breaking news
country security
-
సైనికులకు సిరిధాన్యాల ఆహారం
మైసూరు: దేశ రక్షణ కోసం సరిద్దుల్లో పనిచేస్తున్న సైనికుల ఆరోగ్యాన్ని పెంపొందించేలా సిరిధాన్యాలను వారి ఆహారంలో వినియోగిస్తామని కేంద్ర రక్షణ, పర్యాటక శాఖల సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. శనివారం మైసూరులోని కేంద్ర రక్షణ ఆహార పరిశోధనా ప్రయోగాలయం (డీఎఫ్ఆర్ఎల్)లో ‘మిలిటరీ రేషన్, పౌష్టికాంశాలతో కూడిన సిరిధాన్యాలు’అంశంపై రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. చిరుధాన్యాల నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి కూడా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అత్యంత ఎత్తైన సియాచిన్ లాంటి ప్రాంతాల్లో గస్తీ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అన్నారు. వారు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సిరిధాన్యాలతో కూడిన ఆహారాన్ని అధికంగా ఇస్తామని చెప్పారు. -
మరో 54 చైనీస్ యాప్‌లపై నిషేధం!
India plans to ban 54 Chinese apps: దేశ భద్రతకు ముప్పు తెచ్చే 54 చైనీస్ యాప్‌లను నిషేధించాలని భారత్ యోచిస్తోందని అధికారులు తెలిపారు. అంతేకాదు నిషేధించిన యాప్‌లలో స్వీట్ సెల్ఫీ హెచ్డీ, బ్యూటీ కెమెరా- సెల్ఫీ కెమెరా, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ ఎక్స్‌రివర్, ఆన్‌మోజీఎరినా, యాప్‌లాక్, డ్యూయల్ స్పేస్ లైట్లు వంటివి ఉన్నాయి. గతేడాది జూన్‌లో దేశ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందని పేర్కొంటూ విస్తృతంగా ఉపయోగించే టిక్‌టాక్, వీచాట్, హెలో వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 59 చైనీస్ మొబైల్ అప్లికేషన్లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. పైగా మే 2020లో చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యలంఓ భారత్ దాదాపు 300 యాప్‌లను బ్లాక్ చేసింది. తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించిన నేపథ్యంలో జూన్ 2020లో తొలిసారిగా భారత్ ఈ నిషేధాన్ని ప్రకటించింది. (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
దేశ రక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గం
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనిక బలగాల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్గిల్ యుద్ధం 20వ వార్షికోత్సవం సందర్భంగా సైనికాధికారులు, మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పొరుగు దేశం చేసిన కుట్ర పన్నాగాన్ని రెండు దశాబ్దాల క్రితం వమ్ము చేసిన మన సైనిక బలగాలు మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా బుద్ధిచెప్పాయని పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రస్తుత యుద్ధ క్షేత్రం భూమి నుంచి అంతరిక్షం, సైబర్ రంగాలకు మారిపోయిందన్నారు. కార్గిల్ విజయం అందరికీ స్ఫూర్తి ‘దేశ సైనిక వ్యవస్థ ఆధునీకరణ అత్యంత అవసరం. అది మనకు చాలా ముఖ్యం. జాతి భద్రత విషయంలో ఎటువంటి ఒత్తిడికి గానీ ఎవరి పలుకుబడికి గానీ లొంగబోం. సముద్రగర్భం నుంచి విశాల విశ్వం వరకు భారత్ సర్వ శక్తులు ఒడ్డి పోటీపడుతుంది’ అని అన్నారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయన్న ప్రధాని.. యుద్ధంలో ఓటమికి గురై నేరుగా తలపడలేని వారే రాజకీయ మనుగడ కోసం పరోక్ష యుద్ధానికి, ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్నారని పాక్‌నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘మానవత్వంపై నమ్మకం ఉన్న వారంతా సైనిక బలగాలకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇది ఉగ్రవాదంపై పోరుకు ఎంతో అవసరం’ అని తెలిపారు. ‘యుద్ధాలను ప్రభుత్వాలు చేయవు, దేశం మొత్తం ఏకమై చేస్తుంది. కార్గిల్ విజయం ఇప్పటికీ దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది’ అని అన్నారు. ‘కార్గిల్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న సమయంలో అక్కడి యుద్ధ క్షేత్రానికి వెళ్లాను. ఆ పర్యటన ఒక తీర్థయాత్ర మాదిరిగా నాకు అనిపించింది’ అని ప్రధాని ఉద్వేగంతో చెప్పారు. ‘సైనిక బలగాల ఆధునీకరణ వేగంగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వనరుల అభివృద్ధి జరుగుతోంది. అక్కడి ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. -
పర్యావరణ రక్షణా, దేశ భద్రతా?
విశ్లేషణ పర్యావరణ రక్షణ, అమృత్ మహల్కవాల్స్భూముల్లో ఆదివాసులు, పక్షుల జీవజాతుల రక్షణకు సంబంధించిన సమాచారం అడిగితే అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం అని ఎలా చెప్పగలరు? కర్ణాటకలో అమృత్ మహల్ కవాల్స్ ప్రాంతంలో వేలాది ఎకరాలను పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చేశారు. అందువల్ల అక్కడి ఆదివాసులకు మంచినీటి ప్రాంతాలకు వెళ్లే దారులు మూసేసే విధంగా గోడలు కట్టుకున్నారు. వలస పక్షులు భయపడి అక్కడ వాలడం లేదు. జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటీ) నేలను, నీటిని, పక్షులను, జీవజాతిని, మనుషుల హక్కులను కాపాడే చర్యలు తీసుకోవాలని వివరమైన ఆదేశాలు జారీ చేసింది. కాని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కర్ణాటక పర్యావరణ ప్రేమికులు సమాచార హక్కు కింద ఏ చర్య తీసుకున్నారో చెప్పమని అడిగారు. భారతదేశ భద్రత సమస్య అని జవాబు. అందుకని సమాచారం ఇవ్వ లేదు. సౌర విద్యుత్త్తు పర్యావరణ భద్రత విషయంలో ఇంకా అనుమానాలు ఉన్నాయనీ కనుక ఆ పరిశ్రమలకు విచ్చలవిడిగా భూములు, ముఖ్యంగా హరిత క్షేత్రాలు ఇవ్వడం గురించి పునరాలోచించాలని ఎన్జీటీ సూచించింది. కర్ణాటక పరిశ్రమల సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ వారికి భూములు కేటాయించారు. ఆ భూముల్లో గుడులకు వెళ్లేందుకు అక్కడి ప్రజలను అనుమతించాలని, పూజలు చేసుకోనివ్వాలని ఎన్ జీటీ ఆదేశించింది. కలువెహళ్లి అనే గ్రామంలో ఉన్న పొలాలకు చేరుకునేందుకు గ్రామప్రజలకు అడ్డుగా ఉన్న కంచెను మరో చోటికి తరలించాలని ఆదేశించింది. ఖుదాపురా నుంచి తమ గొర్రెల ఫారంను చేరుకోవడానికి ప్రజలకు వెసులుబాటు కలిగించాలని బాబా అణు విద్యుత్కేంద్రం ఐఐఎస్సీని ఆదేశించింది. ఉల్లార్తి అనే గ్రామస్తులకు నీటి సమస్య ఏర్పడడానికి ఇస్రో నిర్మాణాలు కారణమైనందున వారికి నీటిని సరఫరా చేయాలని ఇస్రోను ఎన్జీటీ ఆదేశించింది. హరిత క్షేత్రం పర్యావరణ వ్యవస్థలో బస్టర్డ్ జాతి పక్షులకు ఇతర జీవజాతులకు జీవించే పరిసరాలు ఉంటాయి. వాటిని రక్షించకపోతే ఆ పక్షులు రావు. ఉన్న జీవరాశి కూడా బతకజాలదు. వీటన్నిటినీ బలిపెట్టి సాధించే అభివృద్ధి అభివృద్ధేనా? ‘ప్రాజెక్టు బస్టర్డ్’ వంటి ప్రాజెక్టులు ప్రారంభించాలని కూడా ఎన్జీటీ సూచించింది. అమృత్ మహల్ కవాల్స్లో మిగిలిన భూములనైనా రక్షించండి అని కూడా ఎన్జీటీ కోరింది. కర్ణాటక ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టాలన్నది. తుది చర్యలు ఏమిటో చెప్పాలని, పర్యావరణ సమృద్ధిని పునర్ వ్యవస్థీకరించడానికి చర్యలు తీసుకున్నారా? అని అడిగింది. ఇవి కాకుండా బాబా కేంద్రం, ఇస్రో పర్యావరణ కాలుష్య నివారణ మండలి అనుమతులను ఎందుకు తీసుకోలేదని కూడా అడిగింది. వారి అనుమతి ఇచ్చే సమయంలో పర్యావరణ రక్షణ షరతులను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా కాలుష్య నియంత్రణ మండలిని, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పూజల కోసం గుడులకు వెళ్లేందుకు ప్రజలను అనుమతించే నోటిఫికేషన్లు స్థానిక కన్నడ భాషలో ప్రచురించారా అని అడిగింది. సంప్రదాయ వేడుకలలో ఆ ప్రజలు పాల్గ్గొనేందుకు వెసులు బాటు కలిగించిన దాఖలాలు చూపాలని కూడా ఆదేశించింది. మరి ఏ చర్యలు తీసుకున్నారు అని సమాచార హక్కు కింద డేవిస్ జార్జి థామస్ అడిగారు. కొన్ని సంస్థలు జాతీయ భద్రతకు చెందిన పనులను నిర్వహిస్తున్న విషయం నిజమే కాని ఈ చర్యలు తీసుకున్నారా లేదా అనే చర్యానివేదికను కోరినప్పుడు ఆ సమాచారం వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు అనే వాదాన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ లేవనెత్తింది. పర్యావరణ రక్షణ, అమృత్ మహల్ కవాల్స్ భూముల్లో ఆదివాసులు, పక్షుల జీవజాతుల రక్షణకు సంబంధించి అడిగితే అది దేశ భద్రతకు సంబంధించిన రహస్యం అని ఏ విధంగా చెప్పగలరు? పర్యావరణ పరిరక్షణకు హరిత న్యాయస్థానం ఆదేశాలను పాటించడానికి వీల్లేదని, ఆ ఆదేశాలను పాటిస్తే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నిజంగానే భావిస్తే ఆ విషయం హరిత న్యాయస్థానానికి నివేదించి వారి ఆదేశాలు సవరించాలని కోరాల్సింది. అదేమీ చేయన ప్పుడు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆ ఆదేశాలను పాటించిందో లేదో తెలపాలని, అందుకు సంబంధిం చిన చర్యానివేదిక ఇవ్వాలని అడిగితే దేశభద్రతకు ముప్పు అని ఎలా చెబుతారంటూ కమిషన్ ప్రశ్నిం చింది. కేవలం సమాచార నిరాకరణకే నియమాలను నిరాధారంగా వాడుకోవడం సమంజసం కాదు. అయినా ఇస్రో, బార్క్ వంటి జాతీయ సంస్థల విధి నిర్వహణలో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలుంటే వాటిని బయట పెట్టకుండానే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎన్జీటీ జారీ చేసిన ఆదేశా లను ఎంతవరకు పాటించాలో తెలియ జేయాలని కమి షన్ రెండో అప్పీలు విచారణ తరువాత ఆదేశించింది. ఏ సమాచారం వెల్లడిస్తే జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది? అమృత్ మహల్ కవాల్స్ భూముల్లో నివసించే వారి సౌకర్యాలను రక్షించారో లేదో చెప్పడానికి దేశ భద్రతకు సంబంధం ఏమిటి అని వివరించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భం ఉంటే ఆ సమాచారం ఇవ్వకుండానే మిగిలిన చర్యల వివరాలు చెప్పే వీలుందా అని పరిశీలించాలి. ఇదేమీ లేకుండా కేవలం ఒక సాకుగా వాడి ఇంత కీలకమైన సమాచారం ఇవ్వకుండా నిరాకరించినందుకు పది వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఆదేశించింది. మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com