బర్త్‌డే విషెస్ చెప్పిన ధూపాటి హరిబాబు
తనకు తెలుగు సినిమాల్లో మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ)కు పుట్టిన రోజు సందర్భంగా హీరో వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపాడు. తొలి సినిమా ముకుంద పెద్దగా పేరు తేకపోయినా.. కంచె సినిమాతో మాత్రం ఒక్కసారిగా వరుణ్ తేజ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రెండో ప్రపంచయుద్ధం నాటి పరిస్థితుల మధ్య సాగే ప్రేమకథతో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని వరుణ్‌ను అందరూ ప్రశంసించారు.
దీనికి తోడు ఇప్పుడు తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లోఫర్' సినిమా కూడా క్రిస్మస్ సమయంలో విడుదల కానుంది. దాంతో మంచి జోష్ మీదున్న వరుణ్ తేజ్.. తనను నిలబెట్టిన దర్శకుడు క్రిష్‌కు బర్త్‌డే విషెస్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తనను ధూపాటి హరిబాబుగా (కంచెలో హీరో పేరు) మార్చిన క్రిష్‌కు వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే అని చెప్పాడు.
A very very happy birthday to the man who made me dhoopati haribabu... @DirKrish love you man.. pic.twitter.com/BzSCVkgGx7
— Varun Tej (@IAmVarunTej) November 10, 2015