breaking news
Geostationary orbit
-
ధరణిని దాటి శుక్రుడిని చూసి..
అప్పగించిన పనిచేయకుండా ఆవారాగా తిరిగితే ఎవరైనా తిడతారు. కానీ చెప్పిన పని చేస్తూనే మరో కొత్త విషయాన్ని కనిపెట్టినందుకు ప్రశంసలను అందుకున్నాయి రెండు జపాన్ ఉపగ్రహాలు. భూవాతావరణ విశేషాలను రాబట్టేందుకు ప్రయోగించిన హిమవరీ–8, హిమవరి–9 కృత్రిమ ఉపగ్రహాలు చివరకు శుక్ర గ్రహ మేఘావృత ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలను వెల్లడించి ఇప్పుడు శెభాష్ అనిపించుకున్నాయి. శుక్రగ్రహం మీది వాతావరణ తరంగాల్లో మార్పులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవి సేకరించాయి. దశాబ్దకాల డేటా.. బిర్లాటెంపుల్ ముందు ఒక పేద్ద కుటుంబం ఒకరి తర్వాత ఒకరు ఫొటోలు దిగుతుందనుకుందాం. అప్పుడు సమీపంలో గుర్తు తెలియని పిల్లాడు ఉంటే అతను ఈ ఫొటోలన్నింటిలోనూ పడతాడు. అతని హావభావాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. అచ్చం అలాగే భూ స్థిర కక్ష్యలో తిరుగుతూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి భూ వాతావరణ ఫొటోలు తీసేందుకు జపాన్ హిమవరి–8 ఉపగ్రహాన్ని 2014లో, హిమవరి–9 అనే ఉపగ్రహాన్ని 2016లో నింగిలోకి పంపింది. ఇవి 2015 నుంచి ఇప్పటిదాకా వేలాది ఫొటోలను తీశాయి. అయితే వీటిని గమనించగా అన్ని ఫొటోల్లోనూ ఒక మూలగా శుక్రుడు సైతం కనిపించాడు. దీంతో ఈ పదేళ్లకాలంలో శుక్రుని వాతావరణ మార్పుల వివరాలను సేకరించేందుకు సువర్ణావకాశం లభించింది. ఇది సువర్ణావకాశం ఎందుకంటే భూమి నుంచి టెలిస్కోప్ ద్వారా శుక్రుడిని గమనించాలంటే భూవాతావరణం అంతగా అనుకూలించదు. పైగా అదే సమయంలో సూర్యుడి దేదీప్యమానమైన కాంతి ప్రభావం శుక్రునిపై ఉంటుంది. దాంతో భూమి నుంచి శుక్రుడిని గమనించడం కష్టం. ఇప్పటికే శుక్రుడి సంబంధింత వర్ణ తరంగధైర్ఘ్య సమాచారం సైతం పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో అనుకోకుండా రెండు వాతావరణ ఉపగ్రహాల డేటాలో చిక్కిన శుక్రుని వివరాలు ఇప్పుడు ఆ గ్రహ వాతావరణంపై పరిశోధనకు అక్కరకొస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు శుక్రునిపై మందపాటి కార్భన్‌డయాక్సైడ్ వాతావరణం పరుచుకుని ఉంటుంది. పైగా ఆకాశం సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలలతో కప్పబడి ఉంటుంది. గత పదేళ్లుగా హిమవరి 8, 9 ఉపగ్రహాలు పంపిన సమాచారాన్ని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు విశ్లేíÙంచారు. మల్టీస్పెక్ట్రల్ హిమవరి ఇమేజర్స్ సాయంతో రోజువారీగా, సంవత్సరాలవారీగా వాతావరణ మార్పులను సరిపోల్చిచూశారు. ‘‘గతంలో ఏ ఉపగ్రహాన్ని ఇలా పదేళ్లపాటు నిరాటంకంగా పరిశీలించలేదు. భూమి కోసం ఉద్దేశించిన ఉపగ్రహాలు అనుకోకుండా ఇలా శుక్రుని డేటాను ఒడిసిపట్టాయి. శుక్రుని వాతావరణంలో సూర్యకాంతి పరావర్తనం, గాలి వేగం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వివరాలు తెల్సుకునేందుక ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉష్ణ తరంగాల్లో మార్పులనూ తెల్సుకోవచ్చు’’అని పరిశోధనలో కీలక రచయిత అయిన గక నిషయమ చెప్పారు. ‘‘విభిన్న తరంగధైర్యాలతో విస్తరించే పరారుణ కాంతిని ఒడిసిపట్టేందుకు హిమవరి శాటిలైట్లలోని సెన్సార్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మరో నాలుగేళ్లపాటు ఇవి సేవలందిస్తాయి. 2030దాకా ఏ దేశం కూడా శుక్రుని వాతావరణ పరిశోధన కోసం ప్రత్యేక ప్రాజెక్ట్చేపట్లేదు. ఈ నేపథ్యంలో హిమవరి శాటిలైట్ల తదుపరి డేటా సైతం కీలకంగా మారనుంది’’అని నిషయమ చెప్పారు. పరిశోధకులు 437 భిన్న వాతావరణ పరిస్థితుల్లో శుక్రునిపై మేఘాల పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. శుక్రుడు, భూమి వేర్వేరు కోణాల్లో సమీపానికి వచి్చనప్పుడు శుక్రుని వాతావరణంలో జరిగే మార్పులను తెల్సుకునేందుకు ఇప్పుడు అవకాశం చిక్కింది. హిమవరి అంటే జపాన్ భాషలో పొద్దుతిరుగుడు పువ్వు అని అర్థం. నిరంతరంగా భూమిని పరిశీలిస్తూ భూ స్థిర కక్ష్యలో తిరుగుతాయని, అందుకు గుర్తుగా ఈ పేరు ఎంపికచేసినట్లు ఆనాడు జపాన్ ప్రకటించింది. -
మన అంతరిక్ష కేంద్రంపై... ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఎస్ కక్ష్యే ఎందుకు? ఐఎస్ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు ఐఎస్ఎస్తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఏఎస్ కొన్ని విశేషాలు... → భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం → ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది → బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది → దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం → బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పీఎస్ఎల్వీ సక్సెస్
భూస్థిర కక్ష్యలో చేరిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహం శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని గురువారం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి ఇస్రో 33వ సారి విజయబావుటా ఎగురవేసింది. ఇస్రో స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో 1,425 కిలోల ఈ ఉపగ్రహాన్ని 20.2 నిమిషాలకు పెరిజీ (భూమికి దగ్గరగా) 284 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) గురువారం వేదికైంది. దిగ్విజయంగా కక్ష్యలోకి.. మంగళవారం ఉదయం 9.30కి ప్రారంభమైన కౌంట్‌డౌన్ 54.30 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగిశాక టెన్ టు వన్ అంకెలు చెబుతూ జీరో అనగానే సాయంత్రం 4.01 గంటలకు రాకెట్ ఎరుపు నారింజ రంగు మంటలు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఇక ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఒక ప్రయోగం మాత్రమే మిగిలి వుందని ఆయన అన్నారు. ప్రయోగం జరిగింది ఇలా.. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ32 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో4 దశలతో ప్రయోగించారు. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఇంధనంతో 108.6 సెకన్లకు మొదటిదశను, 42 టన్నుల ద్రవ ఇంధనంతో 259.8 సెకన్లకు రెండోదశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 655.3 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ఇంధనంతో 1,175.3 సెకన్లకు నాలుగోదశను పూర్తిచేశారు. సొంత వ్యవస్థ కోసం దేశీయ అవసరాల కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థకు 2006లో శ్రీకారం చుట్టి 2013 జూలైలో తొలిఉపగ్రహం (ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ)ను పీఎస్ఎల్వీ సీ22 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. 2014 ఏప్రిల్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ, అక్టోబర్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ, 2015లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ, 2016 జనవరిలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ, గురువారం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్‌తోపాటు ఇప్పటికి ఆరు ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేశారు. ప్రధాని మోదీ అభినందన ప్రయోగం విజయవంతమవడంపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. మన శాస్త్రవేత్తల విశేష కృషికి సెల్యూట్ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ-సీ32 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో దేశం అంతరిక్ష రంగంలో మరింత దూసుకెళ్లిందని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు.