breaking news
district level games
-
విద్యార్థులకు 17న జిల్లాస్థాయి పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు మండలస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, పెయింటింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 17న జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సైన్స్ సెంటర్లో నిర్వహించే ఈ పోటీలకు ఆయా మండలాల నుంచి విజేతలు హాజరయ్యేలా చూడాలని ఎంఈఓలకు సూచించారు. -
వేడుకగా కళాఉత్సవ్ పోటీలు
మెదక్‌రూరల్: మెదక్ మండలం హవేళిఘణాపూర్ గ్రామంలోని డైట్ కళాశాలలో గురువారం రెండోరోజు కళాఉత్సవ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా దృశ్య కళలు, నాటకీకరణ విభాగాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా నాటకీకరణంలో 10 పాఠశాలలు, దృశ్యకళల పోటీల్లో 16 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రిన్సినాల్ రమేష్‌బాబు తెలిపారు. కాగా నాటకీకరణ విభాగంలో సిద్దిపేటలోని గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి, మెదక్‌పట్టణంలోని టీఎస్డబ్య్లుఆర్ఎస్ విద్యార్థులు ద్వితీయ బహుమతి, మెదక్ పట్టణంలోని టీఎస్ఆర్ఎస్ బాలికల పాఠశాల తృతీయ బహుమతులు సాధించాయి. అలాగే దృశ్యకళల విభాగంలో లక్డారం జెడ్పీహెచ్ఎస్ ప్రథమ బహుమతి, సిద్దిపేటలోని టీఎస్ఆర్ఎస్ ద్వితీయ బహుమతి, మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల తృతీయ బహుమతి సాధించాయి. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్ రమేష్‌బాబు అందజేశారు.