breaking news
Food Chain
-
భారత్–యూఏఈ మధ్య ‘ఫుడ్ కారిడార్’
ముంబై: భారత్–యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) దాదాపు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫుడ్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్యారిడార్ యూఏఈ ఆహార అవసరాలను తీర్చడంతోపాటు, అంతకుమించి భారతీయ రైతులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి, దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. పెట్టుబడులపై భారత్–యూఏఈ అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ 12వ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో గోయల్ ఈ విషయాలు చెప్పారు. ఈ సమావేశానికి గోయల్‌తో పాటు అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నాహ్యాన్ కో–చెయిర్‌గా వ్యవహరించారు. స్థానిక కరెన్సీలో ద్వైపాక్షిక వాణిజ్యంతో పాటు వర్చువల్ ట్రేడ్ కారిడార్ పనులు, అహ్మదాబాద్‌లో ఫుడ్ పార్క్ ఏర్పాటు మొదలైన అంశాలపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గోయల్ ఏమి చెప్పారంటే... → రెండు దేశాల మధ్య ఫుడ్ కారిడార్ స్థాపనను ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు– యూఏఈతో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ కూడా ఇప్పటికే ఏర్పాటయ్యింది. → భారతదేశంలో ఫుడ్ పార్కుల ఏర్పాటు గురించి చర్చించిన అంశాల్లో మరొకటి. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి జరిగింది. రైతులకు అధిక ఆదాయంతోపాటు లక్షలాది మందికి ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఉద్యోగాలు కల్పించడానికి సహాయపడే అంశమిది. అలాగే యూఏఈ ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది. → ఫుడ్ క్యారిడార్ పెట్టుబడి వచ్చే రెండున్నరేళ్ల కాలంలో జరుగుతుందని అంచనా. → యూఏఈకి అనువైన అధిక నాణ్యతా ఉత్పత్తుల లభ్యత కోసం దేశంలో యూఏఈ భారీ పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ సదుపాయాలను మెరుగుపరచాలన్నది గత ఎంతోకాలంగా చర్చిస్తున్న అంశం. ఇది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. → తాజా పరిణామంతో దేశీయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో ఇతర గల్ప్ మార్కెట్లూ అనుసంధానమయ్యే అవకాశం ఉంది. దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయంభారత్లో పెట్టుబడులు చేయదల్చుకునే మదుపర్లకు సహాయకరంగా ఉండేలా దుబాయ్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పియుష్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కి (ఐఐఎఫ్‌టీ) సంబంధించి విదేశాల్లో తొలి క్యాంపస్‌ను కూడా దుబాయ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) నివసించే 35 లక్షల మంది భారతీయులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
రైతుకు ‘వినియోగ’ ఆసరా!
‘రైతు లేనిదే తిండి లేదు’ అనేది పసలేని నినాదం కాదు. అందుకే వ్యవసాయాన్ని సజీవంగా ఉంచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వినియోగదారుల నిబద్ధత చాలా అవసరం. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, వినియోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకు ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగదారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో రైతుకూ, వినియోగదారుకూ మధ్య సంబంధం ఇద్దరికీ లాభదాయకం అవుతుంది. తద్వారా అది ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. 2016లో ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ‘ఎవరు బాస్?’ అనే ఆలోచన వచ్చింది. ఫ్రెంచ్ డెయిరీ రైతులు కష్టాలను అధిగమించడంలో సహాయపడటానికి ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నమే ‘ఎవరు బాస్?’. తర్వాత ఇది తనకుతానుగా ఒక ప్రత్యేకమైన వినియోగదారుల ఉద్యమంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా దాని రెక్కలను విస్తరించింది. స్థిరమైన, పునరుత్పత్తి వ్యవసాయ వ్యవస్థలకు దారితీసే ఆరో గ్యకరమైన పరివర్తన దిశగా వ్యవసాయ ఆహార పరిశ్రమ పని చేస్తుందని నిర్ధారిస్తూ, ఫ్రెంచ్ ఆహార సహకార బ్రాండ్‌గా ‘ఎవరు బాస్’ అనే అవగాహనోద్యమం రైతులకు జీవనాధారంగా ఉద్భవించింది. రైతులకు అధిక ధర ఇవ్వడం మార్కెట్లను కుప్పకూలుస్తుంది అని నమ్మే వారందరికీ, ఇక్కడ నేర్చుకోవడానికి గొప్ప అభ్యాసం ఉంది. ఎల్లప్పుడూ ఆహారం చౌకగా ఉండాలని కోరుకునే బదులు, విని యోగదారులు తాము చెల్లించే న్యాయమైన, లాభదాయకమైన ధర రైతులకు మంచి జీవనాన్ని పొందడంలో మద్దతునిస్తుందని గ్రహించినట్లయితే, ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. మరింతగా క్రమాంకనం చేస్తే, ప్రతిఫలంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహా రాన్ని అందించడంలో అది వారికి సహాయపడుతుంది. వినియోగ దారులు ఆహార గొలుసుపై నియంత్రణను క్రమేణా పెంచుకోవడంతో, ఈ క్విడ్ ప్రోకో (నీకిది, నాకది) సంబంధం మరింత పెరిగింది. ఇది ఆ ఉత్పత్తుల అమ్మకాలలో ప్రతిబింబిస్తుంది. సగటున 31 శాతం పైగా పెరిగింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ భారతీయ రైతులు నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుందని భయపడే ప్రధాన ఆర్థికవేత్తలు, మీడియా, మధ్యతరగతి వారు ఆగ్రహించిన తరుణంలో ఈ క్విడ్ ప్రో కో భావన ప్రాముఖ్య తను సంతరించుకుంది. ఫ్రాన్స్, ఇతర ప్రాంతాలలో వినియోగ దారులు స్వచ్ఛందంగా ఎక్కువ చెల్లిస్తున్నప్పుడు భయాందోళనలను సృష్టించే బదులు, భారత ఆర్థికవేత్తలు పంటలకు సరసమైన ధరను నిరాకరించడం వ్యవసాయ జీవనోపాధిని ఎలా చంపుతుందో గ్రహించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఈ ప్రయత్నం ఎంత కీలకమో వినియోగదారులకు అవగాహన కల్పించాలి. మొత్తానికి, వినియోగదారులు రైతుల కష్టాల పట్ల సున్నితంగా ఉంటారు. సరైన అవగాహనతో, వారు వినియోగ ప్రవర్తనను సులభంగా మార్చ గలరు. అది మార్కెట్ శక్తులను సైతం మార్చేలా చేస్తుంది. మిగులు ఉత్పత్తి కారణంగా ఫ్రాన్స్‌లో పాల ధరలు పడిపోయినప్పుడు ఆ పరిణామం ఫ్రెంచ్ పాడి పరిశ్రమ పతనానికి దాదాపుగా దారి తీసింది. పాడి రైతులు షట్టర్లు మూసివేయడం ప్రారంభించడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు పెరి గాయి. ఆ కష్ట సమయాల్లో నికోలస్ చబన్నే. ఒక పాడి రైతు అయిన మార్షల్ డార్బన్ ను కలుసుకున్నాడు. చబన్నే స్థానిక పాడి పరిశ్రమ సహకార సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. వారు రైతు సంఘం దుఃస్థితిని, చుట్టుపక్కల ఉన్న రైతుల బాధలను చర్చించినప్పుడు, రైతులను ఆదుకోవడానికి వినియోగదారులను ఒకచోట చేర్చే ఆలో చన రూపుదిద్దుకుంది. ‘‘ఇది కష్టమని నాకు తెలుసు, కానీ ప్రయత్నించడం విలువైనదే’’ అని నికోలస్ నాతో అన్నారు. ఇలా ‘ఎవరు బాస్?’ అనేది రూపొందింది. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి ఆదుకోవడమే దీని లక్ష్యం. ‘‘మనకు ఆహారం అందించే ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి ఇది అవసరం’’ అని చబన్నే అన్నారు. 2016 అక్టోబర్‌లో, ఆపదలో ఉన్న 80 కుటుంబాలకు సహాయం చేస్తూ 7 మిలియన్ లీటర్ల పాలను విక్రయించే లక్ష్యంతో పాల కోసం బ్లూ కార్టన్ డిజైన్ ప్యాక్ ప్రారంభమైంది. సందేశాన్ని వ్యాప్తి చేయడంలో సహాయపడటానికి సోషల్ మీడియాను ఉపయో గించారు. రైతు చేయాల్సిందల్లా ఒక యూరో నమోదు రుసుము చెల్లించి, మంచి పద్ధతుల పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడమే! ఇది ప్రారంభమైన ఏడేళ్లలో, ’హూ ఈజ్ ది బాస్’ సంఘీభావ బ్రాండ్ 424 మిలియన్ లీటర్ల పాలను లీటరుకు 0.54 యూరోల హామీతో కూడిన సరసమైన ధరకు విక్రయించింది. అయితే అది మార్కెట్ ధర కంటే 25 శాతం ఎక్కువ. అయినప్పటికీ ఇది నేడు ఫ్రాన్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న పాల బ్రాండ్‌గా ఉద్భవించింది. పైగా దాదాపు 300 వ్యవసాయ కుటుంబాలకు (వివిధ ఉత్ప త్తుల కోసం సుమారు 3,000 మందికి) ఇది అండనిస్తోంది. మార్కె ట్లో పనిచేసే ధరల వ్యత్యాసాల లాగా కాకుండా, మార్కెట్ ధోరణు లతో హెచ్చుతగ్గులు లేని స్థిరమైన ధరను రైతులు పొందుతారు. ఫ్రాన్స్‌లో 38 శాతం రైతులు కనీస వేతనం కంటే తక్కువ సంపా దిస్తారనీ, పైగా 26 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవించి ఉన్నారని లెక్క. ఈ పరిస్థితుల్లో ఒక సర్వే ప్రకారం 75 శాతం మంది ప్రజలు తమ కొనుగోలుకు మరికొన్ని సెంట్లు జోడించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తించడం హర్షించదగినది. ఇది ఉత్పత్తిదారులకు సరస మైన ధరకు హామీ ఇస్తుంది. ఇది పాలతో ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ సంఘీభావ బ్రాండ్ సేంద్రియ వెన్న, సేంద్రియ కాటేజ్ చీజ్, ఫ్రీ–రేంజ్ గుడ్లు, పెరుగు, ఆపిల్ రసం, ఆపిల్ పురీ, బంగాళాదుంపలు, పిండిచేసిన టమోటాలు, గోధుమ పిండి, చాక్లెట్, తేనె, ఘనీభవించిన గొడ్డు మాంసం(గ్రౌండ్ స్టీక్)తో సహా దాదాపు 18 ఉత్పత్తులకు విస్తరించింది. సహకార సంఘం సాగుదారులకు సరసమైన ధరను అందజేస్తున్నప్పటికీ, వారు ఆరోగ్యకరమైన పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. అవేమిటంటే వంటకాల్లో లేదా పశువుల దాణాలో పామా యిల్ ఉపయోగించకపోవడం, జన్యుపరంగా మార్పు చెందిన పదార్థాలను వాడకపోవటం. సంవత్సరంలో కనీసం 4 నెలల పాటు జంతు వులను మేపడం వంటివి. ఈ భావన ఇప్పుడు జర్మనీ, బెల్జియం, గ్రీస్, ఇటలీ, మొరాకో, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలోని 9 దేశాల వినియోగ దారులకు చేరువవుతోంది. ఇక్కడ ఫ్రెంచ్ మాతృ సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందంతో వినియోగదారుల వ్యవస్థలు ఏర్పాటు చేయటం జరిగింది. ఫ్రాన్ ్స తన పండ్లు, కూరగాయల అవసరాలలో 71 శాతం దిగుమతి చేసుకుంటుందని, ఇది స్థానిక ఉత్పత్తిదారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని గ్రహించిన నికోలస్ దేశీయ రైతులకు సహాయం చేయడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ‘‘మేము సుదూర ప్రపంచం నుండి రవాణా చేయకూడదనుకుంటున్నాము. మన స్థానిక ఉత్పత్తిదారులను, వారు ప్రతిరోజూ మన ఇంటి ముంగిట ఉత్పత్తి చేసే ఆహారాన్ని మనం రక్షించుకోవాలి’’ అని ఆయన అన్నారు. స్థానిక ఉత్పత్తిదారులకు సహాయం చేయడానికి, సహకార బ్రాండ్ ఇటీవల తన ఆహార బాస్కెట్లో స్ట్రాబెర్రీ, తోటకూర, కివీ పళ్లను పరిచయం చేసింది. మార్కెట్లు పోటీని తట్టుకునేందుకు అట్టడుగు స్థాయికి దూసు కెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ‘ఎవరు బాస్’ అనే ఆలోచన వారికి కలిసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ, వ్యవసాయ ఆదాయాలను పెంపొందించే విషయంలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైన సాగుదారు లను మార్కెట్లు కలిగి ఉన్నందున, రైతులకు వినియోగదారుల మద్దతుపై చాలావరకు ఈ ‘ఎవరు బాస్’ ఆధారపడి ఉంటుంది. ఫ్రాన్స్‌లోని 16 మిలియన్ల మంది ప్రజలు సాపేక్షంగా ఎక్కువ ధరలకు కొనుగోళ్లు చేయడం ద్వారా రైతులను ఆదుకోవడానికి ముందుకు వస్తే, నికోలస్ ప్రారంభించిన సంస్థ కచ్చితంగా చాలా ముందుకు వచ్చినట్లే అవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
దివ్యమైన ఫుడ్చైన్: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..?
కందిపొడితో కలిసిన తాజా నేతి వాసన. కొబ్బరి పచ్చడిలో తాజా కరివేపాకు, మినపప్పుతో వేసిన పోపు వాసన వీధి చివరకు వస్తోంది. ముక్కు చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఓ రెస్టారెంట్. లోపలకి వెళ్లేవాళ్లు, సంతృప్తిగా బయటకు వచ్చే వాళ్లు, క్యూలో ఉన్న వాళ్లను చూస్తే లోపల టేబుల్ దొరకడం కష్టమే, రష్ బాగానే ఉందనిపిస్తోంది. తలెత్తి చూస్తే విశాలమైన బోర్డు కుడివైపు ‘ద రామేశ్వరం కేఫ్’ అని ఇంగ్లిష్‌లో ఉంది. తమిళ రుచి అనుకునే లోపే ఎడమవైపు అదే పేరు కన్నడ భాషలో ఉంది. మధ్యలో చక్కటి ముగ్గుతో మూర్తీభవించిన దక్షిణాది సంప్రదాయం కనువిందు చేస్తోంది. బెంగళూరులో ఉన్న ఈ రెస్టారెంట్ తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకు వేడి వేడిగా వడ్డిస్తూనే ఉంటుంది. ఈ రెస్టారెంట్ల యజమాని పాతికేళ్లు కూడా నిండని దివ్య. తాత, తండ్రుల వ్యాపార సామ్రాజ్యాన్ని ఈ అమ్మాయి వారసత్వంగా అందుకున్నదేమో అనుకుంటాం. కానీ ఇది పూర్తిగా ఆమె ఆలోచనే. మెక్‌డీ... కేఎఫ్సీలేనా! ఫుడ్ చైన్‌ను మించిన వ్యాపారం మరొకటి ఉండదని నమ్మింది దివ్య. సీఏ చేసిన తర్వాత ఐఐఎమ్ అహ్మదాబాద్‌లో ఎంబీఏలో చేరినప్పటి నుంచి ఫుడ్ చైన్ బిజినెస్‌లో నెగ్గుకురావడం గురించిన మెళకువలు నేర్చుకోవడంలో మునిగిపోయింది. పాశ్చాత్య దేశాల్లో పుట్టిన మెక్ డీ, కేఎఫ్సీలను మనం ఆదరిస్తున్నాం. అలాగే దక్షిణాది రుచులను దేశమంతటా విస్తరించడం ఎందుకు సాధ్యం కాదు... అనుకుంది. మార్కెటింగ్ వ్యూహాలను తెలుసుకుంది. కోర్సు పూర్తి అయిన వెంటనే తన ఆలోచనను ఇంట్లో వాళ్ల ముందు బయటపెట్టింది. భర్త రాఘవరావు ఆహార పరిశ్రమల రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతడు మాత్రమే ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఇక మిగిలిన వారంతా – ‘సీఏ, ఐఐఎమ్‌లో పీజీ చేసిన అర్హతలకు పెద్ద కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం దొరుకుతుంది, హాయిగా ఉద్యోగం చేసుకోక ఇంత చదువూ చదివి ఇడ్లీలు, దోశెలు, ఊతప్పాలా’ అన్నారు. ఎవరెన్ని చెప్పినా ఆమె తన అభీష్టాన్ని నెరవేర్చుకుని తీరాలని నిర్ణయించుకుంది. ఇపుడామె కారం పొడి చల్లిన నెయ్యి దోశెలు, స్పాంజిలాగ మెత్తని ఇడ్లీలు, ఊతప్పం, గుంత పొంగనాలు, మూడు రకాల చట్నీలు, సాంబారు... ఈ ఘుమఘుమలు బెంగళూరు నుంచి మన హైదరాబాద్‌ను తాకి, దేశందాటి దుబాయ్‌కి కూడా చేరాయి. ఇకపై సింగపూర్‌కి విస్తరించాలనేది దివ్య లక్ష్యం. తన ఫుడ్ చైన్‌కి ‘ద రామేశ్వరం కేఫ్’ అని పెట్టడానికి కారణం తాను అత్యంత ఎక్కువగా గౌరవించే మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సొంతూరు రామేశ్వరం (తమిళనాడు రాష్ట్రం) కావడమే అంటోంది. పెద్ద కలలు కనమని చెప్పిన కలామ్‌కి తన విజయాన్ని అంకితం చేసింది దివ్య. ఇది చదవండి: ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్!