breaking news
Domestic IT industry
-
ప్రయోగం నుంచి వినియోగం వైపు
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ కృత్రిమ మేథ (ఏఐ) ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా పరీక్షించే దశ నుంచి క్రమంగా విస్తృతంగా వినియోగించే దశ వైపు మళ్లుతున్నాయి. సంస్థాగతంగా కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐ ఏజెంట్లను అనుసంధానం చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దేశీ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వినియోగాన్ని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. తద్వారా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న దిగ్గజాల సరసన చేరాయి. భారత్‌లో గణనీయంగా సిబ్బంది ఉన్న యాక్సెంచర్ కూడా వేల కొద్దీ ఉద్యోగులకు కోపైలట్‌ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ చేపట్టింది.‘రోజువారీ ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహించేందుకు, తెలివిగా నిర్ణయాలను తీసుకోవడంలోను తోడ్పడేందుకు మేము 1,00,000 మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌ని అందుబాటులోకి తెచ్చాం‘ అని టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్ తెలిపారు. సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని భారీగా వినియోగించడం ద్వారా అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఏఐని తాము రోజువారీ పనుల్లో అనుసంధానిస్తున్నామని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్ణయాలను పక్కాగా అమలుచేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలాంటి అంశాలకు ఏఐ ఉపయోగపడుతుందని విప్రో సీఈవో శ్రీని పల్లియా తెలిపారు. కలిసి పని చేసే హైబ్రిడ్ విధానం.. ఏఐ కార్యకలాపాలను కేవలం స్టాండెలోన్ సాధనాలుగా కాకుండా మనుషులు, ఏజెంట్లు కలిసి పని చేసే విధానంగా తీర్చిదిద్దుకోవడంపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కి చెందిన వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ 2026 ప్రకారం ఈ తరహా ఏఐ వినియోగం .. ప్రాథమిక ఆటోమేషన్ పరిధిని దాటి విశ్లేషణ, సమస్యల పరిష్కారంలాంటి పనులను సులభతరం చేస్తోంది. కంపెనీవ్యాప్తంగా ఏఐని ఉపయోగించడం వల్ల దేశీ ఐటీ దిగ్గజాలకు భారీగా ఆదా అవుతోంది. ప్రతి మూడు నెలలకు 2,50,000 ఫుల్ టైమ్ పనిదినాల సమయం ఆదా అవుతోందని విప్రో తెలిపారు. అలాగే తమ సిబ్బంది 29,000 పైగా కస్టమ్ ఏఐ ఏజెంట్లను రూపొందించినట్లు వివరించారు. ఇక టీసీఎస్ విషయానికొస్తే.. నిర్దిష్ట పని పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 35 శాతం మేర తగ్గింది. దేశీ ఐటీ పరిశ్రమ పరిమాణం దాదాపు 300 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.ఏఐ డీప్‌ఫేక్‌లతో వ్యాపారానికి రిస్కువిప్రో వెల్లడిఏఐ వినియోగం వేగవంతం కావడమనేది రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని ఐటీ దిగ్గజం విప్రో హెచ్చరించింది. లోపభూయిష్టమైన అల్గోరిథంలు, పక్షపాత ధోరణులు, మారిపోతున్న నిబంధనలు, డీప్‌ఫేక్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటి రీత్యా తమ వ్యాపారానికి లీగల్‌గా, ఆర్థికంగా, పేరు ప్రతిష్టలపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని 2025–26 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్లకు అందించే సేవల్లోనూ, అంతర్గతంగా కార్యకలాపాల్లోను జనరేటివ్, అటానామస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ ఈ సాంకేతికత విషయంలో అనిశ్చితి నెలకొందని వివరించింది. పరిమిత స్థాయి మానవ జోక్యంతో ఏఐ సిస్టమ్‌లు పని చేయడం వల్ల అనుకోని ఫలితాలు వచ్చే రిసు్కలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వీసుల్లో లోపాల వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం లాంటి రిస్కులు ఉండొచ్చని విప్రో తెలిపింది. కొన్ని సర్వీసులకు డిమాండ్ తగ్గుతుంది ఏఐ ఆటోమేషన్ పెరగడం, సామర్థ్యాలు మెరుగుపడటం, క్లయింట్ టూల్స్‌ని వినియోగించడం లాంటి అంశాల వల్ల నిర్దిష్ట కోర్ సర్వీసులకు డిమాండ్ తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా ధరలు, లాభాల మార్జిన్లు, సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. అలాగే ఏఐ వినియోగంతో లీగల్, నియంత్రణ సంస్థ నిబంధనల అమలుపరంగా కూడా సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. ఒకవేళ ఏఐ ఎనబుల్డ్ సొల్యూషన్స్ వల్ల క్లయింట్లకు, వారి కస్టమర్లకు లేదా థర్డ్ పారీ్టలకు హాని జరిగితే తమ సంస్థ లిటిగేషన్లు, నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొనాల్సి రావొచ్చని విప్రో తెలిపింది. విప్రో ఐటీ సర్వీసుల్లో 62 శాతం ఆదాయం అమెరికన్ దేశాల నుంచి, 27 శాతం యూరప్ దేశాల నుంచి ఉంటోంది. అయితే, పశ్చిమాసియా, దక్షిణాసియాలో ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినొచ్చని, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడిళ్లు పెరగొచ్చని, వ్యాపారాలపై విశ్వసనీయత తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాలను తగ్గించుకోవడానికి లేదా జాప్యం చేయడానికి దారి తీయొచ్చని వివరించింది. ఇక దేశీయంగా పెరుగుతున్న వేతన వ్యయాల కారణంగా అమెరికా, యూరప్‌లోని టెక్ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలకు పోటీపడే సామ ర్థ్యాలు తగ్గొచ్చని తెలిపింది. -
నాస్కామ్ యూకే ఫోరమ్ షురూ
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమల అసోసియేషన్ నాస్కామ్ యూకే ఫోరమ్‌ను ఆవిష్కరించింది. తద్వారా రెండు యునైటెడ్ కింగ్డమ్(యూకే), భారత్ మధ్య ద్వైపాక్షిక టెక్నాలజీ, వాణిజ్య భాగస్వామ్యాలు మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది. దేశీ టెక్నాలజీ పరిశ్రమకు యూకే రెండో పెద్ద మార్కెట్‌కాగా.. వార్షిక ఆదాయం 90 బిలియన్ డాలర్లను మించుతోంది. ఈ నేపథ్యంలో నాస్కామ్ యూకే ఫోరమ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుకాగా.. సరీ్వసుల వాణిజ్యం 33 బిలియన్ డాలర్లుగా అంచనా. 2030కల్లా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపునకు పెంచుకోవాలనేది స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) లక్ష్యంకాగా.. డిజిటల్, టెక్నాలజీ ఆధారిత వృద్ధి కీలకంగా నిలవనుంది. సాంకేతిక భద్రతా కార్యాచరణ(టీఎస్ఐ)లో భాగంగా రెండు దేశాల మధ్య ఏఐ సాంకేతిక సహకారం మరింత ముందుకు సాగడంలో నాస్కామ్ యూకే ఫోరమ్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూకే సిటిజన్ సరీ్వసులను పెంచుకోవడంలో ఉపయోగపడనున్నట్లు నాస్కామ్ పేర్కొంది. ఏఐకు సిద్ధపడటం, మానవవనరుల నైపుణ్య పెంపు, డిజిటల్‌వైపు ఎస్ఎంఈల ప్రయాణం(ట్రాన్స్ఫార్మేషన్)సహా బాధ్యతాయుత ఏఐ వినియోగం, ఇన్నోవేషన్ విధానాలను పంచుకోవడం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందనున్నట్లు అభిప్రాయపడింది. -
ఐటీ.. రికవరీ పటిష్టం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ పరిశ్రమ రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని, ఆదాయాలు 11 శాతం దాకా వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు.. బీమా (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్, రిటైల్, తయారీ తదితర రంగాల్లో డిజిటలీకరణ వేగవంతం కానుండటం, ఔట్సోర్సింగ్ వంటి అంశాలు రికవరీకి దోహదపడగలవని పేర్కొంది. పరిశ్రమ వృద్ధి అంశంపై విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ కూడా రెండంకెల స్థాయిని అంచనా వేస్తుండటం గమనార్హం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం ఐటీ సేవల పరిశ్రమ 2020–21లో 2.7 శాతం వృద్ధి చెంది 99 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ–కామర్స్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ మొదలైన విభాగాలన్నీ కలిపితే 2.3 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డిజిటల్ డీల్స్ జూమ్.. కంపెనీల నిర్వహణ మార్జిన్లు మరింత మెరుగుపడటానికి లాభదాయకమైన డిజిటల్ ఒప్పందాలు ఉపయోగపడగలవని క్రిసిల్ తెలిపింది. ‘వ్యయాలను తగ్గించుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నందున ఐటీ సేవల ఔట్సోర్సింగ్ అంతర్జాతీయంగా క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రిమోట్ వర్కింగ్, ఈ–కామర్స్, ఆటోమేటెడ్ సేవలు వంటి విధానాలు పెరిగిన నేపథ్యంలో, డిజిటల్ సర్వీసుల వ్యాపారావకాశాలు మరింత పెరిగాయి‘ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. 2020–21లో దేశీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల పరిమాణం 20 శాతం పెరగ్గా.. ఇందులో సుమారు 80 శాతం వాటా డిజిటల్ డీల్స్‌దే ఉందని ఆయన పేర్కొన్నారు. క్రిసిల్ అంచనాల్లో మరికొన్ని.. ► ఐటీ సర్వీసుల ఆదాయంలో సుమారు 28 శాతం వాటా ఉండే బీఎఫ్ఎస్ఐ విభాగం .. ఈ ఆర్థిక సంవత్సరం 13–14 శాతం వృద్ధి నమోదు చేయనుంది. డిజిటల్ లావాదేవీలు, డేటా భద్రతరమైన జాగ్రత్తలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ వృద్ధి 9 శాతంగా నమోదైంది. ► ఐటీ ఆదాయాల్లో 30 శాతంగా ఉండే రిటైల్, తయారీ విభాగాలు ఈసారి కాస్త కోలుకుని 8–9 శాతం మేర వృద్ధి చెందవచ్చు. 2020–21లో ఇవి 2–3 శాతం క్షీణించాయి. ► కోవిడ్–19ని ఎదుర్కొనేందుకు మరింత వ్యయం చేస్తున్నందున హెల్త్‌కేర్ విభాగం వృద్ధి భారీగా 15–16 శాతం స్థాయిలో కొనసాగనుంది. ఐటీ సేవల ఆదాయంలో దీని వాటా 6 శాతం. ► ఆదాయ వృద్ధి మెరుగుపడినప్పటికీ 2020–21లో నమోదైన స్థాయికి మించి లాభదాయకత పెరగకపోవచ్చు. ప్రయాణాలు, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తగ్గడం వంటి అంశాల కారణంగా నిర్వహణ మార్జిన్లు 2 శాతం మెరుగుపడి ఏడేళ్ల గరిష్టమైన 25 శాతానికి పెరిగాయి. అయితే, ఈసారి క్రమంగా వ్యాపారపరంగా సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నందున ఇవి తగ్గవచ్చని అంచనా. ► ఐటీ సర్వీసులకు కీలకమైన అమెరికా, యూరప్ మార్కెట్లలో కరోనా మహమ్మారి కొత్తగా మళ్లీ విజృంభించే అవకాశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి: ప్రేమ్‌జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేయగలదని ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమ 2–3 శాతం వృద్ధి చెందడంతో పాటు నికరంగా కొత్తగా 1.58 లక్షల ఉద్యోగాలను కల్పించిన నేపథ్యంలో ఈసారి అంతకన్నా మెరుగ్గా రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రేమ్‌జీ ఈ విషయాలు తెలిపారు. మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలైన పరిస్థితుల్లో ఐటీ రంగం శరవేగంగా కొత్త మార్పులను ఆకళింపు చేసుకుని, యావత్ప్రపంచం ముందుకు సాగేందుకు తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొద్ది వారాల్లోనే కంపెనీలు.. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మారాయని, ఇప్పటికీ చాలా ప్రాజెక్టులకు సంబంధించి 90 శాతం దాకా సిబ్బంది ఇదే విధానంలో పనిచేస్తున్నారని ప్రేమ్‌జీ వివరించారు. కొంత మంది సిబ్బంది ఇంటి నుంచి, మరికొందరు ఆఫీసులోను పనిచేసే హైబ్రిడ్ విధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. -
దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం రూ.1.91 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ సేవల కోసం వెచ్చించే వ్యయాలు ప్రస్తుత ఏడాది 13.5 శాతం వృద్ధితో రూ.1.91 లక్షల కోట్లకు చేరే అవకాశముందని రీసెర్చ్ సంస్థ కోర్ క్వాడ్రాంట్ పేర్కొంది. దీని వల్ల దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం రూ.1.91 లక్షల కోట్లకు పెరగొచ్చని అభిప్రాయపడింది. గతేడాది దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోని పలు దిగ్గజ, మధ్యతరహా ఐటీ కంపెనీల వ్యాపార ప్రాధాన్యాలు, ప్రణాళికల ఆధారంగా నివేదికను రూపొందించినట్లు కోర్ క్వాడ్రాంట్ తెలిపింది. ఐటీ పరిశ్రమలో 2002 నుంచి చూస్తే 2013లో అత్యల్ప వృద్ధి నమోదయ్యిందని, ఇది 2014లో కాస్త పుంజుకొని, 2015లో పునరుద్ధరణ దిశగా పయనించిందని క్వాడ్రాంట్ తెలిపింది. కానీ 2015లో ఐటీ పరిశ్రమ పనితీరు మాత్రం అంచనాలకు దిగువనే ఉందని కోర్ క్వాడ్రాంట్ సహ వ్యవస్థాపకుడు కపిల్ దేవ్ సింగ్ తెలిపారు. ప్రస్తుత ఏడాది డిజిటల్ కార్యక్రమాలు ఐటీ పరిశ్రమ ఆదాయం పెరుగుదలకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. బిగ్‌డేటా, అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అంశాల ప్రాధాన్యం పెరుగుతుందని తెలిపారు.


