breaking news
Corporate World
-
30వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు!
ఉప్పు నుంచి ఉక్కు దాకా... సబ్బుల నుంచి సాఫ్ట్వేర్ అగ్రగామిగా... దేశ ప్రజల తలలో నాలుకగా మారిన టాటా గ్రూప్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. నేడు రూ.30 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో దేశ కార్పొరేట్ జగత్తులో అత్యంత విలువైన ‘రతనం’లా వెలిగిపోతోంది. అలుపెరుగని ఈ పయనంలో టాటా బ్రాండ్‌కు ఖండాంతర ఖ్యాతిని తెచి్చన ఘనత కార్పొరేట్ ‘టైటాన్’ రతన్ టాటా సొంతం! లాభార్జనే ధ్యేయంగా కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకూ తమ వ్యాపార ఫలాలను పంచిన వితరణ శీలిగా కూడా చిరస్థాయిగా నిలిచిపోయారు.పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన హయాంలో టాటా గ్రూప్‌ను మహాసామ్రాజ్యంగా విస్తరించారు. ఇటు ప్రధానమైన వ్యాపార విభాగాలను పటిష్టం చేస్తూనే అటు పేరొందిన విదేశీ దిగ్గజ కంపెనీలను కూడా కొనేసి భారతీయ కార్పొరేట్ల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. మిగతా దేశీ కార్పొరేట్లకు స్ఫూర్తినిచ్చారు. విమర్శలు, హేళనలు ఎదురైనా వాటిన్నింటినీ అధిగమించి టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజంగా మల్చారు. రతన్ పగ్గాలు చేపట్టేనాటికి గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లు మాత్రమే. ఇక ఆదాయం 6 బిలియన్ డాలర్ల (అప్పటి రూపాయి మారకం విలువ ప్రకారం రూ.18,000 కోట్లు) స్థాయిలో నిదానంగా పురోగమిస్తున్న టాటా గ్రూప్ ఆయన సాహసోపేత నిర్ణయాలు, దూకుడు దన్నుతో నేడు ఏకంగా 165 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14 లక్షల కోట్లు) ఆదాయాల స్థాయికి విస్తరించింది. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్, టాటా స్టీల్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలు ఆయా రంగాల్లో అగ్రగాములుగా ఉన్నాయి. గ్రూప్ సంస్థల్లో ఏకంగా 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. గ్రూప్‌లో పది విభాగాల్లో ప్రధానంగా 30 కంపెనీలు ఉండగా వీటిలో 26 లిస్టెడ్ కంపెనీలున్నాయి. వీటికి అనుబంధంగా పలు సంస్థలు కూడా ఉన్నాయి. 2024 మార్చి 31 నాటికి వాటి టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా 365 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.30 లక్షల కోట్లు) అధిగమించడం విశేషం. టాటా సామ్రాజ్యంలోని సంస్థలు ఆరు ఖండాల్లో 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 6 బిలియన్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు.. రతన్ టాటా 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్ చైర్మన్‌గా వ్యవహరించారు. వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న 95 కంపెనీలు గ్రూప్‌లో ఉండేవి. కెమికల్స్, హోటల్స్, ఉప్పు, ఉక్కు, సబ్బులు, వాచీలు మొదలైన విభాగాల్లో ఇవన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, ఒకదానితో మరొకదానికి పెద్దగా సంబంధం లేని విధంగా ఉండేవి. రతన్ టాటా వచ్చాక వాటన్నింటినీ పునర్వ్యవస్థీకరించడం, కార్యకలాపాలను క్రమబదీ్ధకరించడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ అనుబంధ సంస్థలన్నింటికి కూడా ఒకే కార్పొరేట్ గుర్తింపు ఉండాలని నిర్దేశించారు. దేశీ మార్కెట్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టి, నిదానంగా నడుస్తున్న గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయి విస్తరించారు. ఐఐఎం బెంగళూరు పరిశోధన పత్రం ప్రకారం ఆయన హయాంలో గ్రూప్ ఆదాయాలు 6 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 18,000 కోట్ల నుంచి రూ. 5.5 లక్షల కోట్లకు) ఎగిశాయి. గ్రూప్ మార్కెట్ విలువ 9.5 బిలియన్ డాలర్ల నుంచి 91.2 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 30,000 కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్లకు) పెరిగింది. కీలక కొనుగోళ్లు.. కోరస్: ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్‌ను 2007లో టాటా స్టీల్ ఏకంగా 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. ఒక విదేశీ కంపెనీని ఇంత భారీ మొత్తం వెచి్చంచి కొనుగోలు చేయడం అప్పటిదాకా కనీవినీ ఎరుగనిది. ఈ కొనుగోలుతో టాటా స్టీల్ ఒక్కసారిగా ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు దిగ్గజాల జాబితాలోకి చేరిపోయింది. గ్రూప్ మార్కెట్ విలువను గణనీయంగా పెంచింది. అప్పటిదాకా ఎక్కువగా దేశీ మార్కెట్‌పైనే దృష్టి పెట్టిన టాటా స్టీల్, కోరస్ కొనుగోలుతో యూరప్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది. జాగ్వార్ ల్యాండ్‌రోవర్: రతన్ టాటా 2008లో మరో సాహసోపేతమైన ముందడుగు వేశారు. ఈసారి దిగ్గజ బ్రిటీష్ కార్ల బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్రోవర్పై గురి పెట్టారు. 2.3 బిలియన్ డాలర్లు పెట్టి కొనేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆ తర్వాత అదొక మాస్టర్‌స్ట్రోక్ అని రతన్ టాటా నిరూపించారు.గ్లోబలైజేషన్ బాటలో గ్రూప్.. ప్రధానంగా భారత్‌పై దృష్టితో కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూప్‌ను గ్లోబల్ ప్లేయర్‌గా రతన్ టాటా తీర్చిదిద్దారు. ఇందుకోసం దూకుడుగా విదేశీ కంపెనీలను కొన్నారు. 2008లో బ్రిటీష్ లగ్జరీ కార్ల బ్రాండ్లు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేయడం ద్వారా అంతర్జాతీయ ఆటోమోటివ్ మార్కెట్లో టాటా మోటార్స్‌ను ప్రముఖ సంస్థగా నిలిపారు. అంతకన్నా ముందుగా 2000లో టెట్లీని కొనుగోలు చేయడం ద్వారా గ్లోబల్ టీ మార్కెట్లో టాటా గ్రూప్ కూడా ప్రధాన ప్లేయర్‌గా ఎదిగింది.టీసీఎస్.. ఐటీ కోహినూర్!టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధిలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్) పాత్ర చాలా కీలకం. 1968లోనే ఏర్పడినప్పటికీ రతన్ టాటా సారథ్యంలో టీసీఎస్కి రెక్కలొచ్చాయి. 2004లో టీసీఎస్ పబ్లిక్ ఇష్యూకి వచి్చంది. ఏకంగా రూ. 4,713 కోట్లు సమీకరించింది. అప్పటి నుండి అద్భుతమైన పనితీరుతో టీసీఎస్ దూసుకెళ్తోంది. టీసీఎస్‌తో పాటు టాటా మోటర్స్, టాటా స్టీల్, టాటా పవర్ దన్నుతో గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 30 లక్షల కోట్లకు ఎగిసింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశంలో దొంగలు పడ్డారు
వీధి చివర మొగలో ఏడు పెంకులాట ఆడే పిల్లలు కనిపిస్తున్నారా? మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని అల్టిమేటం జారీచేసే అమ్మానాన్నల కళ్లు గప్పి ఆరుబయటకు వచ్చి జోరీ బాల్ ఆడే కుర్రాళ్లు కనిపిస్తున్నారా? బంతీ బ్యాటూ లేకపోతే రంగు రంగుల గోళీకాయలతో వీధుల్లో అంతర్జాతీయ మ్యాచులు ఆడే బాలలు కనిపిస్తున్నారా? ఎర్ర గోళీని పచ్చగోళీతో కొట్టేసి గెలిచిన ఆనందంలో కేరింతలు కొట్టేవాళ్లనీ, ఓడిపోయి గోళీ పోగొట్టుకుని రాజ్యం కోల్పోయిన రాజులా బెంగపడే వాళ్లనీ చూశారా? ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు పోగు చేసి వాటితో బొమ్మ గడియారాలు తయారు చేసే చిన్ని చిన్ని కళాకారులు కనిపిస్తున్నారా? సిగరెట్ ప్యాకెట్లనే చించి బచ్చాలాట ఆడుకునే బచ్చాల్ని ఈ మధ్య ఎక్కడైనా చూశారా? ఏ వెంకన్న కాపు పొలంలోనో... కాపరి లేని సమయం చూసి మామిడి చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడే అబ్బాయిలు మురిపిస్తున్నారా? ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అంటూ దాక్కున్న వాళ్లని పట్టుకోడానికి నానా తంటాలు పడే పిల్లల ఒలింపిక్స్ క్రీడ ఇప్పటికీ ఉందా? గూటీ బిళ్ల లేదా గిల్లీ దండా ఆటతో వీధిలో అటూ ఇటూ పోయే వాళ్లని భయపెడుతూ తమాషా చూసే పిల్లల ఆనందాన్ని చూశారా? ఇంట్లో పెద్దలు మరీ చండ శాసనుల్లా బయటకు వెళ్ళనీయకుండా ఆపేస్తే ఇళ్ల అరుగుల మీదే పులీ మేక ఆడే పిల్లలు ఇంకా ఆడుతున్నారా? మంచి ఎండలో ఏ మధ్యాహ్నమో ఐస్ ఫ్రూట్ అబ్బాయి ‘ఐస్... పాలైస్’ అంటూ అరుచుకుంటూ వస్తే అమాంతం నిద్ర నటనలోంచి బయటపడి ఐస్ కొని పెట్టమని పెద్దాళ్లను బతిమాలే పిల్లల ఆరాటం చూశారా? (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) ఇళ్ల లోగిళ్లలో రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు తొక్కుడు బిళ్ల ఆటలు ఆడుతున్నారా? తాటి ముంజెలను మూడు చక్రాల బళ్లుగా తయారు చేసుకుని వాటినే మెర్సిడెస్ బెంజ్ కారులా సంబరపడిపోయే పిల్ల ఇంజినీర్ల బాలానందాన్ని చూశారా? నదీ తీరాల్లో ఇసుకతో ఇళ్లు కట్టేసి గర్వంగా నవ్వుకునే బుల్లి సివిల్ ఇంజనీర్లు కొత్త వెంచర్లు వేస్తున్నారా లేదా? నెమలి పింఛాన్ని పుస్తకం మధ్యలో పెట్టుకుని కొబ్బరి మట్టపై నూగును తురిమి, పింఛానికి ఆహారంగా పెట్టి ప్రతీ రోజూ పింఛం ఎంత పెరిగిందో పరీక్షించుకునే అమాయక బాల్యంలోని అందాన్ని చూశారా? (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) వేసవిలో పూడిక తీతల పనుల కోసం కాలువలు బంద్ చేసే సమయంలో నడుం లోతు ఉన్న నీళ్లల్లో రోజూ దొంగచాటుగా ఈత కొట్టి తడిసిన జుట్టుతో ఇంట్లో డిటెక్టివ్లకు దొరికిపోయి వీపు మీద విమానం మోత మోగగానే గుక్కపెట్టి ఏడ్చే బాల్యాన్ని చూశారా? చిల్ల పెంకును కాలువ నీళ్లపై విసిరి అది ఎన్ని ఎక్కువ గంతులు వేస్తూ ముందుకు పోతే అంత గొప్ప అని పోటీలు పడి ఆడుకునే కుర్రాళ్లు ఇంకా ఉన్నారా? (చదవండి: ఋతు ఘోష) ఏవీ కనపడ్డం లేదు కదూ! మన ఆటలు మన ఆనందాలు రేపటి తరపు మధుర జ్ఞాపకాలు అన్నీ కూడా ఎత్తుకుపోయారు. మన నుండి మన ఆత్మను దోచుకుపోయారు. మన జీవితాల నుండి వెలుగులను దోచుకుపోయారు. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే మన దేశంలో అడుగు పెట్టాయో అప్పుడే కార్పొరేట్ దొంగలు అవతరించారు. వారే మన ఊళ్లల్లోని చేతి వృత్తులను ఎత్తుకుపోయారు. మన పేదల ఉపాధి అవకాశాలు ఎత్తుకుపోయారు. ఊళ్లల్లో జీవాన్ని, బాలల్లో ఆనందాన్ని, మనుషుల్లో మానవత్వాన్ని... అన్నింటినీ ఎత్తుకుపోయారు. అన్నీ దోచుకుపోయిన ఘరానా దొంగలను పట్టుకోండని ఎవరికి చెప్పాలి? ఒక్కసారి మళ్లీ బాల్యంలోకి రివైండ్ అయిపోయి గత కాలపు ఆటలు మరోసారి ఆడుకుంటే బాగుండునని అనిపిస్తోంది కదూ! కార్పొరేట్ ప్రపంచంలో ఈ కల బహుశా ఇక ఎప్పటికీ నెరవేరదేమో? పగటి కలలోనే ఇక ఈ ఆటలు ఆడుకోవాలేమో? – సి.ఎన్.ఎస్.యాజులు -
ఆగస్ట్‌లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్‌ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
లావెక్కుతున్న కార్పొరేట్ ప్రపంచం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ‘ఫిట్నెస్’ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరో పక్క కార్పొరేట్ ప్రపంచంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు బొజ్జలు పెంచుతూ లావెక్కుతున్నారు. కనుక వీరికి మధుమేహం, గుండెపోటు లాంటి ప్రాణాంతక జబ్బులు అనివార్యమవుతున్నాయి. దేశంలో మూడింట రెండు వంతుల మంది కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు ‘బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ)’ సగటున 25 ఉందని ‘హెల్దీఫైమీ’ అనే యాప్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. వారందరి మాస్, అంటే ద్రవ్యరాశి 24.9 ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మనిషి ఎత్తు, బరువును బట్టి బీఎంఐని నిర్ధారిస్తారు. ఎత్తును మీటర్లలో, బరువును కిలోల్లో లెక్కించి ద్రవ్యరాశిని లెక్కిస్తారు. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారి బీఎంఐ 25కు పైనే ఉంటుంది. ఎత్తుకు తగ్గ బరువుకన్నా తక్కువ బరువు ఉన్నవారే బీఎంఐకి 25లోపు వస్తారు. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువ వరకు కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం, మానసిక ఒత్తిడికి గురవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆర్థిక సర్వీసుల్లో, ఉత్పత్తిరంగాల్లో పనిచేస్తున్న వారి జీవన శైలి దాదాపు ఇలాగే ఉంటుంది కనుక వారు లావెక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వినిమయ సరుకులు, అతి వేగంగా అమ్ముడుపోయే వినిమయ సరకులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే వారి ఆరోగ్యం ఆర్థిక, ఉత్పత్తి రంగాల్లో పనిచేసే వారికన్నా మెరుగ్గానే ఉంటుంది. ఎందుకంటే భారతీయ ప్రమాణాల ప్రకారం వారు రోజు ఆఫీసు విధుల్లో వెయ్యి మెట్లు ఎక్కడానికయ్యేంత శ్రమను శారీరకంగా అనుభవిస్తారు. అందుకని వారు కాస్త ఫిట్‌గానే ఉంటారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లే కాకుండా గుమాస్తా గిరి చేసే ఉద్యోగులంతా లావెక్కడానికి మరొక ముఖ్య కారణం ఉంది. అదే ‘ఛాయ్... సమోసా’ కల్చర్. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసే వీరి సాయంత్రం వేళల్లో సరదాకు అన్నట్లు సమోసాల్లాంటి ఆయిల్లో మరిగించే పిండి పదార్థాలు తినడం బొజ్జ పెరగడానికి, లావెక్కడానికి ప్రధాన కారణమని ‘హెల్దీఫైమీ’ యాప్ ‘కార్పొరేట్ ఇండియా ఫిట్నెస్ రిపోర్ట్’లో వెల్లడించింది. ప్రొటీన్లు తక్కువ తిని, కొవ్వు పదార్థాలున్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్లనే సహజంగా స్థూలకాయం వస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. (చదవండి: ఈ ‘టీ’ తాగితే బరువు తగ్గొచ్చు!!) -
వలసల వాయిదా ..!
కెరీర్ గమనంలో.. ఉన్నత శిఖరాలను వేగంగా అధిరోహించాలనే ఆతృత.. ఆ క్రమంలోనే ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం, పదోన్నతులు పొందడం.. ఆపై మరో కంపెనీ మెట్లెక్కడం.. కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యంగా ఐటీ కంపెనీల్లోని కుర్రకారుతీరు ఇలానే ఉంటుంది! ఒకే కంపెనీకి ఏళ్ల తరబడి అతుక్కొని ఉండటం అనేది నేటి జనరేషన్ ఉద్యోగులకు అస్సలు నచ్చని ముచ్చట. అయితే దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం, అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు కొత్త సంవత్సరంలో కొత్త కంపెనీలో చేరాలనుకునే వారికి శరాఘాతంగా మారాయి. వేరే కంపెనీల నుంచి ఆఫర్లు వస్తున్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ‘కాలు నిలవని కుర్రకారు’.. ప్రస్తుతం కొత్త కంపెనీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో చూద్దాం.. కంపెనీ మారడమా.. ఇప్పుడొద్దు బాసూ! అంటున్న యువ ఉద్యోగులు నిన్న ‘‘ఫలానా కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ప్రస్తుత ఉద్యోగం కంటే రెట్టింపు శాలరీ.. ఎక్స్ట్రా బెనిఫిట్స్. అందుకే కంపెనీ మారుతున్నాను.’’ ‘‘ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో చేరి అయిదేళ్లు అయింది. కెరీర్ మొనాటనీగా మారింది. వేరే కంపెనీకి మారడం బెటర్ అనిపిస్తోంది. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను’’ – ఇప్పటి వరకు యువ ఉద్యోగుల నుంచి ఇలాంటి మాటలే వినిపించేవి! నేడు ‘‘ఫలానా కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ప్రస్తుత ఉద్యోగం కంటే రెట్టింపు శాలరీ.. ఎక్స్ట్రా బెనిఫిట్స్. అందుకే కంపెనీ మారుతున్నాను.’’ ‘‘ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో చేరి అయిదేళ్లు అయింది. కెరీర్ మొనాటనీగా మారింది. వేరే కంపెనీకి మారడం బెటర్ అనిపిస్తోంది. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను’’ – ఇప్పటి వరకు యువ ఉద్యోగుల నుంచి ఇలాంటి మాటలే వినిపించేవి! కంపెనీల్లో వలసలు గత అయిదేళ్లలో తొలిసారిగా భారీగా తగ్గనున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏయాన్ హ్యుయట్ ఇండియా గణాంకాల ప్రకారం గతేడాది 16 శాతంగా నమోదైన అట్రిషన్ రేటు ఈ సంవత్సరం ఇంకా తగ్గనుంది. స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ సంస్థ కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంస్థ గణాంకాల ప్రకారం గతేడాది అట్రిషన్ రేటు 16.3 శాతం కాగా, ఈ ఏడాది ఇంకా భారీగా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితి రావడం ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాస్త ఆగుదాం.. కంపెనీలు మారాలనుకునే ఉద్యోగులు సోషల్ నెట్వర్క్, ఆయా సంస్థల్లో అప్పటికే పనిచేస్తున్న వారి ద్వారా రిఫరల్స్, జాబ్ సెర్చ్ ఇంజన్స్ ద్వారా ప్రయత్నాలు చేస్తారు. కానీ, ప్రస్తుతం ఈ మూడు మార్గాల్లోనూ జాబ్ చేంజ్ ఔత్సాహికుల సంఖ్య గతేడాదితో పోల్చితే తగ్గింది. మరోవైపు ఆయా సంస్థలు ఎంట్రీ లెవెల్లో చేపట్టే తాజా నియామకాల సంఖ్యను తగ్గించుకునేలా హైరింగ్ ప్లాన్స్‌ను సవరించుకుంటున్నాయి. ఎంట్రీ స్థాయిలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు.. మిడిల్ లెవెల్లో కొత్త నియామకాల ఊసు కొన్ని నెలల పాటు కష్టమేనని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యాంపస్ రిక్రూట్మెంట్స్లోనే గతంతో పోల్చితే తక్కువ ప్యాకేజీలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మిడిల్, సీనియర్ లెవెల్లో భారీ ప్యాకేజీలతో వలసలను ప్రోత్సహించే పరిస్థితిలో కంపెనీలు లేవు. అంతేకాకుండా కంపెనీల్లో బాగా సీనియర్ హోదాల్లో ఉండి, మరింత మంచి ఉద్యోగం కోసం కంపెనీలు మారే వారు సైతం ‘వెయిట్ అండ్ సీ’ దృక్పథంతో ఉన్నారు. వ్యాపారాలపై ప్రభావం కంపెనీ, ఉద్యోగం మారాలనుకునే వారిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం చూపుతోంది. పరుగెత్తి పాలు తాగే కంటే.. నిలబడి నీళ్లు తాగడం బెటర్ అనే విధంగా ఔత్సాహికులు తమ ఆలోచన శైలిని మార్చుకుంటున్నారు. దాంతో ఈ ఏడాది కంపెనీల్లో ఉద్యోగుల వలసలు తక్కువగా ఉంటాయని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన కరెన్సీ రద్దు నిర్ణయం అన్ని రంగాలు, అన్ని రకాల వ్యాపారాలపై ప్రభావం చూపింది. దీంతో కంపెనీలు కొత్త నియామకాలు చేపట్టడంపై పునరాలోచనలో పడ్డాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పేర్కొన్న నియామక ప్రణాళికలతో పోల్చితే దాదాపు 30 నుంచి 40 శాతం మేర కొత్త నియామకాలు తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. దాంతో కంపెనీలు మారుదాం అనుకునే ఉద్యోగుల్లో సైతం మార్పు కనిపిస్తోంది. ఆశాజనకంగాలేని ఆఫర్లు కంపెనీల్లో ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, వేతనాల్లో పెరుగుదల నిర్ణయాలు జరుగుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మారుతున్న పరిణామాలతో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో కొత్త కంపెనీల కోసం ప్రయత్నించడం అనవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుత కంపెనీలోనే కొనసాగి, మంచి పనితీరు కనబరిచి ఇంక్రిమెంట్ల పరంగా బెస్ట్ లెవల్స్ అందుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. హెచ్ఆర్ ఆలోచనల్లో మార్పు సాధారణంగా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారే ఉద్యోగుల్లో.. కనీసం నాలుగైదేళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారు ఉన్నత హోదాల కోసం కంపెనీ మారడంపై దృష్టిసారిస్తారు. ఇప్పుడు ఈ స్థాయి అనుభవం ఉన్నవారిని చేజార్చుకుంటే అంతే స్థాయి నైపుణ్యాలున్న వారిని అన్వేషించి, నియమించుకోవడం హెచ్ఆర్ వర్గాలకు కష్టమే. అందుకే మానవ వనరుల విభాగాలు జాబ్ చేంజ్ ఆలోచనతో ఉన్న ఉద్యోగులపై అంతర్గతంగా ఆరా తీస్తూ.. వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఐటీ.. కెరీర్ పరంగా రాకెట్లాంటి వేగానికి చిరునామాగా పేర్కొనే రంగం. అందుకే ఇందులో వలసల రేటు ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ఐటీలోనూ కంపెనీలు మారే రేటు తక్కువగానే నమోదు కానున్నట్లు సమాచారం. గత అక్టోబర్‌లో విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం– కరెన్సీ రద్దు నిర్ణయం కంటే ముందు దేశంలో సాఫ్ట్వేర్ దిగ్గజాలుగా పేరొందిన టీసీఎస్‌లో 12.9 శాతం, విప్రోలో 17.2 శాతం, ఇన్ఫోసిస్‌లో 20 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో 18.6 శాతం చొప్పున జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అట్రిషన్ రేటు నమోదైంది. టీసీఎస్ ఈ ఏడాది ప్రారంభంలోనే అట్రిషన్ రేటు తగ్గింపు దిశగా దృష్టిసారించి, 90 రోజుల నోటీస్ పీరియడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా జాబ్ మారాలనుకున్న వారి ఆలోచనలో ఆ సమయంలో మార్పు రావొచ్చనేది అభిప్రాయం. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలబడదాం.. మొత్తం మీద కరెన్సీ రద్దు ప్రభావంతో ఇటు ఉద్యోగులు, అటు కంపెనీల యాజమాన్యాల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది రోజులు వేచి చూద్దాం.. అనే ధోరణితో ఉద్యోగులు ఉండగా.. కంపెనీలు ఉన్న ఉద్యోగులను కాపాడుకునేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఉద్యోగుల వలసల రేటును అట్రిషన్ రేటుగా పేర్కొంటారు. ఇది 2015–16లో 16 నుంచి 17 శాతం మధ్యలో నమోదైంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ స్థాయిలో అట్రిషన్ రేటు ఎక్కువగా ఉంటుంది. కంపెనీల పరంగా చూస్తే అట్రిషన్ ఐటీ కంపెనీల్లో కొంత ఎక్కువ. -
వితరణ శీలి..
బఫెట్.. ఇది పేరు మాత్రమే కాదు.. కార్పొరేట్ ప్రపంచంలో ఒక బ్రాండ్ ఇంత సంపాదించినా బఫెట్ ఉండేది మాత్రం 1956లో ఒమహాలో తాను కొన్న ఇంట్లోనే. అప్పట్లో 40వేల డాలర్లకు కొన్న ఆ ఇంట్లోనే నిరాడంబరంగా జీవిస్తుండటం మరొకరికి సాధ్యం కాదేమో!! ఇన్వెస్ట్మెంట్ గురు అన్నా... దాన కర్ణుడన్నా... ఏదన్నా బఫెట్టే. తండ్రి హోవార్డ్ బఫెట్ ఓ స్టాక్‌బ్రోకర్. ఎంపీ కూడా. తల్లి లీలా స్తాల్. 1930లో నెబ్రాస్కాలోని ఒమహాలో పుట్టిన బఫెట్... 26 ఏళ్లకే పార్ట్నర్షిప్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయటంతో పాటు 35 ఏళ్లకల్లా బెర్కషైర్ హాతవేను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. మీడియా, బీమా, ఎనర్జీ, ఆహార - శీతల పానీయాల రంగాల్లో భవిష్యత్తును ఊహించి చేసిన పెట్టుబడులు... ఆయన్ను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిని చేశాయి. ఆ సంపదే ఆయన్ను గొప్ప వితరణశీలిగా మార్చింది. అందుకే... వ్యాపార ప్రపంచంలో అందరూ గౌరవించే వ్యక్తి బఫెట్. 11 ఏళ్లకే ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టిన బఫెట్.. తండ్రి బ్రోకింగ్ సంస్థలో సిటీస్ సర్వీస్ షేర్లు మూడింటిని 38 డాలర్ల వద్ద కొన్నారు. వెంటనే అది 27 డాలర్లకు పడిపోయింది. కానీ ఓపిగ్గా ఎదురుచూశారు. చివరికి 40 డాలర్ల వద్ద అమ్మి కాస్త లాభం సంపాదించారు. అయితే అది 200 డాలర్లకు వెళ్లినపుడు... ఆ లాభాన్ని సొమ్ము చేసుకోనందుకు బాధపడ్డారు. మార్కెట్లో ఓపిక ఎంత ముఖ్యమో చెప్పటానికి దీన్నొక ఉదాహరణగా చెబుతారాయన. ఈ సహనమే ఆయన బెర్కషైర్ సామ్రాజ్యాన్ని రూ.11.5 లక్షల కోట్ల వార్షికాదాయం, 3 లక్షలకు పైగా ఉద్యోగుల స్థాయికి చేర్చింది. అటు ఆయన ప్రారంభించిన ‘వితరణ ఉద్యమం’ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యమం స్థాయికి చేరుకుంది. తన సంపదలోంచి ఏకంగా 83 శాతాన్ని (30.7 బిలియన్ డాలర్లు) విడతల వారీగా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఇస్తానని 2006లో ప్రకటించారు. వేరొక సందర్భంలో తన సంపదలో 99 శాతాన్ని దాతృత్వానికే ఖర్చు చేస్తానని కూడా చెప్పారాయన. ప్రపంచ దాతృత్వ సూచీలో మనమెక్కడ? (ర్యాంకుల వారీగా) వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనేది ఓ వార్షిక నివేదిక. సమాచారాన్ని సేకరించేది మాత్రం గ్యాలప్ పోల్ ద్వారానే. 1000కి పైగా ప్రశ్నలతో రూపొందించిన పత్రాన్ని 140కిపైగా దేశాల్లో శాంపిల్ పద్ధతిలో అన్ని వర్గాల ప్రజల ముందూ ఉంచి సమాధానాలు రాబట్టే పోల్ ఇది. దీని ఆధారంగా చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (సీఏఎఫ్) తొలిసారి 2010లో ఈ నివేదికను విడుదల చేసింది. తాజాగా ఈ ఏడాది విడుదల చేసిన నివేదికలో మన స్థానం ఏకంగా 106. మన పక్కనున్న మరో అగ్రదేశం చైనా స్థానం 144. ఈ జాబితాలోని టాప్-10 దేశాలివీ... దాతృత్వానికీ ఓ లెక్కుంది! అమెరికానే కాదు. ప్రపంచమంతటా ఒకటే తీరు. దానం చేస్తే పదిమందికీ తెలియాలి. ఆలయాల నుంచి షాదీఖానాల వరకూ అదే తీరు. ఇక పైస్థాయిలో వర్సిటీల నుంచి మ్యూజియంలలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. అంతెందుకు! రోడ్డు పక్కనున్న చిన్న పార్కును నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థ పేరు... అక్కడే పెద్ద బోర్డుపై కనిపిస్తుంది. ఈ ధోరణి కాస్త ఎక్కువ కావటంతో విమర్శలొచ్చిన కొన్ని సంఘటనలు చూద్దాం... ►న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్‌కు చెందిన అవెరీ ఫిషర్ హాల్‌ను నవీకరించటానికి న్యూయార్క్ వ్యాపారవేత్త డేవిడ్ గెఫెన్ 100 మిలియన్ డాలర్లిచ్చారు. అయితే అవెరీ ఫిషర్ హాల్ పేరును డేవిడ్ గెఫెన్ హాల్‌గా మార్చాలని షరతు పెట్టారాయన. మరి 1994లో మరణించిన దాత ఫిషర్ సంగతేంటి? ఆ పేరును మార్చేస్తే ఫిషర్ ఫ్యామిలీ ఊరుకుంటుందా? లింకన్ సెంటర్ యాజమాన్యం ఫిషర్ కుటుంబీకులతో బేరం పెట్టింది. చివరకు 15 మిలియన్ డాలర్లకు వారు నిరభ్యంతరం చెప్పారు. అలా ఫిషర్ పేరు చెరిగిపోయి ఆ హాలుకు గెఫెన్ పేరొచ్చింది. ఉన్న పేరును మార్పించేసి మరీ తన పేరు పెట్టుకున్న గెఫెన్ దానికి విరాళమిచ్చినట్లు లేదని, వేలంలో కొనుక్కున్నట్టే ఉందని విమర్శకులంటున్నారు. ► సిటీ గ్రూప్ మాజీ సీఈఓ స్టాన్ఫోర్డ్ వీల్ భార్య జోవన్ వీల్ది మరీ చిత్రమైన విరాళం. ఆమె న్యూయార్క్‌లోని పాల్ స్మిత్ కాలేజీకి 20 మిలియన్ డాలర్ల విరాళమిస్తానన్నారు. కాలేజీ పేరును జోవన్ వీల్ -పాల్స్మిత్ కాలేజీగా మార్చమన్నారు. యాజమాన్యం సరేనంది. ఇది ఒకరకంగా లంచం ఇవ్వటమేనని, కాలేజీ చరిత్రను వంచించటమని పూర్వ విద్యార్థులు గోలపెట్టారు. కోర్టుకూ వెళ్లారు. పేరు మార్చటానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేయటంతో... విరాళం ఇవ్వకూడదని జోవన్ వీల్ నిర్ణయించారు. పాల్ స్మిత్ కాలేజీ విద్యార్థులంతా ఫేస్బుక్లో ఈ డీల్‌ను ఎండగట్టారు. -
విదేశీ భాషలందు వెలుగు లెస్స..
- ఇంగ్లిష్తో పోటీగా విదేశీ భాషలకు ఆదరణ - ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని సిటీజనుల తపన - విదేశీ భాష నేర్చిన వారికి కార్పొరేట్ కంపెనీల ప్రాధాన్యం నడుస్తున్న కార్పొరేట్ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్ అవసరం.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని విదేశీ భాషలొస్తే అన్ని అవకాశాలు.. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు గమనిస్తే.. అత్యధికులు మాట్లాడే భాష చైనీస్ (20.7 శాతం), ఇంగ్లిష్ (6.2శాతం). అంటే 93.8 శాతం మంది జనాభా ఆంగ్లం మాట్లాడడం లేదనే వాస్తవాన్ని ప్రస్తుత తరం పూర్తిగా అర్థం చేసుకుంది. ఈ నేపథ్యంలో మన నగరంలో విదేశీ భాషలపై మక్కువ రెట్టింపవుతోంది. విదేశీ విజృంభణకు కారణాలెన్నో.. ► వేర్వేరు భాషలు నేర్చుకుంటున్న కొద్దీ మెదడు మరింత పదునెక్కుతుందట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా స్పష్టం చేశారు. ► భాషలు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఆలస్యంగా మతిమరుపు వస్తుందని, బహుభాషా ప్రవీణుల మెదడు అనేక అంశాల్లో చురుకుగా ఉంటుందని వీరు తాజా పరిశోధనతో తేల్చారు. ఇలాంటి పరోక్ష లాభాల సంగతెలా ఉన్నా.. ఐటీ సెక్టార్లో ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్లకు ఉన్న భారీ డిమాండ్‌ను ఉపయోగించుకునేందుకు, ఇతర దేశాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన పెంచుకునేందుకు, కనీసం మూడు అన్యభాషలు నేర్చుకుని ఉండ డం కెరీర్‌కు దోహదపడుతుండడం, మల్టీ నేషనల్ కంపెనీలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్న వారికి ప్రాధాన్యం ఇస్తుండడం, విదేశాలకు రాకపోకలు సాగించే అవసరాలు పెరగడం.. ఇలా పలు రకాల లాభాలు విదేశీ భాష పట్ల మోజు పెంచుతున్నాయి. ► అప్పటికప్పుడు విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరాలు కూడా మీద పడుతున్నాయి. నగరానికి చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగుల బృందాన్ని మెక్సికోకు పంపాల్సి వచ్చింది. ఆఘమేఘాల మీద వారికి నెట్ ద్వారా ప్రాథమిక మెక్సికన్ భాషా పరిజ్ఞానంలో శిక్షణ ఇప్పించింది. ► రామకృష్ణమఠంతో పాటు ఇఫ్లూ, ఓయులో డిప్లొమా కోర్సులు, ఫ్రెంచ్ కోసం అలయెన్స్ ఫ్రాంఛైజ్, జర్మన్ కోసం గోతెజంత్రం ఉన్నాయి. ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి. ‘త్వరలో సిటీలో జపనీస్ లాంగ్వేజ్ కోర్సును ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు జపాన్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రెసిడెంట్ రమాకాంత్. బెస్ట్ ఫ్రెండ్.. ఫ్రెంచ్.. గరంలో అత్యధికులు నేర్చుకుంటున్న భాషల్లో ఫ్రెంచ్ తొలి స్థానంలో నిలుస్తోంది. తర్వాత ఆంగ్లం సెకండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా పేరొందిన ఫ్రెంచ్ దేశవ్యాప్తంగా చూస్తే 2014లో స్కూల్ టు యూనివర్సిటీ స్థాయిలో నేర్చుకున్నవారి సంఖ్య 2.50 లక్షల పైచిలుకు ఉందట. దీనిలో కేవలం అలయెన్స్ ఫ్రాంఛైజ్ ద్వారా నేర్చుకున్నవారి సంఖ్య 35,800. కెరీర్ పరంగా కూడా ఇది మంచి అవకాశాలు అందిస్తోంది. నగరంలోని కార్పొరేట్ కంపెనీలు ఈ భాష తెలిసిన వారికి మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. కెరీర్ పరంగానూ ఇది ప్రాఫిటబుల్. ‘మొదటి నుంచి ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకున్నా. ఫ్రెంచ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. దీనిలో అడ్వాన్స్డ్ డిప్లొమా చేశాను. అయితే దీన్ని కెరీర్‌గా చూడడం లేదు. కేవలం హాబీగా నేర్చుకున్నానంతే’ అంటూ చెప్పారు జ్యోత్స్న. జోష్.. స్పానిష్.. వకాశాలు, ఆదరణ పరంగా స్పానిష్ లాంగ్వేజ్‌కు రెండో స్థానం దక్కుతోంది. ఈ భాషను నేర్చుకోవడం సులభం అంటారు. దీంతో ఏదైనా ఒక విదేశీ భాష వచ్చి ఉండడాన్ని కనీస అర్హతగా భావిస్తున్న వారు స్పానిష్‌కి సై అంటున్నారు. సరిగా సాధన చేస్తే ఈ భాషను 18 నెలల స్వల్ప కాలంలోనే నేర్చుకోవచ్చనేది నిపుణుల మాట. కెరీర్ పరంగానూ ఇది మంచి ఆప్షన్. ‘ఆసక్తితో స్పానిష్‌లో ఎంఏ చేశాను. అయితే, ఇప్పుడది నాకు ప్రొఫెషన్‌గా ఉపకరిస్తోంది’ అని చెప్పారు సీతాఫల్మండిలో నివసించే సుమతి. ప్రస్తుతం ఆమె స్పానిష్ టీచర్. సౌత్ అమెరికా, మెక్సికోలో బాగా వినియోగించే స్పానిష్ ప్రపంచంలోనే అత్యధికులు ఉపయోగించే భాషల్లో 3వ స్థానంలో ఉంటుందంటున్నారు సుమతి. జర్మన్‌తో షైన్.. పంచంలో 1.8 శాతం మంది మాత్రమే జర్మన్ మాట్లాడతారు. అయితే మనం జర్మన్ దేశస్తులతో సంభాషించాలంటే తప్పనిసరిగా జర్మన్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే జర్మన్లు ఇతర దేశ భాషలను నేర్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరట. మరోవైపు జర్మనీ.. క్వాలిటీ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌కు హబ్. అందుకనే చాలా మంది మనవాళ్లు అక్కడ చదువుకోవాలని ఆశిస్తారు. జర్మన్ యూనివర్సిటీస్లో చేరాలంటే.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి కనీస స్థాయిలోనైనా జర్మన్ భాష వచ్చి తీరాలి. పెపైచ్చు భారతీయ విద్యార్థులకు జర్మనీ ఉచిత కోర్సులు కూడా ఆఫర్ చేస్తోంది. ‘ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లేవారు పెరిగారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. అయితే, అలా చదవాలని కోరుకునే విద్యార్థులకు తప్పనిసరిగా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి తీరాల్సిందే’ అని చెప్పారు దీప్తి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ఆమె తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషలు వచ్చని చెబుతోంది ఈ మలక్‌పేట నివాసి. జపనీస్‌కు జేజేలు.. ష్టమైన భాషగా జపనీస్‌ను పేర్కొంటారు. అయినా ప్రస్తుతం దేశంలో 20వేల మందికిపైగా జపనీస్ భాష నేర్చుకుంటున్నారని అంచనా. జపనీస్ వెంచర్లు భారీగా దేశానికి తరలివస్తున్న నేపధ్యంలో జపాన్ భాష తెలిసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పార్ట్‌టైమ్ జపనీస్ లాంగ్వేజ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ‘కెరీర్ ప్లాన్ అని కాకుండా వ్యక్తిగత ఇష్టంతో 1998లోనే సీఫెల్ నుంచి జపనీస్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడం నాకు జపాన్‌కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన పెంచింది’ అన్నారు చక్రపాణి. అప్పట్లో జపాన్ ప్రభుత్వం ఖర్చులు భరించి మరీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన ముగ్గురు భారతీయుల్లో నగరానికి చెందిన చక్రపాణి కూడా ఒకరు. తదనంతర కాలంలో ఆయన జపాన్ లాంగ్వేజ్ టీచర్, బైలింగ్వల్ కన్సల్టెంట్‌గా చేశారు. చైనీస్.. చాలా టఫ్.. పంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి.. సహజంగానే చైనీస్ మాట్లాడేవారు కూడా ఎక్కువే. ఎవరైనా సరే తమ దగ్గరకే వచ్చేలా ప్రపంచ దేశాలను ప్రొడక్ట్స్ పరంగా ప్రభావితం చేస్తున్న చైనాకు సిటీ నుంచి రాకపోకలు పెర గడం కూడా సహజమే. ఈ నేపధ్యంలో చైనీస్ లాంగ్వేజ్ పట్ల కూడా నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, మిగిలిన భాషలతో పోలిస్తే ఇది నేర్చుకోవడం కాస్తంత కష్టమే అంటున్నారు భాషాభిమానులు. ‘నాకు విదేశీ భాషలు నేర్చుకోవడం ఇష్టం. ఆల్రెడీ జర్మన్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇఫ్లూలో 8 నెలలు పాటు ఈవెనింగ్ టైమ్‌లో చైనీస్ బేసిక్ కోర్సు చేశాను. ఈ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్ కోర్సు చేస్తే చాలు జనరల్ కన్వర్జేషన్కి సరిపోతుంది. ైచె నా మూవీస్ కూడా చూడవచ్చు. డిప్లొమా ఇన్ చైనీస్ కూడా చేద్దామనుకుంటున్నాను. సిటీలో చైనీస్ ట్రాన్స్లేటర్స్కి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ లాంగ్వేజ్ గురించి అవేర్నెస్, నేర్చుకునే వాళ్లు, నేర్పేవాళ్లూ తక్కువే’ అంటూ చెప్పారు శరత్. బీఫార్మసీ చేసి ఓయూ హాస్టల్లో ఉంటున్న ఆయన.. పార్ట్‌టైమ్‌గా జర్మన్ లాంగ్వేజ్ టీచర్‌గానూ చేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే.. జూబ్లీహిల్స్‌లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాండరిన్ (సరళతరమైన చైనీస్)ను విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ విద్యార్థులు ఈ లాంగ్వేజ్‌ను ఎంచుకున్నారు కూడా. పిల్లలకు విదేశీ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సిటీలోని కొన్ని స్కూల్స్ ఆఫ్టర్ స్కూల్ అకాడమీ నిర్వహించే యోచనలో ఉన్నాయి. -
డ్యాన్స్ స్పాట్
ఇది కార్పొరేట్ ప్రపంచం. చదువు, కొలువే కాదు.. డ్యాన్స్, ఇతర ఆటపాటల్లో ఎంతో కొంత ప్రావీణ్యం ఉంటే గానీ నలుగురిలో గుర్తింపు, మనసుకు ఉల్లాసం ఉండవు. పైగా విద్యా సంస్థలు, హైటెక్ కంపెనీల్లో ఇప్పుడిలాంటి యాక్టివిటీస్ సర్వసాధారణం అయ్యాయి. అందుకే సదరు సంస్థలు డ్యాన్స్ వంటి వర్క్‌షాపులు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీ కూడా తమ విద్యార్థుల కోసం ఇలాంటి వర్క్షాపే నిర్వహిస్తోంది. యష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 14 రోజులు జరిగే ఈ శిక్షణా శిబిరంలో హిప్హాప్, సల్సా తదితర నృత్యరీతులు నేర్పిస్తున్నారు. విద్యార్థులూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సాక్షి, సిటీ ప్లస్ -
నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను!
వేదిక మా అమ్మ పల్లెటూరిలో పుట్టి పెరిగింది. వాళ్ల ఊళ్లో ఉన్న బడిలో పదో తరగతి వరకూ చదివింది. కానీ పీజీ చదివినవాళ్లకి ఉన్నంత జ్ఞానం ఉంటుంది తనకి. పత్రికలు, నవలలు చదివి జీవితాన్ని, ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. అందుకే పెళ్లయిన నాలుగేళ్లకే నాన్న చనిపోయినా... ఒంటరిగా బతికేందుకు సిద్ధపడింది. రెండేళ్ల పిల్లనైన నన్ను పెంచి పెద్ద చేయడం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంది.అమ్మ కష్టాలను చూసిన నేను బాగా సంపాదించాలని, అమ్మని సుఖపెట్టాలని అప్పటినుంచే కలలు కనేదాన్ని. పట్టుదలతో చదివాను. ర్యాంకులు సాధించాను. ముప్ఫైవేల జీతంతో మొదలుపెట్టి, రెండేళ్లలో యాభై వేలకు చేరువయ్యాను. కానీ లక్ష్యాలకు చేరువయ్యే క్రమంలో... నన్ను పెంచడమే లక్ష్యంగా బతికిన మా అమ్మకి దూరమయిపోయాను. పనిలో చేరాక అమ్మతో గడపడానికి సమయమే ఉండేది కాదు. పని చేసుకునేటప్పుడు కనీసం పక్కవాళ్లతో టైమ్ పాసయ్యేది తనకి. కానీ నేను సంపాదిస్తున్నాను కదా అని పని మాన్పించేసి ఇంట్లో కూచోబెట్టాను. నా కోసం తను ఎదురు చూస్తుంటే ఏ అర్ధరాత్రికో వెళ్లి పక్కమీద వాలిపోయేదాన్ని. ఏవేవో వంటకాలు చేసి నాకు తినిపించాలని తను అనుకుంటే, క్యాంటీన్లో తినేసి వెళ్లి కడుపు నిండుగా ఉందనేదాన్ని. ఆదివారమైనా తనతో గడపమంటే కాన్ఫరెన్సులు అనేదాన్ని. పండగ పూటయినా తనకోసం కాస్త సమయం కేటాయించమంటే... కార్పొరేట్ ప్రపంచంలో పండుగల కోసం టైమెక్కడివ్వగలం అనేదాన్ని. ఓరోజు ఆఫీసులో ఉండగా పక్కింటావిడ ఫోన్... అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని, ఆసుపత్రిలో చేర్పించారని. పరుగు పరుగున వెళ్లాను. అప్పటికే ఆలస్యమైంది. నా ప్రపంచం చీకటైపోయింది. అమ్మ వెళ్లిపోయింది. నాకున్న ఒకే ఒక్క తోడు నన్ను వీడిపోయింది. అమ్మ సామాన్లు సర్దుతున్నప్పుడు అమ్మ డైరీ దొరికింది. అందులో ఒకచోట అమ్మ రాసుకుంది... ‘‘నువ్వు అందనంత ఎత్తు ఎదగాలనుకున్నానురా... కానీ నాకే అందకుండా ఉండిపోవాలని కోరుకోలేదు. నాతో కాస్తంత సమయం గడిపే తీరిక కూడా నీకు లేదు. మీ నాన్న పోయినప్పుడు నువ్వున్నావని ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నువ్వున్నా ఒంటరిగా ఫీలవుతున్నాను.’’ అప్పుడు నాకు అర్థమైంది... జ్వరం కూడా రాని అమ్మకి హార్ట్ అటాక్ ఎందుకొచ్చిందో, మొదటి స్ట్రోక్కే ప్రాణాలు ఎందుకు కోల్పోయిందో. ఇంత చేసినా తను నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. కానీ నన్ను మాత్రం నేను క్షమించుకోలేను. ఎప్పటికీ క్షమించుకోలేను. - సుచిత్ర, చెన్నై