breaking news
gang maintain
-
జైలు నుంచే ‘ఉగ్ర నెట్వర్క్’
సాక్షి, హైదరాబాద్: కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఉంటూ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఉగ్రవాద నెట్వర్క్ విస్తరణకు యత్నిస్తున్న వైనం బయటపడింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్లా బాసిత్.. తీహార్ జైల్లో ఉంటూ సీఏఏకు వ్యతి రేకంగా స్మార్ట్‌ఫోన్ సాయంతో మద్దతు కూడ గడుతూ ఓ గ్రూపును తయారుచేస్తున్నట్టు వెల్లడైంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన జహన్ జెబ్ సామి, హీనా బషీర్‌బేగ్ దంపతులు ఇటీవల ఢిల్లీ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఐసిస్‌కు చెందిన ఖొరాసన్ మాడ్యూల్లో ఉగ్రవాదులుగా మారిన వీరిద్దరూ, బాసిత్ ఆదేశాలతో సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నట్టు విచారణలో తేలింది. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరి కార్యకలాపాలకు విఘాతం ఏర్పడింది. దీంతో వీరిద్దరినీ ఢిల్లీకి రప్పించిన బాసిత్ అక్కడి ఓక్లాలోని జామియానగర్‌లో ఉంచాడు. సామి ప్రైవేట్ ఉద్యోగిగా, హీనా గృహిణిగా చలామణి అవుతూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించా రు. దీనిపై సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ ఇటీవల ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జం ట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ల విశ్లేషణ, విచారణలో వెలుగుచూసిన వివరాల ఆధారంగా బాసిత్‌ను నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడి కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ సమాచారం ఇచ్చారు. జైలు నుంచే స్మార్ట్‌ఫోన్‌తో.. విచారణలో జమ్మూకశ్మీర్ జంట తెలిపిన వివరాల ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్.. తీహార్ జైలులో ఉన్న అబ్దుల్లా బాసిత్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెం దిన యువతకు బాసిత్ సోషల్‌మీడియా ద్వారా వలవేస్తూ ఉగ్ర బాట పట్టేలా చేస్తున్నాడని విచారణలో వెల్లడైంది. దీంతో బాసిత్‌కు జైల్లో సెల్‌ఫోన్ ఎలా అందిందనే దానిపై ఆరా తీస్తున్నారు. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ (26) ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్ సా నుభూతిపరుడిగా మారాడు. 2014, ఆగస్టు లో మరికొందరితో కలిసి పశ్చిమబెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసు కోవాలని భావించాడు. నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకువచ్చి కౌన్సెలింగ్ చేసి విడిచిపెట్టాయి. అనంతరం హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆర్నెల్ల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరాడు. 2015, డిసెంబర్లో ఐసిస్‌లో చేరుతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని అరెస్టుచేశారు. బెయిల్‌పై బయటికొచ్చిన బాసిత్.. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుధాబి మాడ్యూల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టుచేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ బాసిత్ వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పలువురిని ఆకర్షిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌కు చెందిన భార్యభర్తలు ఈ విధంగానే అతని వలలో పడ్డారు. -
‘సింగిల్ హ్యాండ్’ చక్రధర్!
వాహన భాగాల మార్పు, ధ్రువీకరణల తయారీ అన్నీ సొంతంగానే చేసుకునే ఘరానా నేరగాడు 15 బ్యాంకు ఖాతాలున్నట్లు గుర్తించిన అధికారులు అనుచరులకూ నేర చరిత్ర సాక్షి, సిటీబ్యూరో: వ్యవస్థీకృత నేరాల కోసం ముఠాను ఏర్పాటు చేసుకున్న ఎవరైనా తాము పర్యవేక్షిస్తూ ఇతరులతో పని చేయిస్తారు. అంతర్రాష్ట్ర వాహనాల చోరీ గ్యాంగ్ లీడర్ సంగపు చక్రధర్ వ్యవహారం దీనికి భిన్నం. అన్ని పనులూ తానే చేసుకుంటూ... తరలింపు కోసమే అనుచరులను వాడేవాడు. ఈ మేరకు నిందితుని అరెస్టు చేసిన సీసీఎస్ అధికారులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇతడు దొంగ వాహనాలను ‘దొర’గా మార్చి అమ్మడంలో భారీ తతంగం ఉంటోంది. తొలుత ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి ‘స్క్రాప్ వాహనాల’ సమాచారం సేకరణ... వాటి ఖరీదు... పత్రాలు... ఇంజిన్... చాసిస్ నెంబర్లు ఉండే భాగాలతో పాటు ఈసీఎం పరికరాల సేకరణ ఒక ఎత్తు. ఉత్తరాదిలో వాహనాలు చోరీ చేయించడం... వాటిని సిటీకి తరలించడం... ఇంజిన్, చాసిస్ నెంబర్లు ఉండే భాగాలను కత్తిరించడం... ఏమాత్రం అనుమానం రాకుండా ‘స్క్రాప్ వాహనాల’ నుంచి తీసినవి అతికించడం మరో ఎత్తు. వాహనాల చోరీ, తరలింపు మినహా... మిగిలిన అన్నీ రాగన్నగూడలోని తన డెన్‌లో చక్రధరే స్వయంగా చేసేవాడు. వాహనాల ఆర్సీ, ఎన్ఓసీ సహా ఇతర ఆర్టీఏ ధ్రువీకరణ లను కంప్యూటర్ ద్వారా తయారు చేసి వినియోగించేవాడు. ూమూలుగా చూస్తే తనిఖీ చేసిన అధికారులూ బోగస్‌గా గుర్తు పట్టలేని విధంగా రూపొందించేవాడు. ఇలా ఆటోమెబైల్ ఇంజినీర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు దీటుగా వాహన భాగాలను మార్చేస్తున్న నిందితుడు బీఏ, ఆ తరువాత హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశాడు. 15 బ్యాంకు ఖాతాలపై దృష్టి... నాలుగు రాష్ట్రాల్లో నేరాలు చేసిన ఘరానా నేరగాడు చక్రధర్‌కు బాధ్యతలూ ఎక్కువే. దాదాపు 10 మంది సభ్యులున్న కుటుంబాన్ని పోషిస్తున్నాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసిన నేరాల ద్వారా వచ్చిన నగదును ఏం చేస్తున్నాడనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆయనకు15 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించిన సీసీఎస్ అధికారులు వాటి లావాదేవీలపై దృష్టి పెట్టారు. మరోపక్క చక్రధర్‌ది జల్సా జీవితమని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నిందితుడిపై నాలుగు రాష్ట్రాల్లో ఐదు కేసులు (ఒకటి 65 వాహనాల చోరీకి సంబంధించింది) ఉండగా... అనుచరులైన శివపై మూడు రాష్ట్రాల్లో నాలుగు, కిషోర్‌పై రెండు రాష్ట్రాల్లో మూడు, శీనుపై రెండు రాష్ట్రాల్లో ఆరు, తన్వీర్‌పై మహారాష్ట్రలో 13, విజయ్‌పై అదే రాష్ట్రంలో నాలుగు కేసులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ గ్యాంగ్ చోరీ చేసిన 35 వాహనాల్లో అత్యధికం మహారాష్ట్రలోని పుణే, ముంబైలకు చెందినవని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే రెండింటిని గుర్తించగా... మిగిలిన వాటి యజమానుల వివరాలు, కేసులను ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం, ఓ అధికారినీ పంపాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులకు వర్తమానం పంపారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఓ అధికారి చెప్పారు. మరోపక్క ఏదైనా వాహనం ప్రమాదానికి లోనై, బీమా మొత్తాన్ని పొందిన తరవాత దాన్ని వారికి స్వాధీనం చేస్తారు. ఇలాంటి వాటిని బీమా కంపెనీలు వేలంలో స్క్రాప్‌గా విక్రయిస్తాయి. వాటి వివరాలను ఆర్టీఏ డేటాబేస్ నుంచి తొలగించే విధానం లేకపోవడం ఈ ముఠాకు కలిసి వచ్చింది. దీన్ని గుర్తించిన సీసీఎస్ అధికారులు సంబంధిత విభాగానికి లేఖ రాయాలని నిర్ణయించారు.