breaking news
	
		
	
  drumstick seeds
- 
      
                   
                                                       Sagubadi: మునగ మేలు!సాంప్రదాయ పంటలు పండించే చాలా మంది రైతుల నికరాదాయం ఎకరానికి రూ.20 వేలకు మించటం లేదు. పత్తి, మొక్కజొన్నకు బదులుగా మునగ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతుల నికరాదాయం పెరుగుతుంది. 3 సంవత్సరాలలోపు ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. వాతావరణ ఒడిదుడుగులను తట్టుకోవటానికి మునగ దోహద పడుతుంది. నాటిన 7–8 నెలల్లో తొలి పంట కోతకు వస్తుంది. మూడేళ్లలో వరుసగా కనీసం 5 కార్శి పంటలు తీసుకోవచ్చు. మునగ ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, విస్తరణ శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర మునగ సాగుపై అందించిన పూర్తి వివరాలు.పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తినే వారికి ఆరోగ్యం, పండించే వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ నేలలైనా ఓకేఅన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5–8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గల సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. ఆరు నెలల్లోనే కాతకు వచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అక్టోబర్ వరకు విత్తుకోవచ్చుమునగ విత్తనంతో మొక్కలు పెంచి, నాటుకోవాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఏ సమయంలో విత్తినా వేసవిలోనే (జనవరి–ఏప్రిల్ మధ్యలో) పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది. ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు నాటాలి. మొక్కలను ముందుగా నర్సరీల్లో పెంచాలి. పీకేఎం–1 మునగ రకం విత్తుకోవటం మేలు. పాలిథిన్ సంచుల్లో విత్తిన 15 రోజుల్లో మొలక వస్తుంది. మొక్కల మధ్య 1 మీ., వరుసల మధ్య 1.5 మీ. దూరంలో గుంతలు తీసుకోవాలి. అర ట్రక్కు పశువుల ఎరువుకు రెండు బస్తాల వేపపిండి, 10 కేజీల ట్రైకోడెర్మా కలపాలి. దీన్ని ప్రతి గుంతకు రెండు దోసెళ్ళు (ఒక కిలో), గుప్పెడు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ప్రతి మొక్కకూ డ్రిప్ ద్వారా 135: 23: 45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో డ్రిప్ ద్వారా అందించాలి. డ్రిప్ ద్వారా 10–15 లీ. నీరివ్వాలి. నాటిన తర్వాత 3, 6 నెలలకు నత్రజని ఎరువు వేయాలి. వాస్తవానికి మునగ మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. జీవన ఎరువులు కూడా వాడితే నేల సారం, నేల ఆరోగ్యం పెరిగి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. బొంత పురుగులతో జాగ్రత్తమునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచేస్తాయి. దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. వేపనూనె మందు ద్రావణం పిచికారీ చేస్తే మొక్కలపై పురుగులకు వికర్షకాలుగా పనిచేస్తాయి. ఈ పంటలతో మునగను కలపొద్దుఆయిల్ పామ్, పత్తి, కూరగాయ పంటల్లో అంతర పంటగా వేస్తే మునగ మొక్కలు ఎరువులు, నీరు ఎక్కువగా అంది చాలా ఏపుగా పెరుగుతాయి. కానీ, పూలు, కాయలు ఆలస్యంగా రావడం స్పష్టంగా గుర్తించాం. కాబట్టి, అంతర పంటగా వేసినప్పుడు మునగ మొక్కలకు ఎక్కువ నీరు, ఎరువులు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చీడపీడలు ఆశించే టమాటా, వంగ, మిర్చి పంటలను మునగలో అంతర పంటలుగా వేసుకోకూడదు. ఎరువులు, సస్యరక్షణ చర్యలు తక్కువ అవసరమయ్యే కూరగాయ పంటలను మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మునగ దిగుబడి తగ్గిపోతుంది. పొలంలో మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి.ఇదీ చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుకత్తిరించిన 4–5 నెలల్లో మళ్లీ కాపుమునగ నాటిన మొదట్లో ప్రతి 2 నెలలకోసారి (6 నెలల్లో 3 సార్లు) విధిగా కొమ్మలు కత్తిరిస్తే.. కొమ్మలు గుబురుగా వచ్చి పూత, కాయల దిగుబడి ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు రాకుండా ఏపుగా బాగా ఎత్తు పెరిగితే పూత సరిగ్గా రాదు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోతాయి. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ. ఎత్తులో మొక్క కాండం, కొమ్మలను కత్తిరించాలి. దీంతో 4–5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఇలా 4–5 నెలల కొకసారి కార్సి పంటలను తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45, 15,30గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. ఏటా 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. మొక్కకు 150 కాయలుఒక ఎకరానికి 1,000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయల చొప్పున 1,50,000 కాయలు కాస్తాయి. రూపాయికి 2 కాయల చొప్పున (ఒక కేజీకి రూ.5) స్థానికంగా అమ్మితే.. ఎకరానికి ఏడాదికి రూ.75,000 ఆదాయం వస్తుంది. మునగ ఆకులను కోసి ఎండ బెట్టి పొడి చేసి అమ్మొచ్చు. మునగ గింజలు/నూనె ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.మునగ ప్రకృతి సేద్యం ఇలా..మునగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడి, మంచి దిగుబడులు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి మునగ సాగుకు బాగా అనుకూలం. భూమిని లోతుగా దున్ని సూర్య కాంతికి ఎండబెట్టాలి. గోతులు తవ్వి, ఎండిన ఆకుల చెత్త, పశువుల ఎరువు, ఘనజీవామృతం లేదా వర్మీ కంపోస్ట్ కలిపి గోతులను నింపాలి. సేంద్రియంగా సాగు చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి. విత్తనాలను బీజామృతంలో శుద్ధి చేసిన 24 గంటల తర్వాత విత్తాలి. మొక్కలకు జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం వాడాలి. ద్రవ జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరివ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపనూనె, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను తయారు చేసి పిచికారీ చేయాలి. పచ్చి రొట్ట పంటలను పెంచి, కత్తిరించి, మొక్కల మొదళ్ల చుట్టూ మల్చింగ్గా వెయ్యాలి. కలుపు సమస్య తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు 30–40% తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మునగ కాయలు రుచిగా, పోషకాలు అధికంగా ఉండి, ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి.ఇతర వివరాలకు.. డా. టి. భరత్ – 97005 49754
- 
      
                   
                                                       అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలుపట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే, ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!తమిళనాడులోని దిండిగల్ ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి ప్రాసెసింగ్‌లోకి అడుగు పెట్టిందీ పొన్నరాసి వివరించారు.అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్ జాన్ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్ కెనడీ సార్ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.కిలో మునగ నూనె రూ. 5 వేలుకెనడీ చెప్పిన విషయాలు పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం ప్రారంభమైంది.కరువును తట్టుకునే మూలనుర్ మునగమునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట. అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి. విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్ ఫుడ్ ఎడిబుల్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ (ఐఇఎఫ్ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో పొలంలోనే ప్యాక్ హౌస్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్ బామ్స్ తయారీలో వాడేందుకు పొడిని.. సూప్ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా చెప్పారు.ఫేస్బుక్, వాట్సప్..పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్ వాసులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్ పొన్నరాసికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.చదవండి: కార్బన్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు పొన్నరాసి. సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్బుక్లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్బుక్, వాట్సప్ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!ప్రచారాలను పట్టించుకోకూడదు..‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. – పొన్నరాసి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన మునగ రైతు, దుండిగల్, తమిళనాడు
- 
      
                   
                                 కాల్చిన మునక్కాయల కూరమునక్కాయలను ఇష్టపడని వారు ముల్లోకాల్లో వెదికినా దొరకరు. సాంబారులో ఎన్ని కూరగాయలు వేసినా మునగ వేస్తేనే గౌరవం. మునగను రకరకాలుగా వండటం చూశాం. కాని పల్లె వంటల్లో ప్రసిద్ధం అయిన ఈశ్వరి అవ్వ మునక్కాయలను కాల్చి చేసిన కూరను అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. పొగడ్తలతో ఆమెను ముంచెత్తుతున్నారు. తమిళనాడుకు చెందిన ఈశ్వరి అవ్వకు ‘కంట్రీ ఫుడ్ కుకింగ్’ అనే యూ ట్యూబ్ చానల్ ఉంది. సబ్‌స్క్రయిబర్స్ ఎంతమందో తెలుసా? పది లక్షల మంది. తమిళనాడు గ్రామీణ వంటలను ప్రయోగ వంటలను అద్భుతంగా చేయడంతో ఈశ్వరి అవ్వకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. పచ్చి బొ΄్పాయి పచ్చడి, ఆరిటాకుల హల్వా ఇలాంటి వాటితో ΄ాటు నల్ల మాంసం కూర, అరటికాయతో వెజ్ ఫిష్ ఫ్రై లాంటివి నోరూరిస్తాయి. తాజాగా అవ్వ కాల్చిన మునక్కాయల కూర చేసి నెటిజెన్ల మెచ్చుకోలు పొందింది. మునక్కాడలను మంట మీద కాల్చి వాటిని కడిగి, చీరి, లోపల గుజ్జును వొలిచి పక్కన పెట్టుకుందామె. తర్వాత చట్టిలో నూనె ΄ోసి జిలుకర, వెల్లుల్లి, టొమాటో, ఉల్లి΄ాయలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి, ఆఖరున మునగగుజ్జును వేసి దోరగా వేయిస్తే మంచి ఫ్రై కూరలా తయారయ్యింది. దానిని తెల్లన్నంతో తింటూ మనకు వీడియో కనిపిస్తుంది అవ్వ. ఈ రెసిపీని చూసి నెటిజన్లు చాలా కొత్తగా ఉందంటున్నారు. మేమూ ట్రై చేస్తామని బజారుకు మునక్కాయల కోసం వెళుతున్నారు.
- 
  
      మునక్కాడల గింజలతో వాటర్ ప్యూరిఫికేషన్.. ఎలా చేయాలి?
- 
      
                   
                                 లాభాల్లో ‘మునగంగా’..పెరవలి (పశ్చిమగోదావరి): మునగ సాగు రైతులకు కల్పతరువుగా మారింది. ఒకప్పుడు పెరటి పంటగా ఉండే మునగ నేడు వాణిజ్య పంటగా రూపాంతం చెందింది. దేశవాళీ రకాలు సీజన్లో మాత్రమే కాపు కాస్తుండగా.. హైబ్రీడ్ రకాలు ఏడాది పొడవునా దిగుబడి ఇస్తున్నాయి. ఖర్చు తక్కువ ఉండటం, నిత్యం ఆదాయం వస్తుండటంతో రైతులు మునగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవాళీ రకాల కంటే హైబ్రీడ్ రకాలు అధిక దిగుబడితో పాటు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఎకరాకు రైతుకు ఖర్చులు పోను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. కాండం ద్వారా వ్యాప్తి చెందే మునగ చెట్లు నాలుగేళ్ల పాటు దిగుబడిని ఇస్తాయి. పశ్చిమలో సాగు ఇలా.. జిల్లాలో మునగ సాగు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఇక్కడ పంట స్థానిక అవసరాలతో పాటు ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పెదవేగి, నల్లజర్ల, పోలవరం, చాగల్లు, దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, పెదపాడు, ద్వారకాతిరుమల, పెరవలి మండల్లాలో మునగ సాగు ఎక్కువగా ఉంది. ఆరునెలల నుంచి దిగుబడి మునగ పంట వేసిన ఆరునెలల నుంచి దిగుబడి మొదలవుతుంది. తొలి ఏడాది చెట్టుకు 150 కాయలు దిగుబడి వస్తే, రెండో ఏడాది నుంచి దిగుబడి బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు 300 నుంచి 500 కాయలు దిగుబడి వస్తాయి. ఇలా నాలుగేళ్లపాటు ఫలసాయం ఉంటుంది. రూ.20 వేల వరకు పెట్టుబడి మునగ సాగుకు పెట్టుబడి బాగా స్వల్పం. ఎరువులు, పురుగు మందులు వాడితే సరిపోతుంది. కాండం ద్వారా పలవర్ధనం చేసి మొక్కలను పెంచుతారు. పంటను గొంగలి పురుగు, కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని నివారిస్తే సరిపోతుంది. ఎకరాకు ఏడాదికి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుంది. రోజూ మార్కెట్ మునగకు రోజూ మార్కెట్ ఉంటుంది. ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50 ధర పలుకుతోంది. కిలోకు కాయ సైజును బట్టి 10 నుంచి 15 వరకు తూగుతాయి. 100 కిలోల వరకు.. ఏడాది పొడవునా కాపు ఉండటంతో ఎకరాకు రోజుకు 30 కిలోల నుంచి 100 కిలోల వరకు దిగుబడి వస్తుంది. రైతుకు రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుండగా కోత, రవాణా, ఎరువులకు పోను రూ.1,000 నుంచి రూ.1,500 వరకు మిగులుతుంది. నాలుగేళ్లపాటు.. మునగ వేసి ఆరు నెలలు అయ్యింది. ప్రస్తుతం కాపు కొద్దిగా ఉండటంతో దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. ప్రస్తుతానికి వస్తున్న ఆదాయం పెట్టుబడికి సరిపోతోంది. రెండో ఏడాది నుంచి మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. నాలుగేళ్ల పాటు ఫలసాయం పొందవచ్చు. –కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు ఏడాది పొడవునా.. వాణిజ్య పంటలకు దీటుగా మునగ పంటకు ఆదాయం వస్తోంది. ఏడాది పొడవునా ఫలసాయం పొందవచ్చు. గతంలో వాణిజ్య పంటలు వేసి నష్టాలు చవిచూస్తే నేడు లాభాలు పొందుతున్నాను. ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు మిగులుతోంది. –ఉమ్మిడి రాముడు, రైతు, ఉమ్మిడివారిపాలెం సాగు పెరిగింది హైబ్రీడ్ రకాలతో ఏడాది పొడవునా ఫలసాయం పొందవచ్చు. ఇటీవల మునగ సాగు బాగా పెరిగింది. దీంతో ఎగుమతి కూడా అవుతున్నాయి. గొంగలి పురుగు, కాయతొలుచు పురుగు మాత్రమే పంటకు నష్టం కలిగిస్తాయి వీటిని అరికడితే మంచి ఆదాయం పొందవచ్చు. –ఎ.దుర్గేష్, ఉద్యాన శాఖ ఏడీఏ, తణుకు చదవండి: పసుపు పుచ్చకాయలు.. ఇకపై మన దేశంలోనే!
- 
      
                   
                                 మునగ గింజలతో ‘మంచి’ నీరు
 సాక్షి, విజయవాడ బ్యూరో: క్లోరినేషన్ చేయకుండా, వాటర్ ఫిల్టర్ ఉపయోగించకుండా కేవలం మునగ గింజలతో నీటిని శుద్ధి చేసే విధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలతో బురద నీటిని సైతం శుద్ధిచేసి తాగునీరుగా ఉపయోగించుకోవచ్చు. ఈ విధానాన్ని విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీఎస్ రాజు ప్రయోగాత్మకంగా కనుగొన్నారు.
 
 ఇదీ విధానం..: ఎండిన గింజలను కాయ నుంచి వేరుచేసి అందులోని పప్పును మెత్తని పిండిగా చేయాలి. దాన్ని శుభ్రమైన నీటిలో కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. దానికి తగినంత నీరు కలిపి పలుచగా తయారుచేయాలి. పాల మాదిరి తెల్లగా ఉన్న ఈ మిశ్రమాన్ని అపరిశుభ్రంగా ఉన్న నీటిలో వేసి అర నిమిషంపాటు వేగంగా కలపాలి. తర్వాత ఐదు నిమిషాల వరకూ నెమ్మదిగా.. నిమిషానికి 15 లేక 20 సార్లు కలపాలి. అనంతరం నీటిపై మూతపెట్టి ఒక గంట వరకు వదిలేయాలి. తర్వాత ఆ నీటిని వడగట్టుకోవాలి. ఒకవేళ నీటిని కదిపితే ఫలితం ఆలస్యమవుతుంది. సాధారణంగా పెద్ద బకెట్లో పట్టే నీటిని శుభ్రపరిచేందుకు రెండు టీ స్పూన్ల (ఐదు మిల్లీమీటర్లు పట్టేవి) మునగ గింజల పౌడర్ అవసరం. ఈ పద్ధతితో నీటిలోని బ్యాక్టీరియా కూడా పోతుంది. దీని వల్ల నీటి పీహెచ్ ఏమాత్రం మారదు. ప్రకృతి సిద్ధంగా లభించే మునగ గింజలు కావడంతో దీనివల్ల ఎటువంటి హాని కలగదు.


