breaking news
free speech
-
సిగ్గు చేటు.. ట్రూడోపై మస్క్ ఆగ్రహం
శాన్ఫ్రాన్సిస్కో: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. కెనడాలో స్వేచ్ఛా హక్కును ట్రూడో ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారాయన. ఆన్లైన్ స్ట్రీమింగ్ సేవల నియంత్రణ కోసం కెనడా ప్రభుత్వం ఈ మధ్యే కొత్త రూల్ తెచ్చింది. దాని ప్రకారం.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ తప్పనిసరిగా ప్రభుత్వ పరిధిలో రిజిస్టర్ చేసుకోవాలని రూల్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మస్క్ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నిబంధనలపై ఓ జర్నలిస్ట్, మస్క్‌ను ప్రశ్నించారు. దీనిపై ఎక్స్ ద్వారా ఘాటుగానే ఎలన్ మస్క్ స్పందించారు. సిగ్గు చేటు అని ట్రూడో సర్కార్‌పై మండిపడ్డారు. Trudeau is trying to crush free speech in Canada. Shameful. https://t.co/oHFFvyBGxu — Elon Musk (@elonmusk) October 1, 2023 ఇదిలా ఉంటే.. వాక్ స్వేచ్ఛను అణచివేస్తోందన్న ఆరోపణలు ట్రూడో ప్రభుత్వం ఎదుర్కోవడం కొత్తేం కాదు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ట్రక్కు డ్రైవర్ల నిరసనలను అణగదొక్కేందుకు అత్యవసర అధికారాన్ని ఉపయోగించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఖలీస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ ట్రూడో సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి కూడా. -
అమితాబ్ వ్యాఖ్యలపై.. బీజేపీ, టీఎంసీ వాగ్యుద్ధం
కోల్‌కతా: భావప్రకటన స్వేచ్ఛపై బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల మంటలు రేపాయి. గురువారం కోల్‌కతాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నటుడు షారూక్ ఖాన్ సమక్షంలో అమితాబ్ మాట్లాడుతూ పౌర హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ఇంకా ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఆ వ్యాఖ్యలు మమత నిరంకుశ ధోరణికి అద్దం పట్టేలా ఉన్నాయంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శించారు. టీఎంసీ ఎంపీ, నటి నస్రత్ జహాన్ వాటిని ఖండించారు. బీజేపీ పాలనతో నిజంపై అన్ని రంగాల్లోనూ నిర్బంధం కొనసాగుతోందని ఆరోపించారు. ఇదీ చదవండి: కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్ -
వాక్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇద్దాం: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ వాక్ స్వాతంత్ర్యంపై మాట్లాడాడు. ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు ముందే టోరెంట్ సైట్లలో లీక్ కావడంపై పరోక్షంగా మండిపడ్డాడు. ఆ సినిమాను కేవలం థియేటర్లలోనే చూడాలని పిలుపునిచ్చాడు. పైరేట్లు, పైరసీ విజయం సాధించకుండా మనమంతా చూడాలని చెప్పాడు. ఉడ్తా పంజాబ్ సినిమాకు సీబీఎఫ్సీ భారీమొత్తంలో కట్లు పెట్టగా, బాంబే హైకోర్టు దానికి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, విడుదలకు ముందుగానే ఆ సినిమా టోరెంట్ సైట్లలో లీకైపోయింది. సెన్సార్ కోసం ఇచ్చిన సినిమా ప్రింటే ఆన్లైన్లో లీకైందని అంటున్నారు. దానిమీద 'ఫర్ సెన్సార్' అనే స్టాంపు ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమిర్ స్పందించాడు. Let's support free speech. Let's watch Udta Punjab only in theatres. Don't let pirates and piracy win. Love. a. — Aamir Khan (@aamir_khan) 16 June 2016 -
'ఆ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది'
న్యూ ఢిల్లీ: భారత రాజ్యాంగం అసమ్మతిని వ్యక్తపరచడానికి పూర్తి స్వేచ్ఛనిస్తుంది. కానీ, దేశ విధ్వంసాన్ని అనుమతించదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నమ్మకాలు, మార్గాలకు జాతీయ భావజాలం దిశానిర్ధేశం చేస్తుందని తెలిపారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని పునరుద్ఘాటించారు. రెండు రోజుల బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. 'భారత్ మాతా కీ జై' స్లోగన్ విషయంలో ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. భారత్ మాతాకీ జై స్లోగన్ విషయంలో భారతీయులకు ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. శనివారం ఈడెన్ గార్డెన్లో జరిగిన పాకిస్తాన్, భారత్ మ్యాచ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. -
మేధావులక్కోపం వచ్చింది
జీవన కాలమ్ ఇది చాలా సబబు. సమాజ చింతనలో జల్లెడ పట్టిన చాలా ఆలోచనలకు ఆయా కళల ద్వారా మన్నికయిన చట్రాన్ని ఏర్పరచగ లిగిన వ్యక్తులు వీరు. ముఖ్యంగా ఆనాటి ప్రభుత్వం గుర్తింపు, బహుమతులూ పొందినవారు. కనుక వీరి ఆలోచనలలాగే, వీరి ఆవేశాలనూ సమాజం గుర్తించవ లసిన అవసరం ఉంది. న్యాయమే.అయితే సమాజంలో గుర్తింపు పొందిన మేధావులు 5 శాతం అనుకొంటే, ప్రభుత్వం గుర్తింపు పొందని వారూ ఇంకా ఎక్కువ మంది ఉండి ఉంటారు. బహుమతులో, గుర్తింపో రానంత మాత్రాన వారి కృషినీ, సమాజ గతి పట్ల వారి స్పందనల్నీ తక్కువ చెయ్యలేం. కాగా, బహుమతులు పుచ్చుకున్న వారు- పురుషులందు పుణ్య పురుషులు. గత 15 నెలలుగా పదవిలో ఉన్న కొత్త ప్రభుత్వం ధోరణీ, మతానికి సంబంధించిన - వారి దూకుడూ నచ్చని ఈ మేధావులు చరిత్రలో మొదటిసారి నోరు విప్పారు. కనీ వినీ ఎరగని రీతిలో తమ తమ పురస్కా రాలను వాపసు ఇస్తూ - ప్రస్తుత పాలక వ్యవస్థ ధోరణి మీద తమ అసహనాన్ని ప్రకటించారు. ఇది మంచి పరిణామం. మన పెద్దలు- మనం చెప్పినా వినిపిం చని, వినిపించలేని మన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించడం- మనకు ధైర్యాన్నిస్తుంది. అయితే ఇది అందరి అభిప్రాయ మా? అదే అయితే మరి ఈ పాలక వ్యవస్థ పదవిలోకి రావడమే మెజారిటీ మద్దతుతో కదా? అప్పుడు ఈ మేధావుల ఆలోచన మైనారిటీ కదా? వ్యవస్థ మీద ఎక్కువ మంది నమ్మకాన్ని ప్రక టించారు. అందులో ఈ మేధావులు లేక పోవచ్చు. సబబే. మరికొన్ని సంవత్సరాలుగా గుర్తిం పుని ఆహ్వానిస్తూ, బహుమతులు గ్రహిస్తున్న వీరు లోగడ జరిగిన- ఇంతకంటే భయంకరమైన దురాగతాలకు ఎం దుకు స్పందించలేదు? కనీసం- ఇంతగా ఎందుకు స్పందిం చలేదు? కనీసం ఇలా ఎందుకు స్పందించలేదు? ఒకరిద్దరు సమాధానాలు చెప్పారు. 'అప్పుడూ మేం స్పందించాం బాబూ. మీరు వినిపించుకోలేదు' - అన్నారు కొందరు. 'అప్పట్లో మాధ్యమాల ముమ్మరం ఇంతగా లేదు కనుక, అప్పటి వారి నిరసనలు ఎక్కువగా వినిపించలేదు'- అన్నారు మహేష్ భట్ సోదరుడు ముఖేష్ భట్. 'మా అసహనాన్ని ఎలా, ఎప్పుడు ప్రకటించాలో మా ఇష్టం. మాకా స్వేచ్ఛ ఉంది' అన్నారొక మేధావి.అయితే ఇంతకంటే భయంకరమైన పరిస్థితులలో నీర సంగా స్పందించి, అసలు నోరిప్పకుండా, ఇప్పుడు వీధిన పడటంవల్ల ఒకటి అర్థమౌతోందని ఒక చానల్ వాపోయిం ది. 'ఆ ఘటన మీద కాక ఆ వ్యవస్థ మీదే నమ్మకం లేదని'- అంది. 'అవును. మోదీకి మేం వ్యతిరేకం' అని ఒకరిద్దరు మేధావులు బల్లగుద్దేశారు. సజావయిన కారణాలకి లోగడ స్పందించని, స్పందిం చినా మనకు తెలిసేటట్టు స్పందించని, మాధ్యమాల ఫోకస్ లేనంతగా స్పందించిన, మోదీ అంటే స్పష్టంగా ఇష్టం లేని, తమ ఇష్టం వచ్చినట్టు స్పందించిన మేధావుల స్పందన ఆ కారణాలకే బలహీనం అవుతోంది. మరొక కళాకారుడు, రచయిత, దర్శకుడు కమల్ హాసన్ మరొక మాట అన్నారు: బహుమతులు పుచ్చుకున్న వారు తమ తమ నిరసనలనో అసహనాన్నో ప్రకటించడం సబబే. కాని ఒక గుర్తింపు - వారి కృషిని ప్రశంసిస్తూ - ప్రజాభిప్రాయాన్ని సమర్థిస్తూ ఇచ్చిన కితాబుని నిరసించ డం తప్పు. అది ప్రజాభిమానాన్ని అవమానించినట్టు. నా ప్రజల మీద నాకు కోపం వస్తే - నా జీవితంలో సినీమాల ద్వారా సంపాదించుకున్నదంతా వాపసు ఇస్తున్నానా?' 'మేమెప్పుడూ మా అసహనాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. ప్రతీ ప్రభుత్వం అసహనంతోనే ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ముస్లింలీగ్ లాగే కాంగ్రెసూ అసహనాన్ని ప్రకటించింది. నా 'విశ్వరూపం'ను ఎవరు వ్యతిరేకించారు? 'హేరామ్'ని ఎవరు విమర్శించారు?' ఈ దేశంలో మేధావులు రాజకీయ నాయకుల్లాగ వీధిన పడటం కాకుండా ఒక అపూర్వమైన 'నియతి'తో సమాజాన్ని ముందుకు తీసుకుపోయే సూచనలు చేయాలే కానీ ‘‘చేతులు కడుక్కోకూడదు’’ అని ఒక పాఠకుడు ఒక పత్రి కలో ఉత్తరం రాశాడు. ఇలాంటి మాటని కమల్ హాసన్ కూడా అన్నాడు. మరొక సినీనటుడు అనుపమ్ ఖేర్ ఈ అవార్డు- వాప్సీ వ్యతిరేక రాయబా రాన్ని రాష్ట్రపతి భవన్‌కు నిర్వహిం చారు. ఆయన అన్నారు: 'సాహిత్య అకాడమీ అవార్డులు, జాతీయ ఫిలిం అవార్డులు, పద్మ పురస్కారాలను వాపసు ఇవ్వడం - భారతదేశం పరప తిని భ్రష్టుపట్టించడానికి ఉద్దేశిం చినవి' దేశంలోని ఒక వర్గం మేధావులు పాలక వ్యవస్థ మీద వారి కక్ష తీర్చుకు నేందుకు కత్తి కట్టారని 36 మంది మేధా వులు సర్కారుకి మద్దతు తెలుపుతూ ఒక ప్రకటన చేశారు. ఇందులో సరదా అయిన పిట్టకథ ఒకటుంది. చండీగఢ్‌లో ‘‘నాన్సెన్స్ క్లబ్’’ కళాకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయ్యా, మేం కళాకారులం. 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. మాకు తక్షణమే ప్రభుత్వం ఏవో కొన్ని అవార్డులు ఇవ్వాలి. అప్పుడు మాకూ అవార్డులు తిప్పి ఇచ్చే అవకాశం ఉంటుంది. అందరూ అన్నీ తిరిగి ఇస్తున్నారు. మాకూ ఇవ్వాలని ఉంది. కాని మా దగ్గర ఏమీలేవు’’ ఇదీ వీరి డిమాండ్! చండీగఢ్ 17వ సెక్టార్లో వీరు ధర్నా చేశారు. ఈ రాద్ధాంతం అంతటిలో చాలా సుఖంగా ఉన్న వాడిని నేనేననుకుంటాను. ఎందుకంటే - నేనే అవార్డునీ వాపసు ఇవ్వనక్కరలేదు. నాకేమీ రాలేదు కనుక. ఒక స్పందన వెనుక- ఆ వ్యవస్థ మీద ప్రాథమికమ యిన నిరాదరణో, నిరసనో, ఏహ్యతో ఉన్నప్పుడు - ఆ అభిప్రాయం పలచబడుతుంది. అతనంటే నాకు ఇష్టం లేదు. అతను చేసే ఏ పనీ నాకు నచ్చదు. ఈ తీర్పుకి బలం లేదు. న్యాయపీఠం మీద కూర్చున్న న్యాయమూర్తి ముద్దా యితో ఏ చిన్న ప్రమేయం ఉన్నా అతని తీర్పు చెల్లదు. అతను తప్పుకుంటాడు.Your dislike pre-judges your opinion. ఏనాడయినా మేధావి అభిప్రాయం బెసుగుతుంది. అతని పెట్టుబడి - ఆలోచన కనుక. అతి సామాన్య వ్యక్తి అభిప్రాయం కుండబద్దలు కొడుతుంది - అతని పెట్టుబడి - విశ్వాసం కనుక. విశ్వాసం విప్లవానికి పుట్టిల్లు.