breaking news
Indias GDP growth
-
భారత వృద్ధి.. అంచనాలు పెరిగాయ్..
ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 2025–26 సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది. ముడి చమురు ధరలు కనిష్ట స్థాయిలో ఉండడం, పరపతి విధాన సరళీకరణ (వడ్డీ రేట్ల తగ్గింపు), ఆదాయపన్ను తగ్గింపు, సాధారణ వర్షపాతం అంచనాలను సానుకూలతలుగా పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రూపాయి, ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేసింది.భారత జీడీపీ 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ ఎస్అండ్పీ ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేయగా, అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళిక అస్థితరల నేపథ్యంలో ఆ తర్వాత 0.20 శాతాన్ని తగ్గిస్తూ, 6.3 శాతానికి సవరించింది. మళ్లీ పూర్వపు వృద్ధి అంచనాలనే ఇప్పుడు ప్రస్తావించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతం ఆర్థిక పరిస్థితులపై ఎస్అండ్పీ ఒక నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఘర్షణలతో చమురు ధరలు దీర్ఘకాలం పాటు పెరుగుతూ పోతే అది ఆసియా పసిఫిక్ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.గతేడాది కంటే చమురు ధరలు తక్కువగా ఉండడం భారత్‌కు అనుకూలిస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. ఏడాది క్రితం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరెంట్ ఖాతా నుంచి చేయాల్సిన చెల్లింపులు తగ్గుతాయి. దేశీయంగా ఇంధన ధరల ఒత్తిళ్లూ ఉండవు. ఇంధన ధరలు మోసర్తుగా పెరిగినా కానీ, ద్రవ్యోల్బణంపై ఆహార ధరలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. కనుక మొత్తం మీద రూపాయి లేదా ద్రవ్యోల్బణంపై పెద్ద ప్రభావం ఉండదన్నది మా అంచనా’’అని రాణా వివరించారు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం నేపథ్యంలో ముడి చమురు బ్యారెల్‌కు 69 డాలర్లకు పడిపోవడం తెలిసిందే. స్థానిక డిమాండ్ బలం.. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా మెరుగ్గా ఉన్న పరిస్థితుల్లో చమురు ధరలు పెరగకపోవచ్చని ఎస్అండ్పీ పేర్కొంది. స్థానికడిమాండ్ బలంగా ఉన్నందున భారత్ తదితర దేశాల్లో ఆర్థిక వృద్ది నిదానించడాన్ని పరిమితం చేస్తుందని తెలిపింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.7 శాతానికి పెరగొచ్చని అంచనా వ్యక్తం చేసింది.2024–25లో దేశ జీడీపీ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి అన్న ఎస్అండ్పీ అంచనాలు.. ఆర్బీఐ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. 2025లో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండొచ్చని ఈ నివేదిక తెలిపింది. గతేడాది ఇది 4.6 శాతంగా ఉంది. రూపాయి ఈ ఏడాది చివరికి 87.5 స్థాయికి చేరుతుందని పేర్కొంది. -
భారత్ వృద్ధి తీరు పటిష్టం: ఓఈసీడీ
లండన్: భారత్ జీడీపీ వృద్ధి ధోరణి పటిష్టంగా ఉందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక విశ్లేషణా సంస్థ-ఓఈసీడీ పేర్కొంది. తన నవంబర్ కాంపోజిట్ లీడింగ్ ఇండికేటర్స్(సీఎల్ఐ) ఆధారంగా ఓఈసీడీ ఈ విశ్లేషణ జరిపింది. భారత్‌కు సంబంధించి నవంబర్ సీఎల్ఐ 99.5 పాయింట్లుగా నమోదయ్యింది. అక్టోబర్‌లో ఇది 99.3గా ఉంది. సెప్టెంబర్‌లో 99.1 వద్ద ఉంది. ఆగస్టులో 99. జూలైలో 98.8. ఇది భారత్ ఆర్థిక వ్యవస్థ పురోగతి ధోరణికి సంకేతమని పేర్కొంది. భారత్‌తో పాటు జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడే అవకాశమున్నట్లు ఓఈసీడీ అభిప్రాయపడింది. జర్మనీ, ఇటలీ, రష్యాల ఆర్థిక వ్యవస్థల వృద్ధి బలహీనంగా ఉంది. బ్రిటన్‌లో వృద్ధి తీరు గరిష్ట స్థాయి నుంచి కొంచెం వెనక్కు తగ్గిందని ఓఈసీడీ నివేదిక పేర్కొంది. -
ఈ ఏడాది 5.7 శాతం వృద్ధి
వాషింగ్టన్: భారత్ ఈ ఏడాది 5.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. భారీ పెట్టుబడుల ప్రాజెక్టులు పురోగతి సాధిస్తుండడం, రూపాయి మారకం విలువ మరింత పోటాపోటీగా మారడంతో ఇండియా మెరుగైన వృద్ధి సాధిస్తుందని బుధవారం విడుదల చేసిన నివేదికలో బ్యాంక్ తెలిపింది. భారత్ ఈ ఏడాది 5.4 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) మంగళవారం పేర్కొన్న సంగతి విదితమే. ఈ అంచనాల నేపథ్యంలోనే సెన్సెక్స్‌లో ర్యాలీ నెలకొని సుమారు 360 పాయింట్లు పెరిగి 22,702 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. గత ఆగస్టులో డాలరుతో రూ.68.65గా ఉన్న రూపాయి మారకం విలువ ప్రస్తుతం 60 స్థాయిలో కొనసాగుతోంది. కాగా, దక్షిణాసియాలో ప్రస్తుతం 5.2%గా ఉన్న ఆర్థిక వృద్ధి రేటు వచ్చే ఏడాది 5.8 %నికి చేరుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా. ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది: ఐఎంఎఫ్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక స్థిరత్వం గత ఆరునెలల్లో బాగా మెరుగుపడిందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. అయితే, ఇదే కాలంలో వర్థమాన దేశాల్లో స్థిరత్వం క్షీణించిందని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ‘ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కామని ఇప్పుడే చెప్పలేం. ప్రపంచంలో ఆర్థిక స్థిరత్వానికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుంటోంది. యూరప్ దేశాల్లో మార్కెట్ విశ్వాసం గణనీయంగా పెరిగింది...’ అని ఐఎంఎఫ్ ఆర్థిక సలహాదారు వియల్స్ వాషింగ్టన్లో తెలిపారు.