breaking news
Essar Group promoter Ravi ruyala
-
లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
యూకే రాజధాని నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్‌ను భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ సొంతం చేసుకున్నారు.ఎస్సార్ గ్రూప్‌కు సహ-యజమాని రవి రుయా ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. రష్యన్ ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రీ గోంచరెంకోకు సంబంధించిన ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ. 1200 కోట్లు. (145 మిలియన్ డాలర్లు) . 150 పార్క్ రోడ్‌లోని రీజెంట్స్ పార్క్‌కి ఎదురుగా ఉన్న హనోవర్ లాడ్జ్ మాన్షన్‌ను ఇంటిలోని జిబ్రాల్టర్-ఇన్కార్పొరేటెడ్ హోల్డింగ్ కంపెనీ విక్రయం ద్వారా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భవనం ఇటీవలి రెండేళ్ల క్రితం రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థ అనుబంధ సంస్థ గాజ్ప్రోమ్ ఇన్వెస్ట్ యుగ్ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోంచరెంకో యాజమాన్యంలో ఉంది. 2012లో కన్జర్వేటివ్ పార్టీ పీర్ రాజ్‌కుమార్ బగ్రీ లీజుకు తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ నిర్మాణంలో ఉందనీ, ఇది కుటుంబ కార్యాలయానికి ఆకర్షణీయమైన పెట్టుబడిగా చేసే ధరకు అందుబాటులోకి వచ్చింద ని రుయా ఫ్యామిలీ ఆఫీస్ ప్రతినిధి విలియం రెగో ఒక ప్రకటనలో తెలిపారని పలు మీడియా సంస్థలు నివేదించాయి. గత ఏడాది లండన్‌లో విదేశీ సంస్థల రిజిస్టర్ విధానంలో పారదర్శకతను తీసుకు రావడానికి ప్రయత్నించిన తర్వాత కూడా లండన్ అల్ట్రా-ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్లో ఇప్పటికీ గోప్యంగానే ఉండటం విశేషం. అయితే ఈ ఆంక్షల ఫలితంగా ఇప్పటిదాకా చాలా రహస్యంగా జరిగే విలాస వంత గృహాలు క్రయ విక్రయాల్లో కాస్త మార్పు వచ్చింది. బ్రోకర్ హాంప్టన్స్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత ఏడాది చివరి మూడు నెలల్లో లండన్ ఇళ్ల విక్రయాలు భారీగానే నమోదైనాయి. -
సునీల్ మిట్టల్, రవి రుయాలకు ఊరట
* అదనపు స్పెక్ట్రమ్ కేటాయింపు కేసు నుంచి విముక్తి * ప్రత్యేక కోర్టు సమన్లను తోసిపుచ్చిన సుప్రీం న్యూఢిల్లీ: అదనపు స్పెక్ట్రమ్ కేటాయింపు కేసులో భారతీ సెల్యులార్ సీఎండీ సునీల్ మిట్టల్, ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్ రవి రూయాలకు ఊరట లభించింది. 2002 ఎన్డీఏ పాలనా కాలంలో అదనపు స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి అవినీతి కేసులో వీరిని నిందితులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన సమన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ‘ఈ కేసులో వీరికి న్యాయ సూత్రాల రీత్యా సమన్లు సరికావు. కేసుతో సంబంధమున్నట్లు తగిన ఆధారాలు లేవు. కనుక ప్రత్యేక కోర్టు ఉత్తర్వును మేము తోసిపుచ్చుతున్నాం’ అని చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ మదన్ బీ లోకూర్, ఏకే శిక్రీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఏ దశలోనైనా, ఏ విధమైన తగిన ఆధారాలు లభించినా వారిని కోర్టుకు పిలిపించే అధికారం ప్రత్యేక జడ్జికి ఉంటుందని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మిట్టల్ తరఫున అత్యున్నత న్యాయస్థానం ముందు సీనియర్ న్యాయవాది ఎఫ్ఎస్ నారీమన్ వాదనలు వినిపించారు. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో అసలు తమ క్లయింట్ పేరు లేదని, అయినా కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడం సరికాదని న్యాయస్థానానికి తెలిపారు. స్పెక్ట్రం వేలంపై భారతీ , వొడాఫోన్ వినతికి నో... ప్రభుత్వం గతంలో తమకు కేటాయించిన స్పెక్ట్రంను వేలం వేయకుండా స్టే ఇవ్వాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే, లెసైన్సులు రెన్యువల్ చేయాలన్న అభ్యర్ధనపై విచారణను మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఇరు సంస్థల స్పెక్ట్రం లెసైన్సుల గడువు ఈ ఏడాది డిసెంబర్‌తో తీరిపోనుంది. దీంతో వీటి ఆధీనంలో ఉన్న స్పెక్ట్రంను కూడా వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం లేదా వేలంలో ఖరారయ్యే బిడ్ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమ చేతిలో ఉన్న స్పెక్ట్రంను వేలం వేయొద్దని రెండు కంపెనీలూ కోరుతున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి 2జీ, 3జీ స్పెక్ట్రం వేలం కాగా ఫిబ్రవరి 25 నుంచి 2జీ, 3జీ స్పెక్ట్రం వేలం మొదలవుతుందని టెలికం విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు సమర్పించేందుకు ఆఖరు తేది ఫిబ్రవరి 6. స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వం కనీసం రూ. 64,840 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.