breaking news
ITI certificate
-
National Apprenticeship Mela 2023: 9న పీఎం అప్రెంటిస్‌షిప్ మేళా
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా యువతకు కెరీర్ అవకాశాలను పెంపొందించేందుకు ఈ నెల 9న దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకొనేందుకు అవకాశాలు ఇవ్వనున్నాయి. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాను తెలంగాణలోని 6 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అభ్యర్థులు తమ పేర్లను apprenticeshipindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తమకు దగ్గరగా ఎక్కడ మేళా నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి.. 5వ నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొనవచ్చు. ఏమేమీ కావాలి.. రెజ్యూమ్ మూడు కాపీలు మార్క్షీట్లు, సర్టిఫికెట్ మూడు కాపీలు ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్) మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఎక్కడెక్కడంటే... తెలంగాణలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ (భద్రాద్రి కొత్తగూడెం), ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ(హైదరాబాద్), భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ(జయశంకర్ భూపాలపల్లి), పెద్దపల్లి ప్రభు త్వ ఐటీఐ(పెద్దపల్లి), అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ(రంగారెడ్డి), భువనగిరి ప్రభుత్వ ఐటీఐ(యాదాద్రి భువనగిరి)ల్లో మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రభుత్వ ఐటీఐ(బీ) (అనంతపురం), కాకినాడ ప్రభుత్వ ఐటీఐ (కాకినాడ), విజయవాడ ప్రభుత్వ ఐటీఐ(ఎన్టీఆర్ కృష్ణా), మాచర్ల ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐ (పల్నాడు), ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ(బీ) (ప్రకాశం), ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ(శ్రీకాకుళం), తిరుపతి ప్రభుత్వ ఐటీఐ(తిరుపతి), విశాఖపట్టణం ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) (విశాఖపట్టణం), కడప ప్రభుత్వ ఐటీఐ (వైఎస్సార్ కడప)ల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. (క్లిక్ చేయండి: విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు) -
సర్టిఫికెట్ల పరిశ్రమలుగా ఐటీఐలు
వాకాడు : నైపుణ్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ఐటీఐలు సర్టిఫికెట్ల పరిశ్రమల్లా మారుతున్నాయి. జిల్లాలో ఏడు ప్రభుత్వ , 30కు పైగా ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 78 ప్రభుత్వ, 418 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. వీటి నుంచి ఏటా లక్ష మందికిపైగా విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఐటీఐల్లో పిట్టర్, మోటార్ మెకానిక్, ఎలక్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కోపా, వంటి వివిధ ట్రేడుల్లో శిక్షణ అందిస్తారు. అయితే బోధనా సిబ్బంది కొరతతో కోర్సులు మొక్కుబడిగా మారుతున్నాయి. 80 శాతం హాజరు ఉంటేనే విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలి. కానీ కొన్ని ప్రైవేట్ సంస్థల్లో అసలు విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరుకాకున్నా, వారి స్టైఫండ్, కొంత నగదు తీసుకుని హాజరువేసి పాస్ చేస్తున్నారు. విద్యార్థులు ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే సంబంధిత విభాగాల్లో సమర్థవంతంగా పనిచేయగలుగుతారన్న అంశాన్ని అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఐటీఐ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులు ఉద్యోగాలకు వెళ్లే సరికి నైపుణ్యాలేమితో వెనకబడిపోతున్నారు. కొరవడిన ఆర్జేడీల పర్యవేక్షణ ఐటీఐలపై ఆర్జేడీల పర్యవేక్షణ కొరవడింది. ఐటీఐల పర్యవేక్షణకు తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నంలో నలుగురు ఆర్జేడీలు ఉన్నారు. ఏటా వీరు ఐటీఐలను రెండు సార్లు పరిశీలించాల్సి ఉంది. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి తగిన పరికరాలు, స్థలం అన్ని ప్రమాణాల మేర ఉన్నాయో లేదో పరిశీలించాలి. సంస్థల్లో విద్యుత్ వాడకాన్ని పరిశీలించినా విద్యార్థులకు శిక్షణ ఏ మేరకు ఇస్తున్నారో తేలిపోతుంది. ఐటీఐల్లో ప్రవేశాలు, రికార్డుల నిర్వాహణ, విద్యార్థుల హాజరు, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, నిబంధనల మేర ప్రాక్టికల్స్ చేయిస్తున్నారా..అన్న అంశాలను ఆర్జేడీలు పరిశీలించాల్సి ఉంది. అయితే వీరు కుర్చీలకే పరిమితమై తనిఖీలు చేసినట్లు సంతకాలు చేస్తుండడంతో అవతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. వాకాడులో బోధనా సిబ్బంది కొరత వాకాడు ఐటీఐలో మూడేళ్లుగా 9 మంది బోధన సిబ్బందికి గానూ ఒక్కరు లేకపోవడం విశేషం. ఇక్కడ 120 సీట్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం 80 శాతం మేర సీట్లు బర్తీ అయ్యాయి. బోధనా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారు. కొందరు చేరినా తమ టీసీలను వెనక్కితీసుకుని వెళుతున్నారు. బోధనా సిబ్బంది నియామకానికి సం బంధించి ప్రభుత్వానికి తరచూ ప్రతిపాదనలు పంపుతున్నా పట్టించుకోకపోవ డం దారుణం. ఐటీఐలో పరికరాలు, గదులు కొరత లే నప్పటికీ బోధనా సి బ్బంది లేకపోవడం అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా మారింది. శిక్షకులు లేక మానుకున్నా వాకాడు ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ ట్రేడ్‌లో చేరా. రెండు నెలలు రోజూ కోట నుంచి చార్జీలు పెట్టుకుని వెళ్లిన కళాశాలలో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడంతో ఏమి నేర్చుకోలేదు. శిక్షకుల విషయం అడిగితే రోజూ హాజరు వేసుకుంటే చాలు సర్టిఫికెట్ ఇస్తామన్నారు. దీంతో ఏడాది వృథా అయినా ప్రయోజనం లేదని మానుకున్నాను. - చైతన్య, విద్యార్థి, కోట