breaking news
Commerce and Industry Department Minister
-
ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్
ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేస్తుంది. -
ఆంధ్రప్రదేశ్‌కి ఆ ప్రతిపాదన లేదు : కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ : కర్నూలులో కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ ఏర్పాటు ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సీఆర్ చౌదరీ బుధవారం తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ (సీఈజెడ్) ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. సీఈజెడ్ ఏర్పాటులో కేంద్రం చేపట్టిన చర్యలేమిటో తెలపాలని సంబంధిత మంత్రిని ఆయన కోరగా..ప్రస్తుతానికి సీఈజడ్ ఏర్పాటు ప్రతిపాదనేదీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ టవర్‌కూ మొండిచేయే..! రాష్ట్రంలో ఎగుమతుల ప్రోత్సాహానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా విశాఖ జిల్లా దువ్వాడలోని స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)లో ఐటీ టవర్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని సీఆర్ చౌదరీ వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని మాత్రం వెల్లడించలేదు. ఏ మేరకు నిధుల కేటాయింపులు జరిగాయన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేశారు. -
ఆన్లైన్ కంపెనీలపై కేంద్రం కన్ను
- ఫ్లిప్‌కార్ట్‌పై ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం... - వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి... న్యూఢిల్లీ: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ సేల్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ట్రేడర్ల ఫిర్యాదులు, ఆందోళనలను పరిశీలిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ-కామర్స్ రిటైల్ బిజినెస్ వ్యవహారాల్లో స్పష్టతకు సంబంధించి చర్యలపై దృష్టిపెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ సోమవారం పలు ఉత్పత్తులను కారుచౌకగా ఆఫర్ చేయడం తెలిసిందే. ఈ మెగా ఆఫర్ ద్వారా 10 గంటల్లోనే రూ.600 కోట్లకుపైగా అమ్మకాలు సాధించామని ఫ్లిప్‌కార్ట్ చెప్పుకుంది. అయితే, వెబ్సైట్ క్రాష్ కావడం, ఆఫర్ మొదలైన కొద్ది వ్యవధికే స్టాక్ లేదంటూ చెప్పడం, డిస్కౌంట్ పేరుతో అధిక ధరలకు విక్రయించిందంటూ సోషల్ మీడియాలో కస్టమర్లు దుమ్మెత్తిపోశారు. దీంతో ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం క్షమాపణ కూడా చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని వేడుకుంది. మరోపక్క, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ సేల్‌పై చిన్నాపెద్దా రిటైల్ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భారీ డిస్కౌంట్ల కారణంగా సాంప్రదాయ రిటైల్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింటుందంటూ ధ్వజమెత్తారు. ‘ఫ్లిప్‌కార్ట్ విషయంలో మాకు చాలా ఫిర్యాదులు అందాయి. చాలామంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మేం తప్పకుండా దృష్టిపెడతాం. ఈ-కామర్స్ రిటైలింగ్‌కు ప్రత్యేక పాలసీ అవసరమా లేదంటే మరింత స్పష్టత ఇస్తే సరిపోతుందా అనేది అధ్యయనం చేస్తాం. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని నిర్మల వివరించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ రిటైలర్లు ఎడాపెడా ఆఫర్లను ప్రకటిస్తుండటంపై అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య(సీఏఐటీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. అసలు ఇంత భారీగా డిస్కౌంట్లను ఎలా ఇస్తున్నారో దర్యాప్తు చేయాలని.. ఈ-కామర్స్ రంగానికి ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. కాగా, కొత్త విదేశీ వాణిజ్య విధానం(ఎఫ్టీపీ) త్వరలోనే ప్రకటిస్తామని.. గత పాలసీలకు చాలా భిన్నంగా ఉంటుందని నిర్మల తెలిపారు. సీఎస్ఆర్ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయ్... కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద కంపెనీల నిధుల వ్యయానికి సంబంధించి కొత్త కంపెనీల చట్టంలో స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో ఎలాంటి గందరగోళానికి తావులేదన్నారు. బుధవారమిక్కడ ఇండియన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నెట్వర్క్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సీఎస్ఆర్ నిబంధనల ప్రకారం.. కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో కనీసం 2 శాతాన్ని సామాజిక కార్యకలాపాలకు వెచ్చించాల్సి ఉంటుంది. నోకియా ప్లాంట్ మూసివేతపై కూడా... చెన్నైలో మొబైల్స్ తయారీ ప్లాంట్ కార్యకాలపాలను వచ్చే నెల 1 నుంచి నిలిపివేయనున్నట్లు నోకియా కార్పొరేషన్ ప్రకటించడంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. దీన్ని పరిష్కరించడంపై దృష్టిపెడతామన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. నోకియా మొబైల్ హ్యాండ్సెట్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, పన్ను సంబంధ కేసుల కారణంగా చెన్నైలోని నోకియా ప్లాంట్ మాత్రం ఈ డీల్‌లో లేకుండా పోయింది. ఈ ప్లాంట్ నుంచి మొబైల్స్ కొనుగోళ్ల ఒప్పందాన్ని మైక్రోసాఫ్ట్ రద్దు చేసుకోవడంతో.. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు నోకియా ప్రకటించింది. దీంతో ఇంకా ఇక్కడ పనిచేస్తున్న సుమారు 900 మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా, నోకియా చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీ లిస్తున్నామని నోకియా ఇండియా ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎంఎల్ఏ ఎ. సౌందరరాజన్ పేర్కొన్నారు. అనేక ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను గాలికొదిలేసి.. కంపెనీ అన్యాయం గా వ్యవహరిస్తోందన్నారు. అయితే, ఇప్పుడున్న మిగతా ఉద్యోగులపై ప్రభావం పడకుండా ఆప్షన్లను వెతుకుతున్నామని.. నిర్ణయం ఖరారైన వెంటనే తెలియజేస్తామని నోకియా పేర్కొంది.