breaking news
	
		
	
  HIV test
- 
      
                   
                               
                   
            మాందసౌర్ ఘటన : మరో పిడుగులాంటి వార్త
భోపాల్ : మధ్యప్రదేశ్లోని మంద్సౌర్లో ఇటీవల ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఇద్దరు వ్యక్తులు అత్యంత కిరాతంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన మరునాడే ఇద్దరు నిందితులను ఆసీఫ్(24), ఇర్ఫాన్(20)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలు బాధిత బాలిక తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూతురి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్న బాధితురాలి తల్లిదండ్రులు పిడుగులాంటి ఈ వార్తతో తమ కూతురి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా నిందితుడు ఇర్ఫాన్ తల్లి తన కుమారుడికి అండగా నిలిచారు. తన కుమారుడు అమాయకుడని, తను ఎలాంటి తప్పు చేసి ఉండడని ఆమె తెలిపారు. సీబీఐతో విచారణకు సిద్ధమని, విచారణలో తన కుమారుడు తప్పు చేసినట్లు రుజవైతే ఎలాంటి శిక్షకైన సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. అయితే నిందితుడు ఇర్ఫాన్ మూడు రోజుల పాటు రిమాండ్లో ఉంచనున్నట్లు పోలీసులు తెలిపారు. - 
      
                   
                               
                   
            హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న యువరాజు

 లండన్: వేల్స్ యువరాజు హ్యారీ హెచ్ఐవీ పరీక్షలపై అందరికీ అవగాహన కల్పించాలని భావించాడు. అనుకున్నదే తడవుగా లండన్ లోని జెయింట్ థామస్ హాస్పిటల్కు వెళ్లారు. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్నారు. అయితే టెస్ట్ చేయించుకున్న విషయాన్ని వీడియో తీయించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక అంతే యువరాజు ఎయిడ్స్ పై అవగాహనా కల్పించేందుకు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకున్న వీడియో వైరల్ అయింది. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడం చాలా సులువుగా ఉంటుందని, ఈ విషయంపై అవగాహనా పెంచేందుకు తాను ఈ పని చేసినట్లు వేల్స్ యువరాజు హ్యారీ వెల్లడించారు.
 
 వచ్చే బుధవారం డర్బన్ లో జరగనున్న అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో తాను పాల్గొనునున్నట్లు ట్వీట్ చేశారు. హెచ్ఐవీ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని, ఆడా, మగా, వృద్దులు అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ హెచ్ఐవీ టెస్ట్ చేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ టెస్టులు చేయించుకోవడం చాలా సులువు అని ట్వీట్ చేశారు. హెచ్ఐవీపై పోరాడేందుకు ప్రిన్స్ హ్యారీ సరైన మార్గాన్ని ఎంచుకున్నారని టెర్రెన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ సీఈవో ఇయాన్ గ్రీన్ పేర్కొన్నారు.
 
 
 Prince Harry has been tested for HIV @GSTTnhs
 
 It's a simple finger prick test and gives a nearly instant result! pic.twitter.com/VRr6KyUSD3
 — Kensington Palace (@KensingtonRoyal) 14 July 2016
 
 
 On Wednesday next week Prince Harry will arrive in Durban for the International AIDS Conference #AIDS2016
 — Kensington Palace (@KensingtonRoyal) 14 July 2016 


