breaking news
Interest on loans
-
ఎస్బీఐ బంపర్ ఆఫర్
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ రేటు 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ తగ్గింది. 6.70 శాతం నుంచీ గృహ రుణాలను ఆఫర్ చేయనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తాలు, సిబిల్ స్కోర్ ఆధారంగా ఆఫర్ చేస్తున్న తాజా రుణ రేట్లు 2021 మార్చి 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం, రూ.75 లక్షల వరకూ రుణాలపై వడ్డీ 6.70 శాతం నుంచీ ప్రారంభమవుతుంది. రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ రుణ రేటు 6.75 శాతంగా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ పూర్తిగా మినహాయిస్తుంది. పండుగల సీజన్ నేపథ్యం.. పండుగల సీజన్‌ను ప్రత్యేకించి మార్చి 29వ తేదీ హోలీని పురస్కరించుకుని తాజా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బిజినెస్) సలోనీ నారాయణ్ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా రుణ గ్రహీతలకు ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. యోనో యాప్ వినియోగించే కస్టమర్లకు కూడా ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. రీపేమెంట్ల వ్యవస్థ సజావుగా ఉందని సలోనీ నారాయణ్ పేర్కొన్నారు. రుణాల రీపేమెంట్ సవాలుతో కూడిన అంశంగా తాము భావించడం లేదనీ ఆయన వెల్లడించారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా, కస్టమర్‌తో కలిసి ఆ సమస్య పరిష్కారంపై బ్యాంక్ దృష్టి పెడుతుందన్నారు. ఈ అంశానికి సంబంధించి బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటోందని వివరించారు. గృహ రుణ విభాగంలో ఎస్బీఐ మొండిబకాయిలు (ఎన్పీఏ) 0.67% నుంచి 0.68% వరకూ ఉన్నట్లు చైర్మన్ దినేష్ ఖారా గత నెల్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల కోట్లకుపైగా వ్యాపారం... ఎస్బీఐ గృహ రుణ వ్యాపార పరిమాణం రూ.5 లక్షల కోట్లపైగా ఉంది. బ్యాంక్ రియల్టీ అండ్ హౌసింగ్ బిజినెస్ (ఆర్‌ఈహెచ్‌బీయూ) విభాగం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 2012లో రూ.89,000 కోట్లుంటే, 2021 నాటికి ఈ పరిమాణం రూ. 5 లక్షల కోట్లను అధిగమించింది. 2023–24 చివరినాటికి ఈ గృహ రుణ ఏయూఎం రూ. 7 లక్షల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో బ్యాంక్ పనిచేస్తోంది. మొత్తం గృహ రుణ మార్కెట్లో బ్యాంకింగ్ దిగ్గజం వాటా దాదాపు 34 శాతం. 2004లో ఎస్బీఐ గృహ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మొత్తం ఫోర్ట్‌ఫోలియో రూ. 17,000 కోట్లు. బ్యాంకుపై కస్టమర్ల విశ్వాసానికి ఈ విభాగం నిదర్శనమని చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఈ సానుకూల పరిస్థితికి బ్యాంకు సాంకేతికత, వ్యక్తిగత సేవలు కారణమన్నారు. గృహ రుణ మంజూరీ, పంపిణీ వ్యవహారాల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకోడానికి పలు రకాల డిజిటల్ చొరవలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఇందులో రిటైల్ రుణ నిర్వహణ వ్యవస్థ (ఆర్‌ఎల్‌ఎంఎస్) ఒకటి. రుణాల విషయంలో అన్ని స్థాయిల్లో అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్ ఇది. -
వీధివ్యాపారులపై అలసత్వం
చిరువ్యాపారులు.. నిగనిగలాడే పండ్లు, కూరగాయలు, తినుబండారాలను విక్రయించే వీరి జీవితాల్లో ఎలాంటి మెరుపూ ఉండదు. అద్దెలు, ఖర్చులు, పోలీసు మామూళ్లు, రోజువారీ వడ్డీలకు పోగా రోజంతా నిలువుకాళ్ల జీతంతో చేసే వ్యాపారంలో మిగిలేది స్వల్పమే. వీరిని వీధివ్యాపారులుగా గుర్తిస్తూ, కేంద్రప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసినా, అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ప్రత్యేక జోన్లు లేవు. గుర్తింపు కార్డుల పంపిణీలేదు. పావలా వడ్డీ రుణాల ప్రసక్తే లేదు. - కేంద్రప్రభుత్వం చేసిన చట్టం అమలులో తీవ్ర నిర్వక్ష్యం - ప్రత్యేక జోన్లు లేవు, గుర్తింపు కార్డులు సంగతి సరేసరి - పావలా వడ్డీ రుణాల ఊసే లేదు తెనాలి : జిల్లాలో అధికారుల అంచనా ప్రకారమే 4,397 మంది చిరువ్యాపారులు ఉన్నారు. వాస్తవ సంఖ్య యాభై శాతం అధికంగా ఉంటుందని చెబుతారు. ప్లాట్‌ఫారాలు, తోపుడుబండ్లపై, రోడ్డు పక్కన బుట్టల్లో వ్యాపారాలు చేసుకొనే పేదలకు ఆదాయం అస్తుబిస్తుగానే ఉంటుంది. సరుకు కొనుగోలుకు వడ్డీ వ్యాపారుల నుంచి రోజువారీ రూ.5, రూ.10 వడ్డీకి అప్పులు తెచ్చుకొని అమ్మకం ఆరంభిస్తారు. పెట్టుబడికి వడ్డీ, తోపుడుబండి అద్దె, తమ సాదర ఖర్చులు, వారం వంతున పోలీసులకు చెల్లించే మామూళ్లు పోతే చిరువ్యాపారులకు మిగిలేది స్వల్పమే. ఇళ్లు, దుకాణాల ఎదుట సరుకు పెట్టుకొని వ్యాపారం చేస్తే, ఆ గృహస్తులు/దుకాణ యజమానులకు రోజుకు ఇంతని డబ్బు చెల్లించాల్సిందే. చట్టం చేసిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం 2004లో వీరిని వీధి వ్యాపారులుగా గుర్తిస్తూ చట్టం చేసింది. మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. వీరు వ్యాపారం చేసుకొనేందుకు ప్రత్యేక జోన్లు ఏర్పాటుచేయాలనీ, గుర్తింపుకార్డులు మంజూరు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసుల, రౌడీల మామూళ్ల బెడద ఉండదని ప్రభుత్వ భావన. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వీధివ్యాపారులకు పావలా వడ్డీ రుణాలను కల్పించాలని నిర్ణయించింది. సూక్ష్మరుణాలను పట్టణ దారిద్య్ర నిర్మూలన పథకం (మెప్మా) కింద అందజేస్తామని ప్రకటించారు. కొనసాగుతున్న నిర్లక్ష్యం.. ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అలసత్వం కొనసాగుతోంది. గుంటూరు రీజియన్‌లో వీధివ్యాపారుల గుర్తింపు కేవలం 42 శాతమే జరగడంపై ఈనెల 19న గుంటూరులో జరిగిన సమీక్షా సమావేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ డి.మురళీధరరెడ్డి సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో గుర్తించిన వీధివ్యాపారులు 4,397 కాగా, వాస్తవంగా మరో రెండువేలమంది అదనంగా ఉంటారనే వాదన ఉంది. ఉదాహరణకు తెనాలిలో గుర్తించిన చిరు వ్యాపారులు సంఖ్య 227 కాగా, పండ్ల, చిల్లర వర్తక సంక్షేమ సంఘం సభ్యులు 380 ఉండగా, దెబ్బతిన్న పండ్లు, కూరగాయలు తీసుకెళ్లి వే రేచోట అమ్మేవారు. రోడ్డుపక్క ఇడ్లీ, దోసె వేసి అమ్మేవారు మరో 300 ఉంటారని సంక్షేమ సంఘం అధ్యక్షురాలు బొల్లు సుబ్బులమ్మ చెప్పారు. అధికారుల అంచనా ప్రకారమే జిల్లాలోని 4,397 మందికిగాను ఇప్పటికీ 274 మందికి మాత్రమే గుర్తింపుకార్డులు ఇచ్చారు. ఇక రుణాల సంగతి వీరిలో ఎవరికీ తెలియదు. పొన్నూరులో మున్సిపాలిటీ చొరవతో డ్వాక్రా తరహాలో పొదుపు చేయించి, కొందరికి రుణాలిచ్చినట్టు తెలిసింది. ఇకనైనా చిరువ్యాపారులను ఆదుకోవలసిన అవసరం ఉంది.