ముక్కంటీశునికి వెండి కేజీ విరాళం
శ్రీకాళహస్తి :
నెల్లూరు పట్టణానికి చెందిన శ్రీనివాసులుబాబు శనివారం శ్రీకాళహస్తీశ్వరాలయానికి కేజీ వెండి ముద్దను విరాళంగా అందజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వారికి ఈవో భ్రమరాంభ తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మన్నారు లోకనాథం నాయుడు ఉన్నారు.