breaking news
Identification Numbers
-
తుపాకీ లైసెన్సుదారుల డేటాబేస్
న్యూఢిల్లీ: దేశంలో తుపాకీ లైసెన్స్‌లు కలిగిన వారందరికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించి వారి పేర్లతో జాతీయ స్థాయిలో డేటాబేస్‌ను రూపొందించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వచ్చే ఏప్రిల్ కల్లా ఈ డేటాబేస్ అందుబాటులోకి వస్తుందంది. ఏప్రిల్ నుంచి అధికారులు కొత్తగా లైసెన్సులు జారీచేసేటప్పుడు లేదా పాత లైసెన్సును పునరుద్ధరించేటప్పుడు ఆయుధం యజమాని వివరాలను ఈ డేటాబేస్‌లో నమోదు చేయాల్సిందేనని వెల్లడించింది. -
ఒక డాక్టర్.. ఒకే నంబర్
దేశవ్యాప్తంగా డాక్టర్లకు ప్రత్యేక గుర్తింపు నంబర్లు ఈ విధానాన్ని అమల్లోకి తేనున్న భారతీయ వైద్యమండలి వైద్యకళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకే.. ఇకపై హాజరు శాతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఒక డాక్టర్ ఒకే నంబర్ తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలని భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) భావిస్తోంది. దీనివల్ల ఏ వైద్యుడు ఎక్కడ పనిచేస్తున్నాడో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతోంది. డిజిటల్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ (డీఎంఎంపీ)లో భాగంగా ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలలు మొత్తం 500కు పైగా ఉన్నాయి. 53వేల మందికి పైగా వైద్యులు ఉన్నారు. అయితే ఇప్పటికీ అటు ప్రైవేటు గానీ, ఇటు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గానీ తగినంత మంది అధ్యాపక సిబ్బంది లేరు. ఎంసీఐ తనిఖీలకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఎక్కడో చోట బయటనుంచి వైద్యులను తీసుకురావడం, పబ్బం గడుపుకోవడం ఆ తర్వాత వారిని పంపించడం ఇదే జరుగుతోంది. దీనివల్ల ఎంబీబీఎస్ లేదా పీజీ చదువుతున్న వైద్యులకు సరైన బోధన అందడం లేదు. దీనిపై పలు ఫిర్యాదులు వచ్చినా భారతీయ వైద్యమండలి చర్యలు తీసుకోలేకపోతోంది. దీనికి ఎలాగైనా చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. శాశ్వత యునిక్ ఐడీ నంబర్ కేటాయింపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైద్యమండలి రిజిస్ట్రేషన్ నంబర్లే వైద్యులకు ప్రాతిపదికగా ఉన్నారుు. ఏ రాష్ట్రంలో నమోదు చేసుకుంటే ఆ రాష్ట్రంలో నంబరు ఇస్తారు. ఇప్పుడలా కాకుండా దేశవ్యాప్తంగా యునిక్ ఐడెంటిటీ నంబర్ కేటారుుస్తారు. ఈ నంబరు కేటారుుంచిన తర్వాత డాక్టరు పేరు, స్పెషాలిటీ, పనిచేస్తున్న చోటు తదితర వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఒకవేళ వృత్తిపరంగా ఏదైనా సంస్థ మారినా, నర్సింగ్‌హోంలు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు సొంతంగా నిర్వహించుకున్నా వివరాలన్నీ ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రైవేటు వైద్య కళాశాలల్లో గానీ, ప్రభుత్వ వైద్య కళాశాలల్లోగానీ పనిచేసే వారి విషయంలో మరింత కచ్చితత్వం వస్తుంది. ఒక డాక్టరుకు ఒకే యునిక్ నంబరు ఉంటే, మరో సంస్థలో పనిచేయడం కుదరదు. దీనివల్ల బోధనా సిబ్బంది కొరతను అధిగమించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యకళాశాలల్లో హాజరు పట్టికను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుందని ఎంసీఐ యోచన. ఈ విధానం గనుక అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో కనీసం వెయి మంది అధ్యాపకులను ప్రభుత్వం తక్షణమే నియమించాల్సి వస్తుంది. లేదంటే ఉన్న సీట్లన్నీ గల్లంతయ్యే అవకాశం ఉంది.