breaking news
English studies
-
ఇంగ్లిష్ మీడియం జగన్ విజన్
► మన పిల్లలు ఇంగ్లిషు చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ► ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. ► కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ► ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ► ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య,పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. ► మన పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ► ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. ► 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. ► 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ► 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ ► మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెరి్నంగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. మరోపక్క విద్యార్థుల్లో నిర్మాణాత్మకమైన లైఫ్ స్కిల్స్, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, సమాజంలో ఉన్నత విలువలతో ఉన్నతంగా జీవించేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించేందుకు ‘సంకల్పం’ శిక్షణను సైతం ప్రభుత్వం అందిస్తోంది. డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు విద్యార్థుల చెంతకు డిజిటల్‌పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. ఈనెల 10వ తేదీన టోఫెల్ ప్రైమరీ పరీక్షను నిర్వహించగా 13,104 ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 4,17,879 మంది (92 శాతం) రాశారు. శుక్రవారం (ఏప్రిల్ 12)న జరిగిన టోఫెల్ జూనియర్ పరీక్షకు 5,907 పాఠశాలకు చెందిన 11,74,338 మంది హాజరయ్యారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధనను కూడా తెస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాలి్వంగ్ వంటి నైపుణ్యాలు అందించడంతోపాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మన ఇంగ్లిషు విద్యపై ప్రసంశల జల్లు ► ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ► ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ►‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ►‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైసూ్కల్లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. -
గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతా..
124 గురుకుల పాఠశాలలు, 39 కస్తూర్బాగాంధీ విద్యాలయాలను పర్యవేక్షిస్తూ.. 4500మంది ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ.. 72వేల మంది విద్యార్థి, విద్యార్థినులకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు రాకుండా వసతులు కల్పిస్తున్నారు. చదువు‘కొన’ లేని ఆ పేదపిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని కృషిచేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే అధికారుల్లో ఒకరు. ఆయనే జిల్లావాసి, సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్. ఆయన కాస్త తీరిక చేసుకుని కమ్మదనం బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు. ‘సాక్షి’ రిపోర్టర్‌గా విద్యార్థినుల బాగోగులు తెలుసుకున్నారు. గురుకులాలను తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: నీ.. పేరేంటమ్మా, గురుకుల లో చదువుతున్నావ్ కదా? ఎలా ఉంది.. ఎలా చదువుతున్నాం. మీ ఊరు వదిలి ఇక్కడికి వచ్చావు కదా.. నీకేమీ అనిపించడం లేదా? స్కూళ్లో బోర్ కొట్టడం లేదా? అంజలి(10వ తరగతి): సార్..! మాది వంగూరు. నేను ఐదో తరగతిలో ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు ఒక్కటే వచ్చేది. మ్యాథమెటిక్స్ అంటే మస్తు భయం. పరీక్ష ఉంది అనగానే జ్వరం వచ్చేది. ఎప్పుడైతే ఇక్కడకు వచ్చానో నాకు గణితం పట్ల పూర్తిగా భయం పోయింది. ఇంతమంది అక్కవాళ్లు, ఫ్రెండ్స్ ఉండగా ఇంట్లోనే ఉన్నట్టుంది. ఉపాధ్యాయులు మమ్మల్ని వారి పిల్లల్లా చూసుకుంటున్నారు. నా లక్ష్యం ఇంజినీర్ కావడమే సార్.. మంచి ఇంజినీర్ అయి మా నాన్నకు పేరు తేస్తాను. మీ ఆశయాన్ని కూడా నెరవేరుస్తా. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: నీపేరేంటి. స్కూలుకు నీవెలా వచ్చావు. మీ స్కూల్లో ఏమేం జరుగుతున్నాయి. పాఠాలు అర్థమవుతున్నాయా? సిలబస్ మారింది కదా.. ఎలా చదువుతున్నారు. పాఠాలు అర్థమవుతున్నాయా? స్వర్ణమంజలి(కర్నూలు): సార్.. నేను ఐదో తరగతిలో జాయిన్ అయ్యాను. నేను దూరంగా ఉంటానని మా డాడీ ఎప్పుడు బాధపడుతుంటారు. సోషల్వెల్ఫేర్ స్కూల్లో చదువుకుంటే ఎంతగ్రేటో తెలుసా..! అని నాన్నకు చెప్పేదాన్ని. మారిన సిలబస్‌కు అనుగుణంగా మా టీచర్లు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రశ్నలను మేమే తయారుచేసుకునే విధంగా మమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. మాకు తెలియని కొత్తకొత్త విషయాలు చెప్పి పరీక్షలకు బాగా ప్రిపేర్ చేస్తున్నారు. మా బయాలజీ మేడం క్లాస్‌రూమ్‌లోకి వస్తే చాలు. ప్రపంచమంతా ఇక్కడే చూసినట్లు ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: మీ షర్టు మీద ‘వాయిస్’ అని ఉంది కదా? అంటే ఏమిటి? సఖీ అంటే ఏంటో చెబుతావా? స్వర్ణ: వాయిస్ అంటే క్యాంపు సార్..! మేము వేసవి సెలవుల్లో క్యాంప్‌నకు వెళ్తుంటాం. అక్కడ సఖీ క్వాలిఫికేషన్ గురించి చెబుతారు. సఖీ అంటే పక్కవారి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం. మారి సమస్యలు తీర్చడం. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: క్యాంపునుంచి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశావు. ఏయే ప్రాబ్లమ్స్ వచ్చాయి? సరే... హాస్టల్లో భోజనం ఎలా ఉంది. స్వర్ణ: ఫుడ్ బాగుంది. సన్నబియ్యం వచ్చినప్పటి నుంచి కడుపునిండా తింటున్నాం. క్యాంపులో నేర్చుకున్న అంశాలను స్కూళ్లో నేర్పిస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: ఇక్కడ క్యాంపునకు వెళ్లినవాళ్లు ఎవరైనా ఉన్నారా? శాంతి(9వ తరగతి): నేను డార్జిలింగ్ క్యాంప్‌నకు వెళ్లాను. అక్కడ చలి తీవ్ర త ఎక్కువగా ఉంటుంది. చలి వేయకుండా స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకునేదాణ్ని. చేతులు, కాళ్లకు సాక్స్‌లు, గ్లౌజ్‌లు వేసుకుని పడుకునేవాళ్లం. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: అంత చలిలో నీరు అక్కడ గడ్డకట్టదా.. ఎలా ఉండగలిగారు..? శాంతి: తాగడానికి వేడినీళ్ల బాటిళ్లను స్లీపింగ్ బ్యాగ్‌లో వేసుకుని పడుకోవాలి. మొత్తం 9రోజుల పాటు బేస్‌క్యాంప్‌లో ఉన్నాం. నాలుగు కిలోల బరువు ఉన్న షూ వేసుకున్నా. చలికి కప్పుకునే దుప్పటి 20కిలోలు ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: నీ పేరేంటమ్మా.. ఇక్కడ విద్యాబోధన ఎలా ఉంది. పాఠాలు అర్థమవుతున్నాయా? మహేశ్వరి(10వ తరగతి) : ఇక్కడ విద్యాబోధన చాలాబాగుంది. ఎగ్జాం అంటే భయంలేద్సార్..! మాకు మేమే క్వశ్చన్స్ తయారుచేసుకుని చదువుతున్నాం. వీటికంటే ఎక్కువ పరీక్షల్లో ఏమీ రావని మా నమ్మకం. మేమంతా గ్రూప్ డిస్కర్షన్ చేసుకుంటూ చదువుకుంటున్నాం. మా ఆలోచనలు, చదువుకునే పద్ధతిని ఒకరికొకరు పంచుకుంటాం. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: గేమ్స్‌లో పాల్గొన్నవాళ్లు ఎవరైనా.. ఉన్నారా? చైతన్య(ఇంటర్ ఫస్టియర్ బైపీసీ): సార్.. నేను ఐదో తరగతిలో ఇక్కడికి వచ్చా. ఆరేళ్లుగా ఇక్కడే చదువుకుంటున్నాను. గురుకుల పాఠశాలను వదిలివెళ్లను. నేను చాలా గేమ్స్‌లో పాల్గొన్నాను. నాకు మొన్న కొత్తగడిలో జరిగిన జోన్‌స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. అవర్ టాపిక్స్ జీఎం ఫుడ్.. మేము ఎక్స్‌ఫోర్ ఈవెంట్‌కు వెళ్లాం సార్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: అక్కడ ఎలా అనిపించింది? ఏయే ప్రాంతాలు చూశారు.? చైతన్య: ఎక్స్‌ఫోర్ అనే ప్లేస్‌ను చూడలేనేమో అనుకున్నా. క్లాస్మెంట్ ఫ్రెండ్స్‌తో కలిసి అలాంటి ప్లేస్‌కు వెళ్లాలి అనుకునేదాన్ని. అదికూడా మీవల్లే తీరింది. ఎల్బీ స్టేడియాన్ని నేను టీవీలోనే చూసేదాన్ని. కానీ మొన్న ప్రత్యక్షంగా చూశాను. సీసీఎంబీ, ఎంజీఆర్ఐ, ఎల్బీ స్టేడియం, ప్లానిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ వంటి ఎన్నో ప్లేస్‌లు చూశాం. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లావు కదా? ఫ్యూచర్లో అక్కడ చదువుకునేందుకు వెళ్తావా? చైతన్య: అక్కడికి కచ్చితంగా వెళ్లి చదువుకుంటా. భవిష్యత్‌లో గొప్ప శాస్త్రవేత్తను కావాలని ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్: గేమ్స్‌లో పాల్గొన్నవారు ఇంకెవరైనా ఉన్నారా? జ్యోతిక(10వ తరగతి): కబడ్డీ అంటే నాకు చాలాఇష్టం. ఇరవైరోజుల క్రితం ఎల్బీ స్టేడియంలో జరిగిన స్వేరో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నాను. 1500 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నా. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా.. విజయం దక్కలేదు. ఒడిపోయినా సరే.. మీరు ప్రోత్సహించిన తీరు నాలో స్ఫూర్తినింపింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హామీలు ఒకప్పుడు గురుకుల పాఠశాలలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతుండేవి. ఎస్సీ సబ్‌ప్లాన్, అదనపు నిధులతో పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తాం. ఇక్కడున్న పిల్లలు ఎక్కువగా పేదకుటుంబం నుంచి వచ్చినవారే. కొంతమందికి తల్లిలేదు. మరికొంత మందికి తండ్రిలేడు. అలాంటి వారికి ఉపాధ్యాయులు తగినంత ప్రోత్సాహాన్ని అందిస్తూ మంచి విద్యను బోధిస్తున్నారు. పిల్లలకోసం సమ్మర్‌క్యాంప్, కోచింగ్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ‘ఈ+ క్లబ్’ ద్వారా ప్రతి విద్యార్థిలో ఇంగ్లిస్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అభివృద్ధి చేస్తున్నాం. వేర్వేరు ఫౌండేషన్లతో కలిసి ఉత్తమర్యాంకులు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులకు అమెరికాలో శిక్షణ ఇప్పించేవిధంగా ఏర్పాట్లు చేశాం. మంచి ఉత్తీర్ణత సాధించే విద్యార్థులను కూడా అమెరికా పంపిస్తాం. దేశంలో ఏ విద్యాసంస్థ చేయని సాహసోపేతమైన క్రోడింగ్ క్యాంప్‌ను సమ్మర్లో ప్రవేశపెట్టబోతున్నాం. ప్రభుత్వపరంగా ఏ చిన్న అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకుని పేద విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాం.