breaking news
humantiy
-
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే..
సాక్షి,ఎర్రగుంట్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహమ్మద్‌పీర్ అనే యువకుడిని ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. మహమ్మద్‌పీర్ ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని మెప్మా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం బైక్‌లో కార్యాలయానికి బయలుదేరాడు.రైల్వే ఓవర్ బ్రిడ్జి పైన గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో పడిపో యాడు. ఆ సమయంలో కేజీవీ పల్లె గ్రామానికి వెళతున్న ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి చూసి కారు దిగి క్షతగాత్రుడిని పరిశీలించారు. చేయి విరిగిపోవడంతో వెంటనే ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ప్రొద్దు టూరు ఆసుపత్రికి పంపించారు. -
మంట కలిసిన మానవత్వం
కాలువలో మృత శిశువు లభ్యం సారంగాపూర్ మండలంలో భ్రూణ హత్య..! సారంగాపూర్ : మానవత్వం మంట కలిసింది. కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలిసి నెలలు నిండకుండానే అబార్షన్ చేయించుకుని కాలువలో పడేసింది ఓ మనసు లేని తల్లి. మండలంలోని ఆలూరు గ్రామంలో గురువారం ఉదయం బోయివాడ ఇళ్లమధ్యలో ఉన్న పంటకాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం బోయివాడలో స్థానికులు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో కాలువలో నెలలు నిండని పసికందు మృతదేహాన్ని గుర్తించారు. నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చి ఉంటుందని గమనించిన వెంటనే స్థానిక సర్పంచ్ చింతకుంట రాజమణికి సమాచారం అందించారు. పసికందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సారంగాపూర్ ఎసై ్స శ్రీనివాస్, పీఎస్ఐ ఎం.డీ. ఆసీఫ్‌లు అక్కడకు చేరుకుని పంచనామా నిర్వహించారు. అలాగే ఏఎన్ఎం, ఆశాకార్యకర్తల సహకారంతో గ్రామంలో గర్భిణుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వీఆర్వో సబిత, కారోబార్ మురళిలు మృతదేహాన్ని పరిశీలించారు. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్ చేయించుకుని పారేశారా....? లేదా వివాహేతర సంబంధం అని తప్పుచేశారా అనే కోణంలోఎవరీ తప్పు చేశారు అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.