శాసనమండలి నుంచి కాంగ్రెస్ వాకౌట్
హైదరాబాద్: రాజధాని ఎంపిక విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్ర విభజన వ్యవహారం, రాజధాని ఎంపికలో చంద్రబాబు తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు.
రాజధాని ఎంపిక తీర్మానంలో కాంగ్రెస్ను నిందించడం సరికాదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య సూచించారు. విభజన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమిచేశారో తెలుసని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.