breaking news
Female suicide bombers
-
ఆత్మాహుతి దాడి... 60 మందికి పైగా మృతి
అబుజా: ఆత్మాహుతి దాడులతో నైజీరియా మరోసారి దద్ధరిల్లింది. నార్త్-ఈస్ట్ నైజీరియాలో ఉన్న దిక్వా పట్టణంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 60 మందికి పైగా మృత్యువాతపడగా, సుమారు 80 మంది గాయపడ్డారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ బొకో హరామ్ గ్రూపు సభ్యులైన ఇద్దరు యువతులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు మిలిటరీ అధికారులు భావిస్తున్నారు. దాడి జరగడంతో టెలిఫోన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఐడీపీ క్యాంపులోకి వెళ్లిన తర్వాత ఆ మహిళలు ఆత్మాహుడి దాడికి పాల్పడ్డారని ఆర్మీ అధికారులు వివరించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రసంస్థలు ప్రకటించలేదని ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ చైర్మన్ సటోమీ అహ్మద్ తెలిపారు. సాధారణంగా బొకో హరామ్ ఉగ్రసంస్థ మహిళలు, చిన్నారుల్ని తమ మార్గంగా చేసుకుని ఈ తరహా పాల్పడుతారని పేర్కొన్నాడు. జవనరి 31న బోర్నె స్టేట్ రాజధాని మైదుగరిలో జరిగిన దాడిలో 65 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఐడీపీ క్యాంపుపై జరిగిన రెండో దాడి ఇది. బొకో హరామ్ గ్రూపు తొలి దాడి గత సెప్టెంబర్ లో చేసింది. -
మహిళల ఆత్మాహుతి దాడి
అబుజా: నైజీరియాలో ఓ ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. భారీ స్థాయిలో బాంబుల జాకెట్లను ధరించి తమను తాము పేల్చేసుకున్నారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మైదుగురి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైదుగురినిలోని మోలాయి ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. సాధారణ మహిళలుగానే ఆస్పత్రిలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది వారిని తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా పేల్చేసుకున్నారు. దీంతో సమీపంలోని సెక్యూరిటీ సిబ్బంది మరికొందరు చనిపోయారు. బోకోహారానికి చెందిన ఉగ్రవాదులే ఈ దారుణం చేయించి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.