breaking news
idl kukatpally
-
కూకట్పల్లి ఐడీఎల్లో పేలిన రియాక్టర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న ఐడీఎల్ సంస్థలో పేలుడు సంభవించింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో రియాక్టర్ పేలడంతో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన కార్మికుడు శర్మగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. -
కూకట్పల్లి ఐడీఎల్లో పేలిన రియాక్టర్
-
మరణ మృదంగం
-
ఐడీఎల్లో పేలుడు, ఇద్దరి మృతి
-
ఐడీఎల్లో పేలుడు, ఇద్దరి మృతి
కూకట్పల్లి ప్రాంతంలోని ఐడీఎల్ సంస్థలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో శ్రీనివాస్, అమర్ అనే ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. స్వామి, రాములు , పురుషోత్తం, మల్లేష్, మహాత్మా, ప్రకాశ్, రాకేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. మంటలు చెలరేగి మొత్తం పది మంది వరకు గాయపడినట్లు సమాచారం అందింది. అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. ఇది చాలా పెద్దస్థాయి ఆయిల్ కంపెనీ. కొన్ని వందల ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు. గతంలో ఒకసారి కూడా ఇక్కడ రియాక్టర్ల వద్ద పేలుడు సంభవించి, ఇద్దరు కార్మికులు మరణించారు. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా కేంద్రప్రభుత్వ సంస్థ కావడం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహా ఎవరికీ లోనికి ప్రవేశం లేకపోవడంతో ఏ విషయమూ పూర్తిగా తెలిసే అవకాశం లేదు. గతంలో వివరాలు చెప్పడానికి 15-20 రోజులు పట్టింది.