breaking news
committee formed
-
శాసనసభ ఎన్నికల వేళ గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
అహ్మదాబాద్: గుజరాత్ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యునిఫామ్ సివిల్ కోడ్ -యూసీసీ)ని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యూసీసీ ప్యానల్లో సభ్యుల వివరాలను గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి వెల్లడించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. కేబినెట్ సమావేశం అనంతరం ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ‘కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుంది’ అని భూపేంద్ర పటేల్ తెలిపారు. గత మే నెలలో యూసీసీని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాజపా ఈ హామీని ప్రకటించింది. అన్నట్లుగానే పుష్కర్ సింగ్ ధామీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే యూసీసీని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. అదే నెలలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సైతం యూసీసీ అమలు చేస్తామని వెల్లడించారు. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ సైతం ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: 7 నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ -
వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా పంపిణీలో సమన్వయం, పర్యవేక్షణకు వెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇతర సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవడంతోపాటు, సామాజిక మా«ధ్యమాల్లో టీకా సామాజిక ఆమోదంపై ప్రతికూల ప్రభావం చూపే పుకార్లను ముందుగానే కనిపెట్టి, అడ్డుకునేందుకు ఈ కమిటీలు సాయపడతాయని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలతో ప్రారంభమై, పలు గ్రూపుల వారికి దశలవారీగా సాగే టీకా పంపిణీ ఏడాది పొడవునా సాగే అవకాశం ఉందని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలు, స్థానిక అవసరాలు, వివిధ భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా నిల్వ సదుపాయాలు, కార్యాచరణ వ్యూహాలను సమీక్షిం చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కొత్త కేసులు 50 వేల లోపే.. గత 24 గంటల్లో 48,648 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 563 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,21,090కు చేరుకుంది. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 73,73,375కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,94,386 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 7.35 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 91 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. -
రేప్ కేసుల విచారణ తీరుపై ‘సుప్రీం’ కమిటీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోర్టుల్లో అత్యాచార ఘటనల కేసుల విచారణ ఎంత సత్వరంగా జరుగుతోందో పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నియమించారని సోమవారం సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న లైంగికదాడులు, సంచలనం రేపిన ‘దిశ’ కేసులో నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. -
జమిలి ఎన్నికలపై కమిటీ
న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం నాడిక్కడ ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వామ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు. అయితే 21 పార్టీలు మాత్రమే బుధవారం నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాయి. అఖిలపక్ష నేతలతో సమావేశానంతరం రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదని, ఇది జాతి ఎజెండాగా ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారన్నారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారన్నారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయని చెప్పారు. ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదని తెలిపారు. పార్లమెంటు ఉత్పాదకత పెంచాలనే అంశంలో పార్టీలన్నీ ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయన్నారు. చర్చకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా సభలో సుహృద్భావ వాతావరణం ఉండాలని అఖిల పక్షానికి హాజరైన నేతలు అభిప్రాయపడినట్లు తెలిపారు. కాగా కమిటీ కూర్పుపై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని రాజ్‌నాథ్ చెప్పారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు. హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్ ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’తో పాటు దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అయ్యే సందర్భంగా 2022లో ఉత్సవాలు నిర్వహించడం, అలాగే ఈ ఏడాది మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలు నిర్వహించడం తదితర అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి ఎన్డీయే మిత్రపక్షం శివసేనతో పాటు పలు విపక్ష పార్టీలు హాజరుకాలేదు. గైర్హాజరైన ప్రముఖుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డీఎంకే నేత ఎంకే స్టాలిన్, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ , బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉన్నారు. హాజరైన వారిలో ఎన్సీపీ నేత శరద్‌పవార్, సీతారాం ఏచూరి (సీపీఎం), సురవరం సుధాకర్‌రెడ్డి (సీపీఐ), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ నేత నవీన్ పట్నాయక్, సుఖ్బీర్ సింగ్ బాదల్ (శిరోమణి అకాలీదళ్), కోనార్డ్ సంగ్మా (నేషనల్ పీపుల్స్ పార్టీ) ఉన్నారు. పార్లమెంటు హౌస్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ భేటీలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరయ్యారు. మోదీ, రాజ్‌నాథ్‌లతో పాటు ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, బీజేపీ కొత్త కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధం: ఏచూరి అయితే జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి, సమాఖ్యవాదానికి విరుద్ధమని, ఆ విధంగా అవి రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దొడ్డిదారిన తొలగించడమేనని ఏచూరి పేర్కొన్నారు. అంతకుముందు సమావేశంలో జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం చేస్తున్న కృత్రిమ ప్రయత్నాన్ని సీపీఎం ఎందుకు వ్యతిరేకిస్తోందీ తెలియజేసే ఒక పత్రాన్ని పార్టీల ప్రతినిధులకు అందజేశారు. శాసనవ్యవస్థకు ప్రభుత్వాన్ని జవాబుదారీని చేసే రాజ్యాంగ ప్రక్రియను ఇది తారుమారు చేస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ తిరోగమనం, డేటా విశ్వసనీయత తదితర అంశాలను కూడా ఆ పత్రంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలికిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్.. రాజ్యాంగ ప్రవేశికలో శాంతి, అహింస అనే పదాలను చేర్చాలని డిమాండ్ చేశారు. ఇది ప్రస్తుత ప్రాధాన్య అంశం కాదు: మాయావతి భారత్ వంటి అతిపెద్ద దేశానికి జమిలి ఎన్నికలనేవి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధ ఆలోచనగా కనబడుతోందని మాయావతి పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం దేశం ముందున్న అంశం కాదని విమర్శించారు. ఈవీఎంలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉంటే హాజరయ్యేదాన్నంటూ అంతకుముందు ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఇతర పార్టీలతో సంప్రదింపుల అనంతరం అఖిలపక్షానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తాను హాజరు కాబోనని మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అఖిల పక్షానికి బదులుగా దీనిపై చర్చలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. ప్రజా ధనాన్ని పొదుపు చేసేందుకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని గత ఏడాది ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. అయితే ప్రస్తుత రాజ్యాంగ నిబంధనల ప్రకారమైతే ఇది సాధ్యం కాదని న్యాయశాఖకు సమర్పించిన ముసాయిదాలో హెచ్చరించింది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని కనీసం రెండు నిబంధనలను సవరించడంతో పాటు, మెజారిటీ రాష్ట్రాలు కనుక ఆమోదించిన పక్షంలో జమిలి ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించవచ్చని లా కమిషన్ తన సిఫారసుల్లో పేర్కొంది. లా కమిషన్ సిఫారసులతో మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎస్ కృష్ణమూర్తి ఏకీభవించారు. జమిలి ఎన్నికలు సాధ్యమేనని చెప్పారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని, కానీ అవిశ్వాస తీర్మానం, దానితో ముడిపడిన అంశాలకు సంబంధించిన రాజ్యాంగ నిబంధన దీని అమలుకు పెద్ద అవరోధమని తెలిపారు. దీనికి పరిష్కారమార్గం రాజ్యాంగ సవరణ ఒక్కటేనని పేర్కొన్నారు. అలాగే ఈ విధంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల విధులకు అవసరమైన పారా మిలటరీ బలగాల సంఖ్యను పెంచడం సహా చాలా పాలనాపరమైన ఏర్పాట్లు అవసరమని చెప్పారు. భిన్నాభిప్రాయాలు స్వాగతిస్తాం : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ జమిలి ఎన్నికలనేవి ప్రభుత్వ ఎజెండా కాదు.. ఇది జాతి ఎజెండా అని ప్రధాని ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాన్ని అయినా స్వాగతిస్తామని మోదీ చెప్పారు. లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు చాలా పార్టీలు మద్దతు పలికాయి. ఉమ్మడి ఎన్నికల కసరత్తు ఎలా జరుగుతుందనే దానిపై సీపీఐ, సీపీఎం వంటి పార్టీలకు భిన్నాభిప్రాయం ఉన్నా, ఈ ఆలోచనను వారు నేరుగా వ్యతిరేకించలేదు. బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో ఒడిశా, బిహార్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్, కేంద్ర మంత్రులు నడ్డా, రాజ్‌నాథ్, అమిత్ షా, గడ్కరీ తదితరులు -
బీజేపీ మేనిఫెస్టో కమిటీ సారథిగా రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం 17 సంస్థాగత కమిటీలను ఏర్పాటుచేశారు. కీలకమైన సంకల్ప్‌పత్ర (మేనిఫెస్టో) కమిటీకి సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సారథిగా నియమించారు. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, థావర్‌చంద్ గెహ్లాట్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేజే అల్ఫోన్స్, కిరణ్ రిజిజు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సహా మొత్తం 20 మందికి చోటు కల్పించారు. అలాగే, మరో సీనియర్ నేత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రచార కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు. ఎనిమిది మంది సభ్యులుండే ఈ కమిటీలో మంత్రులు పీయూష్ గోయల్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, అనిల్ జైన్, మహేశ్ శర్మ తదితరులున్నారు. సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు చేరవయ్యేందుకు నియమించిన కమిటీకి నితిన్ గడ్కరీ, మీడియా కమిటీకి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వం వహించనున్నారు. అలాగే మేధావులతో సమావేశాలు నిర్వహించే కమిటీకి ప్రకాశ్ జవడేకర్ నాయకత్వం వహిస్తారు. ఎన్నికల ప్రచార సాహిత్య రూపకల్పన కమిటీకి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహించనున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే నాయకత్వంలోని కమిటీకి అప్పగించారు. ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, ఐటీ విభాగం ఇన్చార్జి అమిత్ మాలవీయ సహా 13 మందితో సోషల్ మీడియా కమిటీ ఏర్పాటుచేశారు. ప్రసాద్ నేతృత్వంలోని మీడియా కమిటీలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధులందరికీ చోటు కల్పించారు. పార్టీ కార్యాలయ పనులు, రవాణా, సాహిత్య పంపిణీ, మోదీ మన్‌కీ బాత్, బైకు ర్యాలీల నిర్వహణకు కూడా కమిటీలు ప్రకటించారు. -
టీపీఎస్సీ సిలబస్ రూపకల్పనకు కమిటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన ఈ కమిటీలో 25 మంది నిపుణలను నియమించారు. సభ్యులుగా నాగేశ్వర్, చుక్కా రామయ్య, కోదండరాం, రమామెల్కోటె, నందిని సిద్ధారెడ్డి తదితరులున్నారు. పోటీ పరీక్షల కోసం ఈ కమిటీ సిలబస్‌ను రూపొందించనుంది.