breaking news
DCC chief Naini rajendarreddy
-
నేతల నోట.. ‘నాయిని’ మాట
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రజా చైతన్యయాత్ర బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి రాష్ట్ర నేతలు హామీలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సభలో ప్రసంగించిన నేతలు నాయిని రాజేందర్‌రెడ్డి భవిష్యత్ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా వేదికపైనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. దీంతో పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘కష్టకాలంలో పనిచేసిన ఎవ్వరీని మర్చి పోం. నాలుగేళ్ల క్రితం అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా పటిష్టంగా ఉందో చూస్తున్నాం. రాజేందర్‌రెడ్డిలాంటి నేతలు కేసులకు వెరవకుండా కష్టపడి పని చేశారు. వారి కష్టాన్ని తప్పకుండా గుర్తిస్తాం’ అని హామీ ఇచ్చారు. అంతకు ముందు వీహెచ్ మాట్లాడుతూ చాలా మంది పార్టీలోకి వస్తున్నారు. వాళ్లను రమ్మనండి, కానీ పార్టీ జెండాలను మోసే వాళ్లను గుర్తించాలి. కేసులను ఎదుర్కొని నిలబడ్డ రాజేందర్‌రెడ్డిలాంటి వాళ్లను పార్టీ గుర్తించాలి. వచ్చీ రాంగనే కుర్చీల కూసుంటనంటే కుదరదు’ అని వేదికపైనే అన్నారు. ఆ తర్వాత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ నాయిని రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే చేద్దామా ? వద్దా ? అని సభికులను ప్రశ్నించారు. నాయినికి టిక్కెట్ ఇవ్వాలంటూ వేదిక మీద నుండే నేరుగా పార్టీ పెద్దలను అడుగుతున్నానని చెప్పారు. ఈ విషయంపై నేరుగా సోని యాగాంధీతో మాట్లాడుతానన్నారు. జెండా మోశా డు.. కష్టపడ్డాడు.. ఖర్చుపెట్టాడు.. అతడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానని చెప్పారు. చివర్లో శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని నడిపించిన రాజేందర్‌రెడ్డికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చివరగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారని, తనకు అత్యంత సన్నిహితులైన వేం నరేందర్‌రెడ్డి, సీతక్కతో పార్టీలో చేరామని, కాంగ్రెస్‌లో తమకు న్యాయం జరుగుతుంది’ అని చెప్పడం కొసమెరుపు. -
వరంగల్ నుంచే టీఆర్ఎస్ పతనం
సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. ఏడాది పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఒక్క మేలు చేయలేదని.. హామీలు నెరవేర్చని టీఆర్ఎస్కు వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలతో పతనం మొదవుతుందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ కార్యాచరణ, టీఆర్ఎస్ పాలనపై డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. - ఒక్క హామీని నెరవేర్చలేదు - ఉప ఎన్నికల్లో సత్తా చాటుతాం - ఎల్లుండి 4 సెగ్మెంట్లలో భేటీలు - డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్ఎస్ ఏడాది పాలనతో ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హామీల అమలులో టీఆర్ఎస్ సర్కారు ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఆసరాగా చేసుకుని మా పార్టీ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలు, వరంగల్ మహా నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం లక్ష్యం గా కార్యాచరణ ఉంటుంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కోసం కాంగ్రెస్ అగ్రనేతలు ఈ నెల 25న జిల్లాకు వస్తున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒకేరోజు ఒకే సమయంలో సమావేశాలు నిర్వహించాలని ముందుగా నిర్ణయించాం. దీంట్లో కొద్దిగా మార్పులు చేశాం. ఈ నెల 25న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లో వేర్వేరుగా సమావేశాలు జరుగుతాయి. పీసీసీ ముఖ్యనేతల బృం దాలు ఈ సమావేశాలు నిర్వహిస్తాయి. ఇలాం టి సమావేశాలు కాంగ్రెస్‌లో గతంలో ఎప్పుడు జరగలేదు. కార్యకర్తలు, నాయకులు భారీగా ఈ సమావేశాల్లో పాల్గొనాలి. పార్టీ బలోపేతం కోసం, ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహా లపై సలహాలు ఇవ్వాలి. వరంగల్‌పై చిన్నచూపు.. టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తుందనేది ప్రచారమే. వాస్తవం వేరుగా ఉంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఆచరణలోకి రావడం లేదు. తెలంగాణ ఉద్యమ వైతాళికులు కాళోజీ నారాయణరావు, జయశంకర్ పేరిట చేపట్టిన నిర్మాణాల్లో కదలిక లేదు. కాళోజీ కళా క్షేత్రం పనులు మొదలే కాలేదు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ స్మృతివనం అతీగతి లేదు. కేసీఆర్ ఆరోగ్య వర్సిటీ వరంగల్‌కు వరంగా ప్రకటించినట్లు టీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నన్నారు. ఏడాది కావస్తున్నా ఆరోగ్య వర్సిటీ బోర్డు తప్ప ఏమీలేదు. కాకతీయ ఉత్సవాలు మరిచారు. టెక్స్టైల్ పార్కు నిర్మాణం ఏమైందో తెలియడం లేదు. ముఖ్యమంత్రి నాలుగు రోజులు జిల్లా కేంద్రంలో ఉండి.. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని, పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని పలు చోట్ల శంకుస్థాపనలు చేశారు. ఇళ్ల నిర్మాణం అటకెక్కించారు. జిల్లా ప్రజలు వీట న్నింటిపై ఆలోచించాలి. పర్సంటేజీ పనులకే ప్రాధాన్యం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మిష న్ కాకతీయ పనులు ఆలస్యంగా ప్రారంభిం చింది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో చెరువులలోకి నీళ్లు చేరారుు. కొలతలు తీసేదెలా.. బిల్లులు మాత్రం చెల్లిస్తారు. దీన్ని బట్టి చూస్తే పర్సంటేజీల కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రజల సొమ్ము ను దోచుకునే విధానాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిలోనే వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రజల్లో ఉన్న బలమైన ఆకాంక్షను చూసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రా న్ని ఇచ్చారు. టీఆర్ఎస్ బంగారు తెలంగాణ పేరు చెబుతూ ప్రజలను నిర్లక్ష్యం చేస్తోంది. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మూలకు పడ్డాయి. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాలంటే వచ్చే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలి.