breaking news
faith in God
-
Patenting: ప్రకృతికి పేటెంట్ తీసుకోవచ్చా!!!
భగవంతుడు మనకు మాట ఇచ్చాడు, బుద్ది ఇచ్చాడు, ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చాడు... అన్న విశ్వాసం మనకు ఉండాలి. నేను ఏదో సాధించాలన్న ఉద్దేశంతోనే నాకు ఇవి బహూకరించాడు... ఎన్ని ప్రతిబంధకాలు ఎదురయినా సరే... నేను అనుకున్నది సాధించితీరతాను... అన్న పట్టుదల ఉంటే ఎంతటి నిరాశానిస్పృహలు ఎదురయినా సరే... సునాయాసంగా వాటిని దాటి... లక్ష్యాలను సాధించవచ్చు... అనడానికి – ఆత్మహత్య ఆలోచనలను వెనక్కి తీసుకుని, కష్టాలతోనే కడుపు నింపుకుని, ఒకటి కాదు, రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్న ధీర వనిత మేరీ క్యూరీ గొప్ప ఉదాహరణ. మేరీ అసలు పేరు మరియా. 1867 నవంబరు 7న జన్మించారు. పోలండ్ దేశస్థురాలు. తల్లిదండ్రులు టీచర్లు. 11వ ఏట తల్లి మరణించింది. పోలండ్ లోని రాజకీయ అనిశ్చితి వాతావరణంలో తండ్రి ఉద్యోగం పోయింది. అక్కడినుంచి కష్టాలను ఈదుకుంటూ పారిస్ చేరుకుంది. ఆ రోజుల్లో సై¯Œ ్స చదవడానికి స్త్రీలు ముందుకు రాకుండా సంప్రదాయవాదులనుండి అనేక అవరోధాలుండేవి. ఆమెకు సైన్సంటే మక్కువ, పరిశోధనలంటే ప్రాణం. ఇంటిపట్టునే ఉన్నవనరులతోనే ప్రయోగశాల పెట్టుకుంది. ప్రొఫెసర్ హెన్నీ బెకెరెల్ సాయంతో పరిశోధనలు చేసేది. ఇంచుమించు తనలాగే అనేక కష్టాలను ఓర్చుకుంటూ పరిశోధనలు సాగిస్తున్న పీరే క్యూరీతో పరిచయం, సాహచర్యం తరువాత పెళ్ళికి దారితీసాయి. అయినా కష్టాలు తీరకపోగా కలిసి అనుభవించడం అలవాటు చేసుకున్నారు. భయంకరమైన కాన్సర్ వ్యాథి చికిత్సకు తోడ్పడగల కారకాల కోసం పరిశోధనలు ముమ్మరంగా సాగుతుండేవి. రేడియోయాక్టివిటీ సిద్ధాంత అభివృద్ధికి, దాని తాలూకు పరిశోధనలకు ఆమె గురువుకి, భర్తకి, ఆమెకు కలిపి నోబెల్ బహుమతి లభించింది. ఆ తరువాత ఒక చిన్న రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. తరువాత కాలంలో పొలోనియం, రేడియం మూల పదార్థాల అన్వేషణకు ఈసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఆమెను వరించింది. ఒక స్త్రీకి రెండుసార్లు, అదీ రెండు వేర్వేరు సబ్జెక్ట్ లలో నోబెల్ రావడం విశేషం, అపూర్వం. ఆమె సాధించిన ఫలితాలకు ఆమె కానీ, ఆమె భర్త కానీ పేటెంట్ తీసుకుని ఉంటే.... వారి వారసులు ఇప్పటి లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా ఉండేవారు. కానీ ఆమె నిజ జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా... ‘‘అవి (ఖనిజాలు) ప్రకృతి ఇచ్చిన వరం. అది ప్రజలది. వాటి మీద నాకేం హక్కు ఉందని పేటెంట్ తీసుకోవాలి. అందరి మేలుకోసం వాటిని నేను ఉపయోగించగలగడం నాకు జీవితంలో దక్కిన అదృష్టం... అందుకే వాటికోసం తాపత్రయపడలేదు. నిజానికి దంపతులిద్దరికీ అవార్డులు, రివార్డుల మీద ధ్యాస ఉండేది కాదు... నిరంతరం పరిశోధనలే... అవికూడా ఇంటిపట్టున ఏర్పాటు చేసుకున్న అరాకొరా సౌకర్యాలతో... సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ... ధార్మిక ప్రభావానికి ఆమె శరీరం గురయింది... చివరకు ఆమెకు కూడా కాన్సర్ సోకి, మరణానికి దారితీసింది... ఆమె పారిస్(ఫ్రా¯Œ ్స దేశం)లో స్థిరపడినా, మాతృదేశం పట్ల ఆమెకు ఎంత గాఢమైన ప్రేమంటే... తాను కనుగొన్న పదార్థాలలో ఒకదానికి తన దేశం పేరు ధ్వనించేలా పొలోనియం అని పేరుపెట్టింది. చివరకు తన మరణానంతరం ఖననానికి ముందు.. శవపేటిక తెరచి.. జన్మభూమి పోలండ్ నుంచి తెచ్చిన మట్టి చల్లాలని కోరింది. మానవాళి శ్రేయస్సుకు తపించడం తప్ప ఆమె సర్వసుఖాలను, సంపదలను దూరంగా పెట్టింది.. చివరకు కీర్తికాంక్షను కూడా. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మంచి మాట: ఆధ్యాత్మికత అంటే..?
‘దేవుణ్ణి మీరు చూశారా..?’ అని ప్రశ్నించాడో యువకుడు ఒక సాధకుణ్ణి. చురుకైన కళ్ళు.. తీక్షణమైన చూపులు. గిరజాల జుట్టు.. దానిలో కొన్ని వంకీలు అతని విశాల ఫాలభాగాన నర్తిస్తుండగా. ‘ఆ“చూసాను’. అన్నాడాయన చిరునవ్వుతో. ‘చూశారా..!?’ అన్నాడా యువకుడు తన అనుమానానికి అపనమ్మకాన్ని జోడిస్తూ. ‘చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా’ అన్నాడాయన మరింత ప్రశాంతంగా నవ్వుతూ. ఆ మాటలకు ఆ యువకుడు విభ్రాంతుడే అయ్యాడు. ఆ సాధకుడి గొంతులో ధ్వనించిన విశ్వాసం.. నమ్మకం.. సూటిదనం.. అతణ్ణి ఒక నిమిషంపాటు ఆపాదమస్తకాన్ని కంపింప చేసింది. ఇంతకుముందు తను కలసిన సాధకుకులు.. యోగులు.. గురువులు... అందరూ కూడా దేవుణ్ణి చూడలేదనే చెప్పారు. ఆ దేవదేవుని సాక్షాత్కారానికి తపస్సు చేస్తూనే ఉన్నామన్నారు. ఒకవేళ ఒకరిద్దరు చూశామని చెప్పినా ఇంత గట్టిగా.. విశ్వాసంతో చెప్పలేదు. ఇందుకే ఆ వంగ దేశీయుడికి ఆ పరమహంస మీద గురి.. ఏర్పడింది. అందుకే ఆయనను గురువుగా అంగీకరించాడు. ఆ పై ఆ గురుశిష్యులిరువురూ ఎంత విశ్వవిఖ్యాతులయ్యారో లోకవిదితమే. దేవుణ్ణి చూశామన్న వారెవరైనా ఆయన భావనను, తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారని అర్థం. దేవుడి సర్వాంతర్యామిత్వ భావనను గ్రంథాలనుండి గ్రహించటమే కాదు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ సకల చరాచరసృష్టిలో ప్రతి జీవిలో చూడగలగటం. ప్రత్యక్షంగా చూసి అనుభవంగా చేసుకోవటమే కదా! ఆ పరమహంస.. నిన్ను చూసినంత బాగా చూశాను’ అని చెప్పటంలో అదే అర్థం. ‘ఇందు గలడందు లేడని సందేహం వలదు..’ అన్న పద్య సారాంశ మదే కదా. తన ఎదురుగా తను ఆరాధిస్తున్న విగ్రహమే దేముడు.. అయన ఉనికి ఇక్కడే.. ఈ నాలుగు గోడల మధ్యే అన్న ఆలోచనా పరిధి.. పరిమితులనుండి నుండి మనిషి బయటకు రానంతకాలం.. రాకూడదనుకున్నంత కాలం ఆ సర్వాంతర్యామిత్వాన్ని బుద్ధికే పరిమితం చేసుకున్నాడు. అంతే కానీ మనస్సులో ఆ భావనను ప్రతిష్టించుకోలేకపోయాడు. నిజమైన ఆధ్యాత్మికమార్గానికిది పెద్ద అవరోధం. భావన.. అనుభూతి.. దృష్టి ఈ మూడింటిని ఆధ్యాత్మికపథంలో పయనించాలనుకున్న వారు తప్పనిసరిగా అలవరచుకోవలసిన లక్షణాలు. అనేక శాస్త్రాలు.. కావ్యాలు.. వేదాంత గ్రంథాలు చదివిన ఓ పండితుడు గంగానదిలో స్నానమాచరించి తన పాప ప్రక్షాళన చేసుకోవాలన్న తన జీవితేచ్ఛను జీవిత చరమాంకంలో కాని తీర్చుకోలేకపోయాడు. ‘ఈ గంగానదికి పాపాలను పరిహరించే మహత్తు నిజంగా వుందా..? అన్న అనుమానం మదిలో మొలకె త్తింది. తత్ఫలితంగా సద్గతులు కొంచెం ఆలస్యంగా ప్రాప్తించాయి. కారణం..!? భావన, అనుభూతి. అయితే ఈ పండితుడి పలుకుల మీద విశ్వాసముంచి మామూలు నదిలో స్నానం చేసిన సాధారణ వ్యక్తి ఆ పండితుడికన్నా ముందుగా సద్గతులు పొందాడు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి ఉండవలసిన ప్రథమ లక్షణం భావన.. అనుభూతి.. విశ్వాసం. మన భౌతికావసరాలు, బాధ్యతలు నెరవేర్చటం కోసం ఏదో ఒక వృత్తినో .. ఉద్యోగాన్నో.. పొంది డబ్బు సంపాదించాలి. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పోషించాలి. ఇది ప్రధాన బాధ్యత. ఇది కాని జీవితం ఇంకేమైనా ఉందా? ఇదే జీవిత పరమార్థమా? మనిషి ఈ చింతన చేయటానికి తన అంతరంగంలోకి చూడగలగాలి. తన మనస్సును న్యాయాధీశుని చేసుకుని తను చేసే పనుల మంచి చెడులను ప్రశ్నించుకోవాలి. ఆలోచనలను, ప్రవర్తనను సింహావలోకనం చేసుకోవాలి. తను ఎంతవరకు నిజాయితీగా.. న్యాయబద్ధతతో.. ప్రవర్తిస్తున్నాడు? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాడా..? ఎదుటివారికి చేయగలిగిన మేలు చేస్తున్నానని కీడు చేయటంలేదు కదా..! ఇటువంటి ప్రశ్నలు తానే తన మీద సంధించుకోవాలి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు ఎవరు పొందగలరో వారు నిస్సందేహంగా చక్కని, ఆదర్శవంతమైన జీవితాన్నే గడుపుతున్నట్టే. ఈ పరిశీలన.. శోధనకే అంతర్ముఖత్వమని పేరు. ఆధ్యాత్మికతకు ఇదొక ముఖ్యమైన లక్షణమే కాదు కాదు, ఖచ్చితంగా ఉండవలసినది. ఇది ఆస్తికులకైనా, నాస్తికులకైనా.. ఆ మాట కొస్తే మనిషన్న వాడికెవడికైనా వర్తిస్తుంది. ఏ మత విశ్వాసానికైనా అన్వయించుకోతగ్గది, అందరికీ అభిలషణీయమైనదీ మార్గం. ఈ అంతరంగ యానం.. లోచూపు ఎవరైతే అలవరచుకుంటారో వారు జీవితాన్ని సరిగా అర్థం చేసుకున్నారని చెప్పవచ్చు. సరైన రీతిలో మలచుకుంటున్నారని అర్థం. ధనం వల్ల ఇహంలో మనం పొందే భౌతికమైన, ఉన్నతస్థితి కాక.. ఇంకా ఎంతో ఉన్నతమైన స్థితికి చేరినట్టు. కొందరు భౌతికపరమైన విషయాలను పక్కకు పెట్టి బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి అంతర్ముఖులు కాబోతున్నామని ప్రకటనలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేయనే చేయరు. మన మనస్సు తీరు.. గతి.. ఆలోచనా పద్ధతి.. మన వ్యక్తిత్వాన్ని ఒక అంచనా వేసుకుని మన జీవితాన్ని, మన ఆలోచనా ప్రవాహన్ని క్రమబద్దీ కరించుకునేందుకు మన మనస్సు చెప్పే సంగతులు తెలుసుకోవాలి. సరిగా లేకుంటే దిద్దుకోవాలి. ఇందుకు అంతర్ముఖత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. మానవ మేధ, శక్తియుక్తులకు పరిధులు, పరిమితులున్నాయని, ఆ మానవాతీత శక్తి భగవంతుడని సర్వశక్తిమంతుడని. సర్వవ్యాపకుడని, అతడివల్లే ఇంతటి సృష్టి జరిగిందని భావించే వారున్నారు. వారు అతడినే కేంద్ర బిందువు చేసుకుని తమ అంతర్ముఖ ప్రయాణపు తొలి.. ఆఖరి అడుగు అతడితోనే ముగిస్తారు. కొందరు ప్రకృతి పరిణామక్రమంలో ఏర్పడ్డదీ సృష్టి అంటూ ఒక మానవాతీత శక్తి వుందని అంటారు. కానీ దాన్ని భగవంతుడుగా భావన చేయరు. వీరిరువురూ కూడ అంతర్ముఖత్వానికి పెద్దపీట వేస్తారు. మనిషి మహాత్ముడు కాకపోయినా మనిషి గా నిలబడటానికి ఇది అవసరమని ఇద్దరూ ఏకీభవిస్తారు. జీవితం అర్థవంతమైనదవ్వాలంటే ఇది అత్యంత అవసరమైనదని ఇద్దరూ అంగీకరిస్తారు. ఈ ఆధ్యాత్మిక చింతన లేదా అంతర్ముఖత్వం ఒక సత్యాన్వేషణ. ఒక సత్యశోధన. మనలోని చైతన్యాన్ని తెలుసుకోవటం. జీవితాన్ని అర్థం చేసుకుని, దాని పట్ల ఉన్న భయాందోళనలు తొలగి నిర్భయులమై స్వేచ్ఛానందాలను పొందాలంటే ప్రతి ఒక్కరూ అంతర్ముఖులు కావాలి. ఆధ్యాత్మిక చింతనంటే కేవలం భక్తి ఒక్కటే కాదు. దానికి భావన..అనుభూతి.. విశ్వాసం.. వీటిని చేర్చాలి. ఆధ్యాత్మికత అంటే పెదవులతో దేవుడి నామాన్ని పలకటమే కాదు. భగవంతుడి రూపాన్ని అన్నిచోట్లా.. అందరిలోనూ చూడగలగటం. మన ఆణువణువునా ఆ భావనను పొందుపరచుకోవటం. అపుడే మనం ఆయన సర్వాంతర్యామిత్వాన్ని విశ్వసించినట్టు! ఆధ్యాత్మికత అంటే మనం నమ్మిన దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవటం. ఈ దశకు చేరు కోవటమంటే నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే. ఆధ్యాత్మికత తొలి మెట్టు ఇదే కావాలి. భగవంతుని తత్వాన్ని మనసులో నిలుపుకుని తోటివారితో ఎవరైతే చక్కగా సంభాషిస్తారో... అభాగ్యుల.. అనాథల మీద కరుణ, ప్రేమ చూపిస్తారో.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారన్న విషయాలకు ఎవరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారో వారు నిజమైన ఆధ్యాత్మికపరులు. – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
నైవేద్యంగా నాలుక అర్పించింది...
భోపాల్ : ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. దేవతపై నమ్మకంతో భక్తి పేరిట ఓ మహిళ తన నాలుకను కోసి నైవేద్యంగా సమర్పించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని తార్సామా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడ్డీ తోమర్ అనే 45 ఏళ్ల వివాహిత దుర్గా మాతకు పరమ భక్తురాలు. తార్సామా గ్రామంలో ఉన్న బిజసేన్ మాత ఆలయాన్ని ప్రతి రోజూ సందర్శించడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలోనే బుధవారం ఆలయానికి వెళ్లిన తోమర్ తన నాలుకను కోసి అమ్మవారికి నైవేద్యంగా అర్పించింది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో పక్కనే ఉన్న ఇతర భక్తులు ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దేవుడిపై విశ్వాసాన్ని నిరూపించుకోవడానికే ఆమె ఇలా ప్రవర్తించిందని.. ప్రస్తుతం చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. పెళ్లైన నాటి నుంచి అంతే.. ఈ ఘటనపై తోమర్ భర్త రవి తోమర్ మాట్లాడుతూ.. తన భార్య దుర్గాదేవి భక్తురాలని చెప్పారు. పెళ్లైననాటి నుంచి ఆమె ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం బిజసేన్ ఆలయానికి వెళ్తుందని తెలిపారు. అయితే బుధవారం కూడా ఆలయానికి వెళ్లిందని.. ప్రార్థనా సమయంలో అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేసిందో తెలియడం లేదని వాపోయాడు. -
నేను నాన్నలా కాదు : శృతి హాసన్
స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కోసం చాలా రోజులు ఎదురుచూసిన భామ శృతిహాసన్. కెరీర్ స్టార్టింగ్లో ఐరన్ లెగ్గా ముద్రపడ్డ శృతి, తరువాత గబ్బర్ సింగ్ సక్సెస్తో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్లతో పాటు బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటి, కమల్ హాసన్ కూతురిగా కన్నా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతోంది. కేవలం ఐడెంటీ విషయంలోనే కాదు చాలా విషయాల్లో నేను నాన్నలా కాదు అంటోంది. నటుడిగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కమల్, నాస్తికుడు. దేవుణ్ని నమ్మడు. కానీ శృతి అలా కాదట. తాను దేవుణ్ని నమ్ముతానని, తీరిక సమయాల్లో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేస్తానని చెపుతోంది. కానీ తన నమ్మకం మరీ మూర్ఖంగా మాత్రం ఉండదట. చిన్న చిన్న కోరికలు దేవుడికి చెప్పుకుంటానేగాని పూర్తిగా దేవుడే అన్ని చేస్తాడని ఆయన మీదే భారం వేయనంటోంది.