breaking news
Gangrapes
-
‘ఎనిమిది నెలల్లో 229 రేప్‌లు’
ముంబై: వాణిజ్య రాజధాని రేప్ రాజధానిగా మారిపోతోంది. ఈ ఏడాది ఆగస్టు వరకు నగరంలో 229 అత్యాచారాలు, ఎనిమిది సామూహిక అత్యాచారాలు జరిగాయి. ఎనిమిది నెలల్లోనే నమోదైన ఈ కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ ఘాతుకాలకు పాల్పడ్డారు. సామాజిక కార్యకర్త అనిల్ గల్గలీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఈ విషయాలు ముంబైకర్లను కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు వరకు ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అనిల్ అన్నారు. నగర శివారు ప్రాంతం దిందోషి, బోరివలిలో మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారాలు నవంబర్‌లో రెండు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఇదిలావుండగా దేశంలో సురక్షిత నగరం ముంబై అని పోలీసులు అంటున్నారు. అనేక కేసుల్లో స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపొరుగువారే ఈ అత్యాచారాలు చేశారని తెలిపారు. ఇందుకు గతంలో జరిగిన కేసులే నిదర్శనమని ముంబై పోలీసు అసిస్టెంట్ కమిషనర్ భగవాన్ చటే అన్నారు. శక్తి మిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు అని చెప్పారు. నగరంలో జరుగుతున్న ఇలాంటి నేరాలను సాధ్యమైనంత మేర అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. -
ముంబైలో 229 అత్యాచారాలు, 8 గ్యాంగ్ రేప్స్
గత 8 ఎనిమిది నెలల కాలంలో భారత ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో మహిళలపై అత్యాచారాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. సామాజిక కార్యకర్త అనిల్ గాల్ గాలి విజ్క్షప్తి మేరకు సమాచార హక్కు చట్టం కింద అందించిన వివరాల ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టు చివరి వరకు ముంబైలో 229 అత్యాచార కేసులు, ఎనిమిది గ్యాంగ్ రేప్ కేసులు నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే పరిచయస్తులు, స్నేహితులు, ప్రేమికులు, ఇరుగుపోరుగు వారే అత్యధిక కేసుల్లో నిందితులు పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం చివరి వరకు అత్యాచారాల సంఖ్య మరింత పెరుగుతుందని పోలీసులు తెలిపారు. నవంబర్ లోనే మైనర్లపై రెండు అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీధుల్లో పోలీసుల పర్యవేక్షణ లోపించడం, నాకా బందీలు చేయకపోవడం కారణంగానే మహిళపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త అభిప్రాయపడ్డారు. గత సంవత్సరం 223 అత్యాచా కేసులు, ఎనిమిది గ్యాంగ్ రేప్ కేసులు కాగా, 211 అత్యాచారాలు, 9 గ్యాంగ్ రేప్ కేసుల, 2010 లో 188, 7 గ్యాంగ్ రేప్ లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శక్తి మిల్స్ గ్యాంగ్ రేప్ లాంటి సంఘటనలు ముంబైలో అరుదుగా నమోదవుతుంటాయని పోలీసులు తెలిపారు. నేరాలను అరికట్టేందుకు తాము శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం అని పోలీసులు అన్నారు.