకటన
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వీకెండ్ కూడా అల తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ లాంటి హిట్ చిత్రాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు లిస్టులో లేటెస్ట్ హిందీ మూవీ ఒకటి చేరింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ లీగర్ కామెడీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎప్పటినుంచి ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: రజనీకాంత్ 173వ సినిమా.. వారంలోనే తప్పుకొన్న దర్శకుడు)గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 సినిమాలకు కొనసాగింపుగా ఈ ఏడాదా సెప్టెంబరు 19న మూడో భాగం వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి ప్రధాన పాత్రలు చేశారు. తొలి రెండు చిత్రాల్ని తీసిన సుభాష్ కపూర్.. దీన్ని కూడా డైరెక్ట్ చేశారు. 2011లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ నిజ జీవిత సంఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలోనే నవంబరు 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రావొచ్చని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా తీసుకొచ్చే అవకాశముంది.'జాలీ ఎల్ఎల్బీ 3' విషయానికొస్తే.. రాజస్థాన్‌లోని బికనీర్ గ్రామంలో ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరి భాయ్ (గజరాజ్) చేసిన ఓ ప్రయత్నాన్ని ఊరిలోని వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు. ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండేసరికి హరి భాయ్.. మతలబు చేసి రైతుల భూముల్ని తన సొంతం చేసుకుంటాడు. న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించిన రైతులకు.. ఇద్దరు జాలీలు (అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ) ఎలాంటి సాయం చేశారు? చివరకు ఏమైందనేదే ఈ సినిమా స్టోరీ. తొలిరోజు చిత్రాలతో పోలిస్తే ఇది ఓ మాదిరి స్పందన మాత్రమే అందుకుంది. పెద్దగా కలెక్షన్స్ కూడా రాలేదు.(ఇదీ చదవండి: ఎర్రకోట ఘటన.. 'పెద్ది' టీమ్ జస్ట్ మిస్!) -
పైరసీ భూతం.. జియోస్టార్ కొత్త ప్రయత్నం!
పైరసీ.. చిత్ర పరిశ్రమను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న చీడపురుగు. వేల మంది కష్టాన్ని మింగేస్తూ.. కోట్ల రూపాయాల వ్యాపారానికి నష్టాన్ని కలిగిస్తుంది. సినిమా విడుదలైన ఒకటి, రెండు రోజుల్లోనే సోషల్ మీడియాలో పైరసీ కాపీలు ప్రత్యక్షమవుతున్నాయి. కరోనా తర్వాత ఓటీటీ వాడకం పెరగడంతో కొన్నాళ్ల పాటు నివురు గప్పిన నిప్పులా ఉన్న పైరసీ భూతం ఇప్పుడు మళ్లీ జడలు విప్పింది. వందల కోట్లతో నిర్మించిన చిత్రాలు.. రిలీజైన రోజే పైరసీ వెబ్సైట్లలో ప్రత్యేక్షం అవుతున్నాయి. దీని వల్ల నిర్మాతలకు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. టాలీవుడ్లో ఇటీవల రిలీజైన మిరాయ్ చిత్రాన్ని సైతం ఈ పైరసీ బూతం వదల్లేదు. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థ జియోస్టార్ పైరసీ అడ్డుకట్టకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. స్ట్రీమింగ్ రైట్స్‌తో పాటు అన్ని హక్కులను కొనుగోలు చేసిన ఓ బాలీవుడ్ మూవీని పైరసీ నుంచి కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. 72 గంటల్లోగా పైరసీ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.రిలీజ్‌కు ముందే..బాలీవుడ్లో కామెడీ ఆధారంగా రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా జాలీ ఎల్ఎల్బీ, జాలీ ఎల్ఎల్బీ 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆ తర్వా త ఈ సిరీస్‌లో మూడో చిత్రంగా వస్తున్న చిత్రం జాలీ ఎల్ఎల్బీ 3. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అర్హద్ వార్సీ, సౌరబ్ శుక్లా, అమృత రావు, హ్యుమా ఖురేషి, బోమన్ ఇరానీ, సీమా బిశ్వాస్, గజరాజ్ రావు, రామ్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు పోషించారు. అలోక్ జైన్, అజిత్ అంధారి నిర్మించిన ఈ కామెడీ లీగల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన జియోస్టార్..ఈ సినిమాని అక్రమంగా స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. పైరసీ చేస్తున్న సుమారు 20 వెబ్సైట్లకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ..వాటిని బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.72 గంటల్లోగా బ్లాక్ చేయాలివిచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆ 20 వెబ్సైట్లకు సంబంధించినడొమైన్ రిజిస్ట్రేషన్లను 72 గంటల్లోపు నిలిపివేయాలని డొమైన్ నేమ్ రిజిస్ట్రార్లు (DNRలు), ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికమ్యూనికేషన్స్ విభాగంతో పాటు ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. అంతేకాదు సినిమా విడుదలకు ముందు లేదా విడుదల సమయంలో కనుగొనబడిన అదనపు పైరసీ వెబ్సైట్ల వివరాలను తెలియజేయడానికి జియోస్టార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, వాటిని కోర్టు ఆదేశాలు లేకుండానే బ్లాక్ చేయొచ్చని తీర్పులో వెల్లడించింది. తప్పుగా బ్లాక్ చేస్తే..కోర్టును సంప్రదించి, సవరించుకోవచ్చుననని ఆదేశాలు జారీ చేసింది. పైరసీ వెబ్సైట్లలనో సినిమాను ప్రసారం చేయడం వల్ల నిర్మాతల ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, కోలుకోలేని నష్టాన్ని నివారించడానికి త్వరిత జోక్యం అవసరమని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. తదుపరి విచారణనను వచ్చే ఏడాది జనవరి 20కి వాయిదా వేసింది.


