breaking news
EdCET 2014
-
సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ లో ఎడ్‌సెట్ 2014 ‘కీ’
హైదరాబాద్: బీఈడీలో ప్రవేశానికి రాష్టవ్య్రాప్తంగా మే 30న నిర్వహించిన ఎడ్‌సెట్ 2014 పరీక్ష సమాధానాలను పేపర్లవారీగా సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చింది. నిపుణుల సహాయంతో రూపొందించిన ఈ ‘కీ’ని ప్రశ్నపత్రాలతో సహా వెబ్సైట్లో పొందుపరచడమైంది. మ్యాథమేటిక్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇంగ్లిష్ సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు లక్షా యాభై వేల మంది హాజరయ్యారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్ని మార్కులు వస్తాయో ఒక అంచనాకు రావచ్చు. ఎడ్‌సెట్ 2014 ‘కీ’ కోసం చూడండి.. http://www.sakshieducation.com/EdCET.html -
నేడు ఎడ్‌సెట్
-
నేడు ఎడ్‌సెట్
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్-2014కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం మొత్తం 2,597 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం నెల్లూరు నగరంలో 2,322 మందికి ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలో వీఆర్ లా కళాశాల, సర్వోదయ కళాశాల, పాత మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న మోడల్ హైస్కూల్, దర్గామిట్టలోని సెయింట్‌జోసఫ్ పాఠశాల, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కావలి పట్టణంలోని జవహర్‌భారతి కళాశాల్లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. ఈ పరీక్షల కోసం జిల్లా స్పెషల్ పరిశీలకురాలిగా తిరుపతి నుంచి ఇందిరాప్రసూన నియమితులయ్యారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంటముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని తెలిపారు.