breaking news
F-16 Jets
-
క్షిపణులు, డ్రోన్లతోచెలరేగిన రష్యా
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్ వ్యాప్తంగా భారీ దాడులకు తెరతీసింది. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటంతో ముగ్గురు చనిపోగా డజన్లకొద్దీ జనం గాయపడ్డారు. రష్యా 579 డ్రోన్లు, 8 బాలిస్టిక్ మిస్సైళ్లు, 32 క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించగా 552 డ్రోన్లను, రెండు బాలిస్టిక్ క్షిపణులను, 29 క్రూయిజ్ మిస్సైళ్లను కూ ల్చివేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిప్రోపెట్రోవిస్క్, మైకోలైవ్, చెర్నిహివ్, జపొరిఝియా, పొల్టావా, కీవ్, ఒడెసా, సుమీ, ఖార్కివ్.. మొత్తం 9 ప్రాంతాల్లోని మౌలికవసతులు, నివాస ప్రాంతాలు, సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. పౌరులను రెచ్చగొట్టి, మౌలిక వసతులను దెబ్బతీసేందుకే రష్యా ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నస్తోందని ఆరోపించారు. దాడుల కారణంగా నీప్రోపెట్రోవిస్్కలో పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాసాలు దెబ్బతిన్నాయని, కనీసం 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్ ప్రాంతంలోని బుచా, బొరిస్పిల్, ఒబుఖివ్లపై దాడులు జరిగాయి. ఒక ఇల్లు, కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. లివివ్ ప్రాంతంలో రెండు క్రూయిజ్ క్షిపణులను కూల్చివేశామని గవర్నర్ మాక్సిమ్ చెప్పారు. శత్రువు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో ఎఫ్–16 యుద్ధ విమానాలు కీలకంగా మారాయన్నారు. కాగా, దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న పోలెండ్ అప్రమత్తత ప్రకటించింది. పోలెండ్, నాటో యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలో పహారాను ముమ్మరం చేశాయి. తమ గగనతలంలోకి రష్యా డ్రోన్ ప్రవేశించడంతో అడ్డుకునేందుకు రొమేనియా కూడా గత వారం ఎఫ్–16 జెట్లను పంపించింది.ఎస్టోనియా గగనతలాన్ని అతిక్రమించలేదు: రష్యా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా శుక్రవారం రష్యాకు చెందిన మూడు యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించి, 12 నిమిషాలపాటు చక్కర్లు కొట్టాయని నాటో సభ్యదేశం ఎస్టోనియా చేసిన ఆరోపణలను రష్యా ఖండించింది. ఎస్టోనియా సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో బాలి్టక్ సముద్రంపై ఉన్న తటస్థ జోన్లోనే తమ యుద్ధ విమానాలున్నాయని రష్యా రక్షణ శాఖ వివరించింది. -
విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్లో భారత్
US Povide Pakistan For F-16 fighter jet fleet sustainment program: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి సుమారు 450 మిలియన్ డాలర్ల ఎఫ్16 ఫైటర్ జెట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ట్రంప్ కాలంలో ఈ భద్రతా సాయాన్ని నిలిపివేస్తే జోబైడెన్ నేతృత్వంలో యూఎస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో భారత్ తీవ్ర అభ్యంతరాలతోపాటు భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐతే అమెరికా మాత్రం ఇది కేవలం అమ్మాకాలే కానీ సహాయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు యూఎస్ దక్షిణాసియా, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ మాట్లాడుతూ.... ఒక దేశానికి అందించే రక్షణ పరికరాలకు మద్దతు ఇవ్వడం యూఎస్ ప్రభుత్వ విధానమని నొక్కి చెప్పారు. అంటే దీని అర్థం కేవలం పాక్‌తో ఉన్న ఎఫ్16 విమానాలకు సంబంధించిన విడిభాగాల విక్రయం మాత్రేమనని సహాయం కాదని తేల్చి చెప్పారు. తాము కేవలం పరికరాల సేవలను మాత్రమే ప్రతిపాదిస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల విమానాలు వాయు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. తాము భారత్ ఆందోళనలను అర్థం చేసుకున్నామని అన్నారు. పాక్‌లో ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలు 40 ఏళ్లకు పైబడినవి అందువల్ల ఆయా భాగాలకు సంబంధించిన సర్వీస్‌ని అందిస్తున్నామే తప్ప కొత్త విమానాలను ఏమి అందిచండం లేదని స్పష్టం చేశారు. ఐతే 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబన్ హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద గ్రూపులను అణిచివేయడం తోపాటు, వారి సురక్షిత స్థావరాలను కూల్చివేయడంలో విఫలమైనందున పాకిస్తాన్‌కు సుమారు రెండు వేల బిలియన్ డాలర్ల భద్రతాసహాయాన్ని నిలిపేశారు. (చదవండి: ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....) -
వాయుసేనలోకి 100 యుద్ధ విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ 100 కొత్త తరానికి చెందిన యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం భారతీయ వాయుసేన ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వేట ప్రారంభించింది. అమెరికాకు చెందిన ఎఫ్-16, స్వీడన్‌కు చెందిన గ్రైపెన్స్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఎఫ్-16 జెట్లను లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ అభివృద్ధి చేయగా.. గ్రైపెన్స్ జెట్లను సాబ్ అనే స్వీడిష్ కంపెనీ తయారు చేసింది. డబుల్ ఇంజిన్ జెట్లైన రఫెల్ యుద్ధ విమానాలను మరిన్ని కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోందనే కథనాలు గతంలో జాతీయ మీడియాలో వెలువడ్డాయి. అయితే, కేవలం 32 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్న వాయుసేనకు సింగిల్ ఇంజిన్ జెట్ల అవసరం చాలా ఉంది. 2021 కల్లా భారత్ వద్ద ఉన్న మిగ్-21, మిగ్-27 జెట్లు వాయుసేన నుంచి తప్పుకుంటాయి. దీంతో కొరత మరింత తీవ్ర అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న వాయుదళం.. ఎఫ్-16, గ్రైపెన్ ఫైటర్లలో ఏదో ఒకదాన్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది. 2021కి మరో మూడేళ్లే ఉన్నా.. 18 జెట్లను మాత్రమే విదేశాల నుంచి తెప్పించి, మిగతా వాటిని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద భారత్‌లోనే తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లాక్‌హీడ్ మార్టిన్, సాబ్‌లు భారత్‌కు జెట్లు అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే, లాక్ హీడ్ మార్టిన్ ఇప్పటికే ఎఫ్-16 జెట్లను పాకిస్తాన్‌కు అందించింది. దీంతో భారత వాయుసేన ఎఫ్-16 జెట్లను తీసుకోవడానికి ఇష్టపడుతుందా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. స్వీడన్‌కు చెందిన గ్రైపెన్స్ విమానాన్ని కూడా అత్యాధునిక సాంకేతికతో అభివృద్ధి చేశారు. భారత్‌కు గ్రైపెన్స్ జెట్లను అందించేందుకు సాబ్, అదానీ గ్రూప్‌తో జట్టు కట్టింది. వచ్చే రెండు నెలల్లో భారత రక్షణ శాఖ నుంచి జెట్ల ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా, 2023 కల్లా 36 రఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుదళంలో చేరతాయి. మరో పక్క స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఎల్సీఏ తేజస్ యుద్ధవిమానాల తయారీని వేగవంతం చేయాలని ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కోరింది.


