breaking news
Broken Heart Syndrome Heart Happy Heart Syndrome
-
హృదయం అద్దమనీ.. పగిలితే అతకదనీ..
ఇష్టమైన వ్యక్తి చనిపోతే చూసి తట్టుకోలేక గుండె పట్టుకొని కూలిపోవడం వంటి దృశ్యాలు సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో జరిగేవే అంటున్నారు వైద్య నిపుణులు. నిజ జీవితంలోనూ ప్రియమైన వ్యక్తుల అకాల మరణం, అనారోగ్యం పాలైన విషయం తెలుసుకున్న సందర్భాల్లో తీవ్ర ఒత్తిడి, దుఃఖం, ఆవేదన వెంటాడతాయని, ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారని వారంటున్నారు. ఇంతకీ బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటి? దాని పరిణామాలు మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? - సాక్షి, అమరావతిటకోట్సుబో కార్డియో మయోపతి.. బ్రోకెన్ హార్ట్ ను వైద్య పరిభాషలో టకోట్సుబో కార్డియో మయోపతిగా పేర్కొంటారు. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికం. అయితే మరణాల విషయంలో మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే రెట్టింపు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఓ జర్నల్ను ప్రచురించింది. 1.99 లక్షల మంది రోగులపై అధ్యయనం 2016–2020 మధ్యలో అమెరికాలో 1,99,890 బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ మరణాలు సంభవించాయి. వీటిపై పరిశోధకులు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ క్రమంలో పురుషుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మరణాల రేటు 6.5 శాతంగా నమోదుకాగా, పురుషుల్లో 11.2, మహిళల్లో 5.5 శాతం మరణాలు సంభవించాయని అధ్యయనంలో వెల్లడించారు. ఆ వయస్కులవారికే అధికం సాధారణంగా బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ప్రభావం 61 ఏళ్లు పైబడినవారిపైనే అధికం. 31–45 సంవత్సరాల వయసు గల వారితో పోలిస్తే 46–60 సంవత్సరాల వారిలో సమస్య 2.6 నుంచి 3.25 రెట్లు ఎక్కువ. టకోట్సుబో కార్డియో మయోపతి అనేది ప్రతికూల భావోద్వేగం, తీవ్రఒత్తిడితో కూడిన గుండె జబ్బు అని పరిశోధకులు వెల్లడించారు. సమస్య తలెత్తితే.. బ్రోకెన్ హార్ట్ కారణంగా..గుండెలో కొంత భాగం తాత్కాలికంగా పెద్దదిగా మారుతుంది. రక్త ప్రసరణ నిలిచిపోతుంది. గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి.భావోద్వేగ మద్దతు అవసరం కావాల్సినవాళ్లు, అత్యంత ఆప్తులు దూరమైన సందర్భాల్లో కొందరు తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో కొన్ని సార్లు గుండెపోటు సంభవిస్తుంది. ఇలాంటివారికి భావోద్వేగపరమైన మద్దతు అందించాలి. ఒత్తిడి నుంచి బయటపడేలా సహకారం అందించాలి. – డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణుడు, జీజీహెచ్, కర్నూలు -
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా తెలుసా?
తీవ్రమైన ఒత్తిడికీ, భావోద్వేగాలకు గురైనప్పుడు సినిమాల్లోని కొన్ని పాత్రలు అమాంతం గుండెపట్టుకు కూలబడిపోవడం చూశాం. ఒక్కోసారి తట్టుకోలేమనుకునే ఓ అనారోగ్యం లేదా శస్త్రచికిత్సలతోనూ ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఆ పరిస్థితిని నిభాయించుకోలేక ఒక్కోసారి గుండెపోటు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా గుండె పంపింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. గుండెలోని కొంతభాగం పనిచేయకుండా మొరాయించవచ్చు. మిగతా భాగమంతా మామూలుగానే పనిచేయవచ్చు. కానీ గుండె సంకోచించే కార్యక్రమం కొంత బలంగా జరగాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితినే ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ అనవచ్చు. ఈ కండిషన్‌నే ‘స్ట్రెస్ కార్డియోమయోపతి’ అనీ, ‘టాకోట్సుబో కార్డియోమయోపతి’ అనీ లేదా ‘ఎపికల్ బలూనింగ్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. ఈ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. ఇందుకు సాధారణంగా కొన్ని రోజులు మొదలుకొని వారాల సమయం పట్టవచ్చు. లక్షణాలు: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లక్షణాలన్నీ గుండెపోటులాగే ఉంటాయి. ఛాతీలో నొప్పి వస్తుంది. ఊపిరి అందదు. కారణాలు: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు కారణాలేమిటో ఇప్పటికీ ఇదమిత్థంగా తెలియదు. అయితే తీవ్రమైన ఒత్తిడి వల్ల ఒక్కసారిగా పెరిగే ‘అడ్రినాలిన్’ వంటి ‘స్ట్రెస్ హార్మోన్లు’ దీన్ని ప్రేరేపిస్తుందని నిపుణుల అభిప్రాయం. దాంతో కొందరిలో గుండెలో కొంత భాగం... మరీ ముఖ్యంగా గుండె కండరం కొంతమేర దెబ్బతినే ప్రమాదం ఉంది. దాంతో గుండె కండరం నిర్మాణం/ఆకృతిలో కొన్ని మార్పులు రావచ్చు. గుండెకు రక్తం అందించే రక్తనాళాలు (ధమనులు) సన్నబడవచ్చు. అయితే ఈ హార్మోన్లు గుండెనెలా దెబ్బతీస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా విపరీతమైన శారీరక శ్రమ లేదా మానసిక బాధ/ఉద్వేగం తర్వాత ఇది కనిపిస్తున్నట్లుగా నిపుణులు గుర్తించారు. ఉదాహరణకు ఏదైనా ఆరోగ్య సమస్య తర్వాత అంటే... ఆస్తమా అటాక్, కోవిడ్ ఇన్ఫెక్షన్, ప్రమాదంతో కాలూ చేయి విరగడం లేదా ఏదైనా మేజర్ సర్జరీ వంటి సమస్యల తర్వాత ఇది కనిపించవచ్చు. దగ్గరివారితో వాగ్వాదాలూ లేదా కుటుంబ సభ్యుల్లో అత్యంత ఆత్మీయులో, బాగా దగ్గరివారో చనిపోయినప్పుడు కూడా ఇది రావచ్చు. అయితే కాస్తంత అరుదుగానే అయినా... కొన్ని మందులు కూడా ఈ సమస్యను తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు... ► తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ లేదా ఆస్తమాను అదుపు చేసేందుకు వాడే మందులు ► తీవ్రమైన ఉద్విగ్నత (యాంగై్జటీ) పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వాడేవి, ముక్కులు బిగదీసుకుపోయినప్పుడు రిలీఫ్ కోసం వాడేవి ► కొకెయిన్ వంటి మాదకద్రవ్యాలు వాడినప్పడు కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితి వస్తే... బాధితులు ఏవైనా మందులు వాడుతున్నారా అనే విషయాన్ని డాక్టర్‌కు స్పష్టంగా చెప్పాలి. ఏవైనా కొత్తమందులు వాడాక ఇలాంటి పరిస్థితి ఎదురైతే... ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలి. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా ఏమిటంటే... గుండెకు రక్తం అందించే రక్తనాళాలన్నీ (ధమనులన్నీ) పూడుకుపోవడం లేదా దాదాపుగా పూర్తిగా పూడుకుపోవడం జరిగినప్పుడు సాధారణంగా గుండెపోటు వస్తుంది. కానీ ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’లో అలాంటి పరిస్థితి ఉండదు. ధమనుల్లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ గుండెపోటు లాంటి పరిస్థితి ఎదురవుతుంది. రిస్క్ ఫ్యాక్టర్లు : బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ముప్పును పెంచే అంశాలివి... జెండర్: పురుషులతో పోలిస్తే ఇది మహిళల్లో ఎక్కువ. వయసు : యాభై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య చరిత్ర : గతంలో యాంగై్జటీ లేదా డిప్రెషన్ (కుంగుబాటు) వంటి ఏదైనా మానసిక సమస్యకు లోనై ఉండటం. దుష్ప్రభావాలు : ► కొన్ని ద్రవాలు (ఫ్లూయిడ్స్) వెనక్కు ప్రవహిస్తూ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం. (పల్మునరీ ఎడిమా) ► అకస్మాత్తుగా రక్తపోటు తగ్గడం (హైపోటెన్షన్) ►గుండె లయ తప్పడం (అరిథ్మియాస్) ►గుండె వైఫల్యం ►గుండె కండరాలు బలహీనం కావడంతో లోపల రక్తపు గడ్డలు ఏర్పడటం. ► దీని వల్ల మరణం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా చాలా అరుదు. నివారణ : తీవ్రమైన ఉద్వేగాలకు / మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా జాగ్రత్తపడటం ప్రధానం. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న బాధితుల్లో డాక్టర్లు దీర్ఘకాలిక చికిత్సను అందజేస్తారు. బీటా బ్లాకర్స్ లేదా అలాంటివే మందులు వాడుతూ ఈ పరిస్థితిని నివారిస్తారు. -
మితిమీరిన సంతోషమూ హానికరమే!
పరి పరిశోధన ఏదైనా ఘోరమైన వార్త విన్నప్పుడు సినిమాల్లో కొన్ని పాత్రలు గుండెపట్టుకొని కుప్పకూలిపోతాయి. షాకింగ్ వార్త ఏదైనా విన్నప్పుడు ఇలా గుండె బద్దలయ్యే సన్నివేశాలు మనం సాధారణంగా చూసే సన్నివేశాలే. ఇలా జరగడాన్ని ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ అంటారు. వైద్యపరిభాషలో దీన్నే ‘టకోట్సుబో సిండ్రోమ్’ అని లేదా స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి అంటారు. తీవ్రమైన ఉద్వేగాన్ని కలిగించే ఏదైనా వార్త విన్నప్పుడు గుండె కండరం తాత్కాలికంగా బలహీనమవుతుంది. దాంతో గుండె ఎడమ వెంట్రికిల్ బెలూన్లాగా ఉబ్బుతుంది. అలాంటప్పుడు గుండె సరిగా పనిచేయకపోవడం కూడా జరగవచ్చు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. టకోట్సుబో సిండ్రోమ్ అనేది జాపనీస్ పదం. అయితే ఇప్పటివరకూ భరించలేనంత విచారం కలిగించే సందర్భాలు, తీవ్రమైన దుఃఖం కలిగించే పరిస్థితుల్లోనే ఇలా గుండెబద్దలైపోయే అపాయకరమైన పరిణామాలు సంభవించవట. అమితంగా సంతోషం కలిగించే అంశాలు కూడా అచ్చం ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ లాంటి పరిస్థితినే కల్పిస్తాయని స్విస్ అధ్యయనం పేర్కొంటోంది. మరీ ఎక్కువగా సంతోషం కూడా అంత మంచిది కాదని సూచిస్తోంది. ఇలా అపరిమితమైన సంతోషంతో గుండె కండరం బలహీనం అయ్యే కండిషన్‌కు సరిగ్గా ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’కు వ్యతిరేకమైన పేరు పెట్టారు అధ్యయనవేత్తలు. ఈ కండిషన్ పేరు ‘హ్యాపీ హార్ట్ సిండ్రోమ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు మంది నుంచి గుండె స్పందనల తీరు తెన్నులపై వివరాలు సేకరించారు. ఆ సేకరించిన అంశాలతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. గుండెబద్దలైపోయి చనిపోయిన వారి వివరాలు తెలుసుకుంటున్నప్పుడు వారికి ఒక విచిత్రమైన విషయమూ తెలిసింది. అదేమిటంటే... అత్యంత ప్రియమైన వారి చావుకబురు విన్నప్పుడు లేదా అలాంటి వారి అంతిమయాత్రలో పాల్గొని వచ్చాక లేదా తమకు ప్రియమైన వారికి ఏదో కోలుకోలేనంతగా జబ్బు సోకిందని తెలిశాక 96 శాతం మందిలో గుండె బద్దలైపోయిందని తేలింది. అయితే దీనికి వ్యతిరేకంగా నాలుగు శాతం మందిలో మాత్రం పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు కూడా ‘హ్యాపీ హార్ట్ సిండ్రోమ్’కు గురైన సందర్భాలూ ఉన్నాయి. స్విస్ అధ్యయనంలో తేలిన ఈ అంశాన్ని ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’లో పొందుపరిచారు. తమకు అత్యంత ప్రియమైన జట్టు పోటీల్లో గెలిచిందనీ, తమకు మనవలు పుట్టారని తెలిసిన కొందరు ఆ సంతోషాన్ని పట్టలేక ఈ హ్యాపీ హార్ట్ సిండ్రోమ్’కు గురైనట్లు అథ్యయనాల విశ్లేషణలో తేలింది. దాంతో భరించలేనంత విషాదం కలిగించే ప్రభావాన్నే పట్టరాని సంతోషమూ కలిగిస్తోందని పేర్కొంటున్నారు నిపుణులు.