breaking news
defy
-
లాక్డౌన్ ఉల్లంఘనలు : 3681 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పలుచోట్ల ప్రజలు ఉల్లంఘిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నోయిడా, గ్రేటర్ నోయిడాల్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 3219 మందిని నెలరోజులుగా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. రోజుకు సగటున 107 మంది లాక్డౌన్ ఉల్లంఘనులను అరెస్ట్ చేసినట్టు పోలీసు గణాంకాలు వెల్లడించాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 3681 మందిపై కేసులు నమోదయ్యాయని, వీటిలో 944 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గణాంకాలు వెల్లడించాయి. కాగా దేశరాజధానికి సమీపంలోని నోయిడా, గ్రేటర్ నోయిడాల్లోనూ కరోనా మహమ్మారి కేసులు అధికంగా నమోదయ్యాయి. చదవండి : యూపీ, ఢిల్లీలో హాట్స్పాట్లు మూసివేత -
చెల్లీ ఇక నీకేం కాదు...
చెల్లీ ఇక నీకేం కాదు... అన్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తన గర్భంలోని ముగ్గురు కవలలనూ కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని వైద్యులూ సవాల్ గా తీసుకున్నారు. ఇద్దరు మగ శిశువుల ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా పాపను రక్షించుకునేందుకు..ఆ తల్లి నెలలు నిండకుండా ముందుగానే ప్రసవం చేయించుకున్న తీరు... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన 22 ఏళ్ళ దన్ స్తాన్ అనే మహిళ ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నడి గర్భిణిగా ఉండగానే ఆమె ప్రసవానికి సిద్ధమైంది. మరో మార్గం లేని సందర్భంలో ఆమె... 28 వారాల్లోనే ప్రసవం చేయించుకుంది. ఇద్దరు మగ శిశువులతోపాటు... కడుపులో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపను కూడ రక్షించుకునేందుకు ఆమె భర్త రోహాన్ తో సంప్రదించి ధైర్యం చేసింది. ఆస్పత్రిలో ప్రసవం అనంతరం కాస్త అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పదకొండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. అనంతరం ఆ దంపతులు ముగ్గురు బిడ్డలనూ ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళారు. -
అసలు నష్టమెంత?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వారం రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే ఉన్నాయి. నెల రోజుల్లో చేతికొచ్చే తరుణంలో పంటలన్నీ నీటిపాలయ్యాయి. నష్టం గురించి ఏమని చెప్పగలం.. బ్యాంకుల నుంచి రైతులు రూ.742 కోట్ల రుణాలు తీసుకున్నారు. పరిహారం ఇచ్చే బదులు ఆ రుణాలు మాఫీ చేస్తే మంచిది.. వ్యవసాయాధికారుల సమాధానం. .. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పంట నష్టం కనీసం రూ.742 కోట్లు ఉన్నట్లు భావించాల్సి వస్తోంది. అయితే జిల్లా అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.265 కోట్లేనట!.. నష్టాలపై సర్వే మొదలు పెట్టకుండానే ఈ విధంగా అంచనా వేయడం గమనార్హం. అసలు రైతులకు జరిగిన నష్టమెంత? దాన్ని ఏ ప్రాతిపదికన గణించాలన్నది ప్రస్తుతం వ్యవసాయాధికారులను తర్జనభర్జనలకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం వ్యవసాయశాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన్నుంచి ఇదే ప్రశ్న ఎదురు కాగా అధికారులు సూటిగా చెప్పలేకపోయారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత నష్టమని చెప్పగలమని అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే ప్రాథమిక అంచనాలు సోమవారం తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి పంట 2.60 లక్షల ఎకరాల్లో నీట మునిగిందని తేల్చారు. నష్టం 260 కోట్లు ఉంటుదని అంచనా వేశారు. ఉద్యాన పంటలు 4500 ఎకరాల్లో దెబ్బతిన్నాయని, రూ. 5 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని నిర్థారణకు వచ్చారు. పంటంతా నీటిలోనే.. జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. నెల రోజుల్లో చేతికి రావాల్సిన ఈ పంటంతా గత వారం రోజు లుగా నీటిలోనే ఉంది. నీరంతా బయటకు వెళ్లడానికి మరో మూడు రోజులైనా పడుతుంది. ఈ లెక్కన పది రోజులు నీటిలో నానిన పంట దక్కే అవకాశం లేదన్నమాటే. పంటలు బాగా పండితే ఎకరాకు 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. బస్తా వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినా వెయ్యి రూపాయలు. అధికారుల చెప్పిన దెబ్బతిన్న పంట విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలకే లెక్క వేస్తే రూ. 800 కోట్లు అవుతుంది. దిగుబడిని దృష్టిలో ఉంచుకొని అంచనా వేయాలి పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు, దిగుబడులను దృష్టిలో ఉంచుకొని నష్టం అంచనాలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. పొలాల్లోనే ఉన్న పంట నష్టాన్ని ఎలా లెక్కించాలనే మీమాంస అధికారులు వ్యక్తం చేయడం సరికాదని రైతులు అంటున్నారు. మరో 30 రోజుల్లో చేతికి రావాల్సిన పంట నీటిపాలైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ఎకరాకు సగటు దిగుబడి ఆధారంగా నష్టం అంచనా వేయాలని కోరుతున్నారు. బ్యాంకు రుణాలతో సమానంగా నష్టం జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ. 742 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. పంట నష్టం కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్నందున రుణాలను వెంటనే మాఫీ చేయాలని.. ఇంతకంటే తామేమీ చెప్పలేమని మండల వ్యవసాయశాఖ అధికారులు జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదే కాకుండా చాలా మంది రైతులు ప్రైవేట్‌గా అప్పులు తీసుకున్నారు. ఇవన్నీ గుర్తించి అన్ని రకాల అప్పులు రద్దు చేయకుంటే పరిస్థితి మరో విధంగా ఉండే అవకాశం ఉంది. భూముల్లో మేటలు జిల్లాలోని మేజర్, మైనర్ ఇరిగేషన్ చెరువులు, కాలువలు, వంశధార, నాగావళి కాలువలకు 821 చోట్ల గండ్లు పడ్డాయి. ఇంకా పలు రోడ్లు కొట్టుకుపోయాయి. వీటిని సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. వేలాది ఎకరాల్లో మట్టి మేటలు వేసింది. దాన్ని తొలగించుకునేందుకు రైతులకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది.