breaking news
delhi parade
-
అక్టోబర్ 31.. రాష్ట్రీయ ఏక్తా దివస్
పట్నా: ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఏటా రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో పరేడ్ నిర్వహించినట్టుగానే రాష్ట్రీయ ఏక్తా దివస్ రోజున గుజరాత్‌లోని ఏక్తా నగర్లో భారీ పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. సర్దార్ వల్లబ్భాయి పటేల్ 150 జయంతి (అక్టోబర్ 31)ని పురస్కరించుకొని నవంబర్ 1 నుంచి భారత్ పర్వ్–2025 ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఈ పరేడ్ జాతీయ సమైక్యతను ప్రతిబింబిస్తుంది. సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రారంభిస్తున్న ఈ పరేడ్ ఏటా అక్టోబర్ 31న ఘనంగా జరుగుతుంది. ఈ పరేడ్ సర్దార్ పటేల్ సిద్ధాంతాలు, ఆయన సేవలను నేటి తరానికి తెలియజేసేలా ఉంటుంది. శుక్రవారం నిర్వహించే పరేడ్‌లో మహి ళా కంటింజెంట్, సాంస్కృతిక ప్రదర్శనలు, పారా మిలిటరీ పరేడ్ల వంటివి ఉంటాయి’అని షా వెల్లడించారు. 15 రోజులు భారత్ పర్వ్ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారత్ పర్వ్–2025 ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నట్లు అమిత్ షా ప్రకటించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 1న ప్రారంభమై ప్రముఖ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతి రోజైన నవంబర్ 15 వరకు గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (పటేల్ భారీ విగ్రహం) వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్కడే పటేల్ 150వ జయంతి వేడుకలను కూడా శుక్రవారం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని వెల్లడించారు. -
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: దేశ సైనిక శక్తిని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో గంటన్నరపాటు సాగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ హాజరు కానున్నారు. పరేడ్‌లో క్షిపణులు, డ్రోన్జా మర్లు, నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపై అమర్చిన మోర్టార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్‌లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాక రాకెట్ సిస్టమ్‌కు సారథ్యం వహించనున్నారు. సంప్రదాయ మిలటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పరేడ్‌లో పాల్గొననుంది. భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది. -
రిపబ్లిక్ డే పరేడ్కి విద్యార్థిని ఎంపిక
హిందూపురం రూరల్ : పట్టణంలోని చిన్మయ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ప్రాకృతి ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ భీమరాజశెట్టి బుధవారం తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కర్నూలు బెటాలియన్‌లో ఎన్సీసీ క్యాడెట్ల విభాగంలో విద్యార్థినికి చోటు దక్కినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాకృతిని అభినందించారు.


