breaking news
december 6
-
అయోధ్యలో పటిష్ట భద్రత
అయోధ్య: బాబ్రీ మసీదు కూల్చివేత దినం (డిసెంబర్ 6) సమీపిస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని ప్రజలు ప్రదర్శిస్తారని భావిస్తున్నట్లు అయోధ్య డిప్యూటీ కలెక్టర్ అనూజ్ ఝా చెప్పారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం రోజున కొందరు ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయోధ్యను నాలుగు విభాగాలుగా విభజించి భద్రతా బలగాలను మోహరించారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయోధ్య జిల్లాలో డిసెంబర్ 28 వరకూ 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. -
బీజేపీపై బుసలు కొడుతున్న 'కోబ్రా పోస్ట్'
-
'బాబరీ వల్లే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లింది'
ఈ దేశంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం ఏమిటి? ఉత్తరప్రదేశ్ మైనారిటీ వ్యవహారాల మంత్రి ఆజమ్ ఖాన్ ప్రకారం బాబరీ కట్టడాన్ని కూల్చేయడమే దీనికి కారణం. ఆదివారం ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఆజమ్ ఖాన్ ఏకె 47, ఆర్ డీ ఎక్స్ పంటి పదాలను అంతకు ముందు ఎవరూ వినలేదని, బాబరీ కట్టడం కూల్చి వేసిన తరువాతే ఇవన్నీ తెరపైకి వచ్చాయని ఆయన అన్నారు. మసీదు కూల్చడానికి ముందు హిందూ ముస్లింల మధ్య ఎలాంటి విద్వేషాలూ లేవని, అసలు గొడవంతా డిసెంబర్ 6, 1992 నుంచే మొదలైందని ఆజమ్ ఖాన్ అన్నారు. అయోధ్యకు అయిదు కి.మీ దూరంలో ఉండే ఫైజాబాద్ లో ఆజమ్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో ఆజమ్ ఖాన్ భారత మాత ఒక రాక్షసి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై చాలా దుమారమే చెలరేగింది. అయితే ఆజమ్ ఖాన్ తన వ్యాఖ్యలను ఇప్పటి వరకూ ఉపసంహరించుకోలేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కి ఆజమ్ ఖాన్ అత్యంత సన్నిహితుడు.