breaking news
Housing units Regulation
-
డబ్బులు లేక, ఆగిన 1.74 లక్షల గృహాల నిర్మాణం
న్యూఢిల్లీ: నిర్మాణ రంగానికి నిధుల కొరత నెలకొన్న నేపథ్యంలో పలు భారీ హౌసింగ్ ప్రాజెక్టులు నిల్చిపోయాయి. దేశీయంగా హైదరాబాద్ సహా ఏడు ప్రధాన నగరాల్లో 1.74 లక్షల గృహాల నిర్మాణం ఆగిపోయింది. వీటి విలువ సుమారు రూ. 1.4 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2014, అంతకన్నా ముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులను దీనికి పరిగణనలోకి తీసుకున్నారు. నిల్చిపోయినవే కాకుండా జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం సంఖ్య 6,28.630గా ఉంటుందని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ. 5,05,415 కోట్లుగా వివరించింది. నిర్మాణ రంగాన్ని నిధుల కొరత సమస్య వెంటాడున్నందున.. పూర్తిగా నిల్చిపోయిన ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు చేసిన వారికి భవిష్యత్ అంచనాలు అత్యంత విపత్కరంగా ఉన్నాయని తెలిపింది. భారీ జాప్యమున్న ప్రాజెక్టుల్లో కొనుగోలుదారులకూ పరిస్థితి ఆశావహంగా లేవని పేర్కొంది. ఢిల్లీలో అత్యధికం .. నగరాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో సుమారు రూ. 2,727 కోట్ల విలువ చేసే 4,150 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా రూ. 86,463 కోట్ల విలువ చేసే 1,13,860 యూనిట్ల నిర్మాణం నిల్చిపోయింది. ఇది మొత్తం టాప్ 7 నగరాల్లో నిల్చిపోయిన వాటిలో 66 శాతం కావడం గమనార్హం. అటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 41,730 యూనిట్లు (విలువ రూ. 42,417 కోట్లు), పుణెలో 9,900 యూనిట్లు (విలువ రూ. 5,854 కోట్లు), బెంగళూరులో 3,870 యూనిట్లు (విలువ రూ. 3,061 కోట్లు), కోల్‌కతాలో 150 ఫ్లాట్ల (విలువ రూ. 91 కోట్లు) నిర్మాణం ఆగిపోయింది. ఇక, నిల్చిపోయిన వాటితో పాటు జాప్యం జరుగుతున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే హైదరాబాద్‌లో రూ. 11,810 కోట్ల విలువ చేసే 17,960 యూనిట్లు ఉన్నాయి. -
క్షేత్రస్థాయి పరిశీలన గడువు పెంపు
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సర్కారు తాజా నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి పరిశీలనకు గడువుపెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ అధర్ సిన్హా ఈ విషయాన్ని ప్రకటించారు. ఉచిత కేటగిరీలో వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి ఆయా మండలాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించుకోవాలని, తక్కువ దరఖాస్తులు ఉండే బీ,సీ కేటగిరీ మండలాల్లో ఈ నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేయాలని అధర్ సిన్హా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే ఎక్కువ దరఖాస్తులున్న ‘ఏ’ కేటగిరీ మండలాల్లో పరిశీలన ప్రక్రియను మార్చి15లోగా పూర్తి చేయాలని సూచించారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన వెంటనే బీ,సీ కేటగిరీ మండలాల సిబ్బందిని ఏ కేటగిరీ మండలాలకు డిప్యుటేషన్‌పై పంపాలని కలెక్టర్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే సరికి అర్హులైన వారికి పట్టాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం సమన్వయ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజేశ్వర్ తివారీ, సునీల్‌శర్మ, హర్‌ప్రీత్‌సింగ్, ఆర్వీ చంద్రవదన్, అహ్మద్ నదీమ్ సభ్యులుగా ఉన్నారు.