breaking news
Hamdloom
-
‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్ టిల్లు?’
సాక్షి, హైదరాబాద్: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. ఈ విషయమై కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులు కూడా ఉన్నాయన్నారు. ‘జీఎస్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని ఎందుకు కోరలేదు? ట్విట్టర్ టిల్లు దీనికేం సమాధానం చెబుతారు?’ అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ మేరకు ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు మొదటి జీఎస్టీ సమావేశంలో పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు మునుగోడు ఓట్ల కోసం ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని, అప్పటి జీఎస్టీ సమావేశంలో తాగి పాల్గొన్నారా? అని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు చేనేత వ్రస్తాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తామన్న రాష్ట్ర సర్కార్.. ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని బండి డిమాండ్ చేశారు.గత ఎన్నికల్లో మునుగోడు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కే ప్రమాదముందని, దీనిపై ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు -
చేనేతకు కావాలి చేయూత
– ప్రభుత్వాలకు పట్టని ఘనత – నేడు జాతీయ చేనేత దినోత్సవం జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల కిందట వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించిన చేనేత రంగం ఉనికిని కోల్పోతోంది. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహం లేక చేనేత సహకార సంఘాలు నిర్వీర్యమయ్యాయి. ఫలితంగా నేతన్నలకు ఉపాధి లేకుండాపోయింది. అక్కడక్కడ అదే వృత్తిని కొనసాగిస్తున్న వారికి ఆదాయం లేదు. దీంతో కుటుంబాలు గడవడం కష్టంగామారింది. చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, చేనేత రంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోకపోవడంపై నేత కార్మికులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు. – గద్వాల నాటి వైభవం తిరిగొచ్చేనా.... జిల్లాలోని గద్వాల, నారాయణపేట, కొత్తకోట, రాజోళి, అమరచింత, కోటకొండ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. నాలుగు దశాబ్దాల కిందట వేలాది మగ్గాలు ఉండేవి. దాదాపు 15వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవారు. అనేక గ్రామాలలో చాలామంది ఇళ్లల్లో కూడా వందలాది మగ్గాలు ఉండేవి. మహిళలు ఇళ్లలో కండెలు చుట్టడం, రంగులు అద్దడం వంటి పనులు చేసేవారు. చేతినిండా పని ఉండటంతో కార్మికుల అవసరాలు తీరేవి. అప్పట్లో చేనేత కార్మికులను ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహించేది. నేటి పాలకులు చెప్పడమే కానీ చేసిందేమీ లేదు. మరమగ్గాలు, అధునాతన వస్త్ర ఉత్పత్తి యంత్రాలు వచ్చాక ప్రజలు ఆధునిక నమూనా (డిజైన్లు) ఆకర్షితులు కావడంతో చేనేత వస్త్రాలకు ఆదరణ తగ్గింది. ఆధునిక వస్త్రాలతో పోలిస్తే చేనేత వస్త్రాల ఉత్పత్తి వ్యయం కాస్త ఎక్కువగా ఉండి పని కల్పించలేని పరిస్థితి ఉత్పన్నమైంది. చేసిన పనికి గిట్టుబాటు కావడంలేదు. ఇదీ జిల్లాలో చేనేత పరిస్థితి ప్రస్తుతం నేత కార్మికులు – 22వేల నుంచి 25వేలు చేనేత సొసైటీలు – 107 మాస్టర్ వీవర్స్ – 60 నుంచి 80మంది వలస వెళ్లిన కార్మికులు – సుమారు 2వేలు అనారోగ్యంతో మృతి చెందిన కార్మికులు – సుమారు 500 ఇతర పనులకు వలస వెళ్లిన వారు – సుమారు 1500 ప్రతిబంధకాలకు ప్రత్యామ్నాయాలివే – రూ.లక్షల పెట్టుబడి పెట్టి నూలు, ఇతర ముడి సరుకుల కొనుగోలు చేసే స్థోమత సంఘాలకు లేదు. ఉత్పత్తి లేనందున కార్మికులకు పని లభించడం లేదు. సంఘాలకు ప్రభుత్వం మూలధనం సమకూర్చాలి. ముడి సరుకుల కొనుగోలుకు రాయితీలు ఇవ్వాలి. పలు సంఘాల భవనాలు శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనాలు నిర్మించాలి. – ఆధునిక వస్త్రాల తయారీ, మార్కెటింగ్‌లో సంఘాలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. వాటిని అధిగమించడానికి ప్రభుత్వం సహకరించాలి. – చేనేత కార్మికులకు తగిన ఆదాయం రాక పనులు మానుకుంటున్నారు. ఉపాధిహామీ పథకాన్ని చేనేత రంగానికి అనుసంధానించి కార్మికులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయాలి. బీడీ కార్మికుల మాదిరి జీవన భృతి ఇవ్వాలి. పింఛన్లు, ఇళ్లస్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలి. – చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు కార్మికుల రుణాలు మాఫీ కాలేదు. వెంటనే మాఫీ చేయాలి. ప్రస్తుతం నిలిపివేసిన సిల్కు సబ్సిడీని పెంచుతూ కొనసాగించాలి. – నిరుద్యోగ యువత చేనేత వృత్తి వైపు ఆసక్తి కనబర్చడం లేదు. వారికి ఆధునిక డిజైన్లలో వస్త్రాల తయారీకి శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలి. సొంత మగ్గాల స్థాపనకు రాయితీపై రుణ సదుపాయం కల్పించాలి. ముడి సరుకులపై రాయితీ ఇవ్వాలి – రామలింVó శ్వర కాంళ్లే, చేనేత క్లస్టర్ చైర్మన్, గద్వాల నూలు, ఇతర ముడి సరుకులపై రాయితీ ఇవ్వాలి. పెట్టుబడి లేక ఉత్పత్తి పెంచలేని పరిస్థితి ఉంది. కార్మికులకు ఇస్తున్న డబ్బులు గిట్టుబాటు కావడంలేదు. సిల్కు సబ్సిడీని కొనసాగిస్తూ 20శాతానికి పెంచాలి. ప్రభుత్వం సంఘాలను ప్రోత్సహించి చేనేత కార్మికులను ఆదుకోవాలి. చేనేత రుణాలను మాఫీ చేయాలి. ఉపాధి హామీతో అనుసంధానించాలి – దామ వీరన్న, ఆప్కో డైరెక్టర్ జిల్లాలో చేనేత సహకార సంఘాలు నడవలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేనేత రంగాన్ని ఉపాధిహామీతో అనుసంధానిస్తే కార్మికులకు, సంఘాలకు మేలు జరుగుతుంది. సిల్కు సబ్సిడీని రూ.600 నుంచి రూ.1000కి పెంచాలి. ప్రతి కార్మికునికి అంత్యోదయ కార్డులివ్వాలి. చేనేత సహకార సంఘాల నుంచి టెస్కో సంస్థ ప్రతినెలా కొనుగోలు చేసి బిల్లులు చెల్లించాలి.