breaking news
IP Rights
-
కంపెనీలు ఎదుర్కొంటున్న రిస్క్‌లేంటో తెలుసా?
న్యూఢిల్లీ: మేధోపరమైన హక్కులు (ఐపీ), సమాచారం, సైబర్ దాడులు, ప్రమాదాలు అనేవి భారత కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన రిస్క్‌లు అని ఫిక్కీ సర్వే తెలిపింది. మహిళల భద్రతా ముప్పు 2021లో 12వ స్థానంలో ఉంటే, 2022లో 5వ స్థానానికి వచ్చినట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు తమ మహిళా ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఎత్తి చూపింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! లాజిస్టిక్స్, నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీని ప్రధానంగా ప్రస్తావించాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్ కంపెనీలకు రోడ్డు ప్రమాదాలు రెండో అత్యంత ఆందోళకరమైన అంశంగా ఉంది. ఐపీ హక్కుల చోరీ మొదటి స్థానంలో ఉంది. నిర్మాణ రంగ కంపెనీలు ప్రమాదాల రూపంలో ఎక్కువ రిస్క్‌ను చూస్తున్నాయి. రిటైల్ పరిశ్రమ ప్రమాదాలు, ఐపీ హక్కుల చోరీ, విపత్తులను రిస్క్‌లుగా తెలిపాయి. మీడియా, వినోద పరిశ్రమ సమాచారం, సైబర్ సెక్యూరిటీ రిస్క్‌లను ప్రస్తావించాయి. ఐటీ, తయారీ రంగంలో ఐపీ హక్కుల చోరీ ప్రథమ రిస్క్‌గా ఉంది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే రిస్క్‌లను తెలుసుకునేందుకు ఫిక్కీ ఈ వార్షిక సర్వే నిర్వహించింది. ఇదీ చదవండి: వాహన ఇన్సూరెన్స్ చేయిస్తున్నారా? వీటితో భలే బెనిఫిట్స్! -
ఐపీ రైట్స్‌తో సంపదకు రక్షణ:గవర్నర్
బంజారాహిల్స్: సమాజంలో వెనకబాటుతనం, పేదరికం నిర్మూలన, అభివృద్ధికి ‘మేధో సంపత్తి హక్కు’ల (ఇంటిలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్–ఐపీ)ను వినియోగించాలని రాష్ట గవర్నర్ నరసింహన్ కోరారు. ప్రస్తుత డిజిటల్ సాంకేతిక యుగంలో అత్యంత కీలకమైన ఐపీ రైట్స్‌ను కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే కాకుండా సామాన్యుల జీవన ప్రమాణాలు పెంచే దిశగా వాడాలన్నారు. సీఐఐ, ఏపీటీడీసీన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో ‘మిప్కాన్–2016, మేనేజింగ్ ఐపీ అసెట్స్ ఫర్ బిజినెస్ అకడమిక్ కాంపిటెన్స్’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఇందులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెలకట్టలేని సాంస్కృతిక సంపద, యోగా, ఆయుర్వేదం, ప్రాణాయామం, వేద గణితం వంటి వాటికి మరింత పటిష్టమైన ఐపీ రక్షణ అవసరముందన్నారు. ఈ దిశగా నిపుణులు దృష్టి పెట్టాలని సూచించారు. ఐసీ రైట్స్ ప్రాధాన్యతపై సామాన్యులకు సైతం అర్థమయ్యేలా మరింత ప్రచారం అవసరమని, సంక్లిష్టమైన విధానాలను మరింత సరళతరం చేయడానికి మేధావులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దళారుల దోపిడీ నుంచి పేద కళాకారులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. ఈ సదస్సులో సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల, నల్సార్ ఫ్రొఫెసర్ వివేకానందన్, సీనియర్ లీగల్ కౌన్సిల్ శిల్పి ఝా, ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జి. పద్మనాభన్, ఏకే గార్గ్, ఎస్.చక్రవర్తి, మహేశ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.