breaking news
the cotton crop
-
అప్పులబాధ తాళలేక..
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చినబోయినపల్లి పంచాయతి పరిధిలోని గొట్టికాయగూడెంలో మంగళవారం జరిగింది. గూడానికి చెందిన దేవయ్య(32) తనకున్న రెండున్నర ఎకరాల భూమిలో పత్తిపంట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా దిగుబడి సరిగా లేకపోవడంతో.. చేసిన అప్పులు తీర్చే దారికనపడక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైతు బలవన్మరణం
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూసం భద్రయ్య (50)కు రెండెకరాల పొలం ఉంది. దీనికితోడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ.2 లక్షల మేర అప్పులు చేశాడు. వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో మనస్తాపం చెందిన భద్రయ్య సోమవారం రాత్రి పురుగుల ముందు తాగాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.