breaking news
haarathi
-
శ్రీమఠం ఆదాయ మంత్రం
– అర్చన హారతులకు టికెట్ – రూ. 50గా నిర్ణయం – సోమవారం రాత్రి నుంచి అమల్లోకి – అసంతప్తిలో భక్తులు మంత్రాలయం: శ్రీమఠం ఆదాయ మంత్రాన్ని జపిస్తోంది. మంత్రాలయం గ్రామ దేవత మంచాలమ్మ గుడి నిర్వహణ పూర్తిగా మఠాధీశుల చేతుల్లోకి వెళ్లడంతో అమ్మవారి అర్చన హారతికి పైకం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సద్గురు శ్రీరాఘవేంద్రస్వామికి గ్రామ దేవత మంచాలమ్మ ఆశ్రయం ఇచ్చారని చరిత్ర. అందుకు కతజ్ఞతగా ముందుపూజ మంచాలమ్మకు తదుపరి దర్శనం రాఘవేంద్రుల మూలబందావనానికి నిర్ణయించారు. ఒకప్పుడు మంచాలమ్మ ఆలయం ప్రత్యేకంగా ఉండేది. శ్రీమఠం ఈశాన్య భాగంలోని వెలసిన మంచాలమ్మ గుడిని శ్రీమఠం ప్రాకారంలో కలిపి నిర్మించారు. గ్రామానికి చెందిన లింగాయితీలు మంచాలమ్మ పూజారులుగా కొనసాగుతున్నా మఠా«ధీశుల నిర్ణయమే ఇక్కడ శాసనంగా మారింది. ఇప్పటికే మంచాలమ్మ హుండీ ఆదాయం మఠం ఖాతాలో జమ చేస్తున్నారు. దేవర ఉత్సవాలు, తదితర వేడుకలు గ్రామస్తులే చేస్తున్నా ఆలయ ఆదాయం మాత్రం శ్రీమఠానికి చెందేలా నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి అర్చన సహిత హారతులకు టికెట్ పెట్టేశారు. సోమవారం రాత్రి నుంచి రూ.50 చొప్పున టిక్కెట్ నిర్ణయించి కౌంటర్ సైతం ఏర్పాటు చేసేశారు. గ్రామ భక్తులు సైతం ఇక అర్చన, హారతులు పట్టాలంటే కచ్చితంగా రూ.50 చెల్లించాల్సిందే. దీంతో గ్రామస్తులు, భక్తులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి సూచన మేరకే: శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు సూచన మేరకే అర్చన సహిత హారతులకు టిక్కెట్ నిర్ణయించాం. సోమవారం రాత్రి నుంచి ఈ విధానం అమల్లో ఉంటుంది. మఠం నియమ నిబంధనలు మేరకు భక్తుల సహకరించాలి. – శ్రీనివాసరావు, శ్రీమఠం మేనేజర్ -
చూడాలంటే ఎన్నో కష్టాలు
హారతి చూసేందుకు 2 కి.మీ. నడవాల్సిందే రకరకాల ఆంక్షలు భక్తులకు తీవ్ర ఇబ్బందులు ప్రాంగణమంతా ప్రభుత్వ సిబ్బందే పవిత్ర పుష్కరాల్లో చూసి తరించాల్సిందేనంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమం హారతి కార్యక్రమం అధికారులకు, వీవీఐపీలకే పరిమితమా?, సామాన్య భక్తులను ఆంక్షల పేరుతో అనుమతివ్వడమే గగనమైంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. విజయవాడ: పవిత్ర సంగమం వద్ద నిత్యహారతి కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నగరంలో పలు ప్రాంతాలనుంచి భక్తులను సాయంత్రం బస్సులో ఇబ్రహీంపట్నం తరలిస్తున్నారు. సాయంత్రం హారతి సమయానికి ఒక గంట ముందు ఇబ్రహీంపట్నం రింగ్ వరకు మాత్రమే బస్సులను అనుమతిస్తున్నారు. అక్కడికి చేరుకున్న భక్తులను బస్సుల్లోంచి దించి కాలినడకన ఘాట్‌వద్దకు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. మొదటి ఐదు రోజులు ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఉచిత బస్సులపై ఆంక్షలు విధించారు. బస్సులను సాయంత్రం వేళల్లో అనుమతించకుండా శాటిలైట్ బస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బుడమేరు కట్టపై వేసిన రోడ్డుద్వారా ముఖ్యమంత్రి ఘాట్ వద్దకు చేరకుంటున్నారు. ఆ సమయంలో భక్తులను రింగ్ సెంటర్‌నుంచి కాలినడకన ఫెర్రీ రోడ్డులోకి పంపుతున్నారు. నవహారతులు చూడాలని వచ్చే భక్తులు ఘాట్ వద్దకు 2కి. మీ నడిచివెళ్లాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. హారతి కార్యక్రమానికి చేరుకోలేక కొందరు ఉసూరంటూ వెనుదిరుగుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చారా.. మరింత కష్టం ముఖ్యమంత్రి ఘాట్ వద్ద ఉన్న సమయంలో అయితే పరిస్థితి ఇంకా కష్టం. రకరకాల ఆంక్షలు విధించడంతో పాటు పోలీసు, పారిశుధ్య, వైద్య సిబ్బందితోనే ప్రాంగణం కిక్కిరిసి పోతోంది. ఇక సమయానికి చేరుకోవడం దుర్లభమే. హారతి కోసం వచ్చే భక్తులు దూరం నుంచి చూసి వెనుదిరగాల్సి వస్తోంది. గత ఐదు రోజుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముఖ్యమంత్రి వావానాలు నిలిపి ఉంచే చోట హారతి వీక్షించేందుకు వీలుగా చిన్న డిస్ప్లే ఏర్పాటు చేశారు. అయినా ప్రత్యక్షంగా చూడడానికి వస్తే టీవీ తెరపై చూసి తిరిగి వెళ్లాల్సి వస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు.