breaking news
Hyper Thyroid
-
Health Tips: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఏం జరుగుతుందంటే!
Vitamin C Deficiency Symptoms: మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి... విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి రక్తం కారడం, అలసటగా అనిపించడం, దద్దుర్లు రావడం, నీరసంగా అనిపించడం వంటివన్నీ స్కర్వీ వ్యాధి లక్షణాలు. మొదట్లో అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ప్రతి దానికి చిరాకు పడడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లను స్రవించడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి అవసరం. లేకుంటే బరువు హఠాత్తుగా తగ్గడం, గుండె కొట్టుకోవడంతో తేడా, విపరీతమైన ఆకలి, భయం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటి లక్షణాలు కలుగుతాయి. 3. రక్తహీనత శరీరం ఇనుమును శోషించుకోవడానికి విటమిన్ సి సాయపడుతుంది. తగిన స్థాయిలో ఈ విటమిన్ అందకపోతే ఐరన్ శోషణ తగ్గి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల బరువు తగ్గడం, ముఖం పాలిపోయినట్టు అవడం, శ్వాస ఆడకపోవడం వంటి ఆరోగ్య లక్షణాలు కనిపిస్తాయి. 4. చర్మ సమస్యలు విటమిన్ సిలో యాంటీఆక్సడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. చర్మానికి బిగుతును, సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు, రక్తస్రావం వంటివి కలుగుతాయి. Vitamin C Rich Foods: ఏం తినాలి? ►విటమిన్ సి లోపం తలెత్తకుండా ఉండాలంటే రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ►నారింజలు, నిమ్మ రసాలు తాగుతూ ఉండాలి. ►బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీలు, బ్రకోలి, క్యాప్సికమ్, బొప్పాయి, జామ, కివీలు, పైనాపిల్, టమోటాలు, పచ్చిబఠాణీలను మీ ఆహార మెనూలో చేర్చుకోవాలి. ►విటమిన్ సి టాబ్లెట్లను వైద్యుల సలహా మేరకే ఉపయోగించాలి. చదవండి👉🏾Fruits For Arthritis Pain: కీళ్ల నొప్పులా.. ఈ పండ్లు తిన్నారంటే చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ గ్రంథి...లోపాలు - లక్షణాలు
థైరాయిడ్ గ్రంథి సీతాకోకచిలుక ఆకారంలో గొంతు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యుటరీగ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది గొంతు భాగంలో గాలిగొట్టం (trachea) ఇరువైపులా అమరి ఉన్నట్లుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. అవి T3, T4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్, T3, T4 పెరగటం వలన హైపర్ థైరాయిడిజమ్ కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క లోపాలు మన శారీరక, మానసిక వ్యవస్థ మీద పనిచేస్తాయి. అమెరికాలో 59 మిలియన్ల జనాభాకి థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అంచనా. కానీ చాలామందికి ఆ విషయం ఇప్పటివరకు తెలియదు. థైరాయిడ్ గ్రంథి జీవక్రియలకు అవసరమైన చాలా ముఖ్యమైన గ్రంథి. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదో, అది మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళనలు, శక్తి స్థాయులపై దుష్ర్పభావం చూపుతాయి. థైరాయిడ్ సమస్యలు అకస్మాత్తుగా స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళనలు, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్ డిస్ఫంక్షన్, సంతానలేమి, ఇతర లక్షణాలు, ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశాల్ని పెంచుతాయి. అందుకే థైరాయిడ్ సమస్యని గుర్తించడం అతి ముఖ్యం. ప్రపంచ జనాభాలో సుమారు 75 శాతం స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మగవారిలో కేవలం 1.5 శాతం మాత్రమే. దీనికి కారణం మారిన జీవనశైలి కారణంగా మనపై పడే ఒత్తిడులే అని చెప్పవచ్చు. థైరాయిడ్ తయారుచేసే హార్మోన్స్ జీవన యంత్రాంగాన్ని, రసాయన పదార్థాలను నియంత్రిస్తాయి. థైరాయిడ్ ముఖ్యంగా T3, T4 అనే రెండు హార్మోన్స్‌ను తయారుచేస్తుంది. T3, ట్రై ఐడో ధైరోనిన్, T4 థైరాక్సిన్ (thyroxine) ఈ హార్మోన్స్ శరీరంలో... =BMR based metabolic Rate ను పెంచుతాయి =ఫాట్స్, కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్‌ను పెంచుతాయి =ప్రొటీన్ల తయారీ =గుండెకు, ఇతర అవయవాలకు రక్తసరఫరా హెచ్చిస్తాయి పిల్లలలో థైరాయిడ్ హార్మోన్స్ వలన గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. ఎముకల ఎదుగుదల, క్యాల్షియం మెటబాలిజమ్ కు కూడా థైరాయిడ్ హార్మోన్స్ ఆవశ్యకత ఉంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు థైరాయిడ్ పాత్ర సమతుల్యత, పోషణ, శరీర పెరుగుదలకు... థైరాయిడ్ గ్రంథి అవసరం చాలా ఉంది. హైపోథాలమిక్ పిట్యుటరీ థైరాయిడ్ ఆక్లిన్స్ ద్వారా థైరాయిడ్ హార్మోన్స్ తయారీ, నియంత్రణ ఆధారపడి ఉంటుంది. కొన్ని కారణాల వలన కలిగే మార్పులు ఎ) థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్ఫ్లమేషన్ బి) థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్స్ ఎక్కువ కావడం సి) థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్స్ తక్కువ కావడం థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు దానిని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. లక్షణాలు =ఆకలి బాగా ఉంటుంది. కానీ బరువు తగ్గుతారు =కోపం, చిరాకు నీరసం =అలసట, ఉద్రేకం = నాడి వేగం హెచ్చటం =కాళ్ళు, చేతులు వణకటం =ఎక్కువ వేడిని భరింపలేకపోవటం =చెమట పట్టడం =నీటి విరేచనాలు థైరాయిడ్ గ్రంథి భాగం వాచి, ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ కండిషన్‌ను థైరోటాక్సికోసిన్ లేదా Graves disease అంటారు. దీనిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఇది ముఖ్యంగా 30 సం.ల వయస్సు పైబడ్డ వారిలో, ఎక్కువ శాతం స్త్రీలలో వస్తుంది. కనుగుడ్లు బయటికి వచ్చినట్లు ఉండటం: కంటి లోపలి కండరాలు, కొవ్వు లోపలిభాగం వాటి కనుగుడ్లను బయటికి తోస్తాయి. ఇది థైరాయిడ్ కంతుల రూపంలో ఒకటి లేదా రెండు, మూడు ఉండవచ్చు. ూౌఛీఠ్చట జౌజ్టీట్ఛ అని కూడా అంటారు. హైపోథైరాయిడిజమ్ T3, T4 హార్మోన్స్ ఉత్పత్తి కొన్ని కారణాల వలన తగ్గిపోతుంది. లక్షణాలు =నీరసం, బద్దకం =వేడి ఉష్ణోగ్రతలో కూడా చలిగా ఉంటుంది =వయస్సు నిలకడలేకపోవటం =శరీర బరువు పెరగటం =మానసికంగా కుంగిపోవటం (డిప్రెషన్) =ముఖం వాచినట్లుండటం =జుట్టు రాలటం =చర్మం పొడిబారినట్లుండటం =మలబద్దకం =గొంతు బొంగురుపోవటం రోగ నిర్థారణ =రక్తపరీక్ష : T3, T4, TSH Levels =గ్రేవ్స్ డిసీజ్: T3, T4, లెవల్స్ ఎక్కువలో TSH లెవల్ తక్కువలో ఉంటుంది =రక్తపరీక్ష: థైరాయిడ్ యాంటీ బాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ చికిత్స హైపర్ థైరాయిడ్: Anti Thyrox, Neo ఈ డ్రగ్ థైరాయిడ్ హార్మోన్ తయారీని తగ్గిస్తుంది. హైపోథైరాయిడ్ : థైరో నార్మ్: థైరాక్సిన్ సోడియం, 25, 50 100Cg లో లభిస్తుంది. Eltroxin, Roxin, Protid, Callosl (Iodine) Liquid 8mg Iodine/5mc హైపర్ థైరాయిడిజమ్‌లో వాడవచ్చును. ఇది Thyroid hormone ను ఆపుతుంది. హోమియో వైద్యం హోమియోపతి వైద్య విధానంలో థైరాయిడ్ వచ్చేందుకు గల మూలకారణాలను విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి సరియైన హోమియో మందుల ద్వారా, తత్వ విచారణ ద్వారా చికిత్స చేయవచ్చును. హోమియోతో మంచి ఫలితాలు వస్తాయి. హైపోథైరాయిడ్‌కు కారణాలు థైరాయిడ్ గ్రంథిలోనే లోపం కలగడం. దీనినే hashimoto's thyroid వాపు అంటారు. శరీరంలో యాంటీబాడీస్ తయారై గ్రంథిని పనిచేయకుండా చేస్తుంది. ఇది కూడా ఆటోఇమ్యూన్ డిజార్డరే. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. 30 -50 సం.ల వయస్సు వారిలో రావచ్చు. నియంత్రణ లేని హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ వలన హైపోథైరాయిడ్‌గా మారవచ్చును. చిన్నపిల్లల్లో హైపోథైరాయిడ్ వలన పెరుగుదల లోపాలుంటాయి. మెదడు పెరుగుదల ఆగిపోవచ్చును. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. పుట్టుకతో థైరాయిడ్ లోపాలుండవచ్చును. వారిలో పెరుగదల ఆగిపోతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416109109 / 7416107107