breaking news
excise duty impose
-
మందు బాబులపైనే తెలంగాణ సర్కారు ఆశలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారు మద్యం అమ్మకాల ఆదాయంపై ఆశలు పెట్టుకున్నట్టుగా బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ప్రతిపాదించిన రూ.16 వేల కోట్లకు అదనంగా రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.17వేల కోట్లు ఎక్సైజ్ డ్యూటీగా సమకూరుతుందని సర్కారు అంచనా వేసుకుంది. 2020–21లో కరోనాతో నెలన్నర రోజులు మద్యం అమ్మకాలు నిలిచిపోయినా రూ.16 వేల కోట్లు ఎక్సైజ్ డ్యూటీ వచ్చింది. వచ్చే ఏడాది మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయనే అంచనాతో అదనపు ఆదాయాన్ని లెక్క కట్టింది. కేంద్రం ఏమిస్తుందో.. మిగతా పన్ను ఆదాయాలను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటాపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆశలు తగ్గినట్టు కనిపిస్తున్నా యి. 2020–21లో రూ.16,726 కోట్లు పన్నుల్లో వాటాగా వస్తాయని అంచనా వేసుకోగా.. కేవలం రూ.11,731 కోట్లే్ల అందాయి. దీంతో గతేడాది కంటే తక్కువగా పన్నుల్లో వాటా కింద రూ.13,990 కోట్లను మాత్రమే అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రూ.2,726 కోట్లు తగ్గించుకుంది. మొత్తం పన్ను ఆదాయం పెంపు అన్ని రకాల పన్ను ఆదాయం కింద 2020–21తో పోలిస్తే 2021–22 బడ్జెట్లో రూ.7,600 కోట్లు ఎక్కువగానే వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2020–21లో పన్నులద్వారా రూ.85,300 కోట్లు సమకూరుతాయని భావించినా.. రూ.76,195 కోట్లే వచ్చాయి. అంచనా కంటే రూ.9వేల కోట్ల వరకు తగ్గాయి. ఈ సవరించిన ఆదాయంతో పోలిస్తే.. రూ.16వేల కోట్లు అదనంగా రూ.92,910 కోట్లు ఈసారి పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయం కూడా.. జీఎస్టీ, అమ్మకపు పన్నుల రాబడులు కూడా పెరుగుతాయనే అంచనాతో సర్కారు ప్రతిపాదనలు చేసింది. 2020–21లో జీఎస్టీతో పాటు అమ్మకపు పన్ను కింద రూ.48,895 కోట్లురాగా.. ఈసారి రూ.57,500 కోట్లకు పెంచింది. పన్నేతర ఆదాయమూ భారీగానే.. పన్నేతర ఆదాయంలోనూ భారీ వృద్ధిని ప్రభుత్వం అంచనా వేసుకుంది. ఈసారి ఏకంగా రూ.30వేల కోట్లను పన్నేతర ఆదాయం కింద ప్రతిపాదించింది. 2020–21లో రూ. 30,600 కోట్లు పన్నేతర రాబడుల రూపంలో వస్తాయని అనుకున్నా.. కేవలం రూ.19,305 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే కరోనా నుంచి కోలుకున్నామనే అంచనాతో ఈసారి కూడా రూ.30,557 కోట్లు పన్నేతర ఆదాయం కింద చూపెట్టడం గమనార్హం. వామ్మో.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంగా ప్రభుత్వ అంచనాలు భారీగా ఉన్నాయి. 2021–22లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏకంగా రూ.38,669.46 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 2020–21 సంవత్సరానికి గాను ఈ పద్దు కింద రూ.10,525 కోట్లు అంచనా వేయగా.. కేంద్రం ఆ మేరకు నిధులిచ్చింది. ఈసారి అంచనాలు మూడు రెట్లు పెంచడం విశేషం. 2019–20లో కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చింది రూ.11,598 కోట్లే. 2021–22లో రెవెన్యూ రాబడులపై అంచనాలు (రూ.కోట్లలో) పన్ను రకం 2021–22 కేంద్ర పన్నుల్లో వాటా 13,990.13 రాష్ట్ర పన్నుల ఆదాయం 92,910 ల్యాండ్ రెవెన్యూ 6.31 అమ్మకపు, వాణిజ్య పన్నులు 57,500 రాష్ట్ర ఎక్సైజ్ 17,000 ఇతర పన్నులు 18,403.69 పన్నేతర ఆదాయం 30,557.35 గ్రాంట్ ఇన్ ఎయిడ్ 38,669.46 మొత్తం 1,76,126.94 చదవండి: తెలంగాణ బడ్జెట్: ‘గ్రేటర్’కు సర్కారు వారి పాట -
బంగారం మరింత భారం..
సాక్షి,న్యూఢిల్లీ : బంగారం ధరలు భారం కానున్నాయి. పార్లమెంట్లో శుక్రవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మగువలకు ఇష్టమైన బంగారంపై పన్నుల భారం మోపారు. బంగారంపై కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలను పెంచారు. బంగారం సహా ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. బంగారంపై సుంకాల పెంపుతో స్వర్ణాభరాణాలు మరింత ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో పాటు డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటంతో ఇప్పటికే భారమైన బంగారం ధరలు తాజాగా సుంకాల పెంపుతో మరింత పెరగనున్నాయి.మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం శుక్రవారం రూ 600 మేర పెరిగింది. -
ఆ వ్యాపారులపై తనిఖీలు, వేధింపులు ఉండవు
సాక్షి, విజయవాడ బ్యూరో: బంగారు ఆభరణాల వ్యాపారులపై శాఖాపరంగా ఎలాంటి వేధింపులు ఉండబోవు. ఎక్సైజ్ డ్యూటీ విధింపుపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ జేఎస్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. ఎక్సైజ్ డ్యూటీ విధింపుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మె చేస్తోన్న విజయవాడ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల బంగారు ఆభరణాల వ్యాపారులతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విజయవాడలోని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ చంద్రశేఖర్ వ్యాపారులకు పలు వివరాలను తెలియజేశారు. బంగారు ఆభరణాలపై ఇన్పుట్ ట్యాక్సు క్రెడిట్ లేకుండా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఒక శాతం, క్రెడిట్‌తో కలిపి 12.5 శాతాన్ని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిందన్నారు. ఏడాదికి రూ.12 కోట్లకు పైబడి వ్యాపారం జరిపే పెద్దపెద్ద వ్యాపారులకే ఎక్సైజ్ డ్యూటీ వర్తిస్తుందనీ, చిన్నచిన్న వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి వచ్చే వ్యాపారులు రిజిస్ట్రేషన్ తీసుకుని సహకరించాలనీ, అధికారులతో సంబంధం లేకుండా నేరుగా ఆన్లైన్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం నగల వ్యాపారుల దుకాణాలను తనిఖీ చేయడం గానీ, తయారీ యూనిట్లకు వెళ్లడం గానీ ఉండబోవన్నారు. నిల్వలను స్వాధీనం చేసుకోవడం, అరెస్టులు, ప్రాసిక్యూషన్లు కూడా ఉండవన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లింపులన్నీ మొదటి అమ్మకం ఇన్వాయిస్లపైనే ఆధారపడి ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ నెలాఖరుతో ముగుస్తుందని కమిషనర్ చంద్ర శేఖర్ వెల్లడించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల అదనపు కమిషనర్ వి.నాగేంద్ర రావు మాట్లాడుతూ, జాబ్ వర్క్‌పై చిన్నచిన్న ఆభరణాలు తయారు చేసే వ్యాపారులు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన పనిలేదన్నారు. కిందటేడాది రూ.12 కోట్ల టర్నోవ ర్ దాటిన వ్యాపారులు మాత్రం ఈ ఏడాది ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో మూడు జిల్లాలకు చెందిన బంగారు వర్తకుల నాయకులు, అసోషియేషన్ సభ్యులు పాల్గొన్నారు.