ceiling collapses
-
తిరుపతి: హోటల్లో కుప్పకూలిన పైకప్పు
సాక్షి, తిరుపతి: నగరంలోని బస్టాండ్ సమీపంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పైకప్పు కూలింది. రూమ్ నంబర్ 314లో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది. దీంతో ఆ హోటల్లో ఉన్న భక్తులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు గాయపడ్డారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హోటల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూలిన సినిమా హాల్ పై కప్పు: 76 మందికి గాయాలు
లండన్‌లోని అపోలో థియటర్లోని పై కప్పు (సీలింగ్) ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ ఘటనలో 76 మంది మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. గత రాత్రి ఘటన చోటు కున్నప్పుడు థియటర్ ప్రేక్షకులతో నిండి ఉందని, ఈ నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య పెరిగిందని వివరించారు. థియటర్పై భాగం చిన్న శబ్దంతో ఒక్కసారిగా మీదపడిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని చెప్పారు. అయితే ఆ సీలింగ్ కుప్పకూలిన ఘటనతో షాక్ గురైనట్లు అపోలో థియటర్ యాజమాన్యం వెల్లడించింది. ఆ ఘటనకు కారణాలను ఆన్వేషించేందుకు చర్యలు చేపట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.