కొండారెడ్డిపల్లిలో ప్రకాష్ రాజ్ పర్యటన
మహబూబ్నగర్ : సినీనటుడు ప్రకాష్ రాజ్ మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో భేటీ అయ్యారు. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రకాష్ రాజ్ గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం స్ఫూర్తితో ఓ గ్రామాన్ని దత్తత తీసుకోడానికి ప్రకాష్ రాజ్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావును సోమవారం కలిశారు.