breaking news
British bank employees
-
ఆ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి 4 రోజులే పని..!
బ్రిటన్ దేశానికి చెందిన ఆటమ్ బ్యాంక్ తమ ఉద్యోగులందరికీ అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఆటమ్ బ్యాంక్ తమ ఉద్యోగుల కోసం వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలుకు శ్రీకారం చుట్టింది. జీతం తగ్గించకుండా వారానికి నాలుగు రోజులే పని అనే కాన్సెప్టు అమలు చేసే అతిపెద్ద సంస్థ బ్రిటన్లో మాది మాత్రమే అని ఆటమ్ బ్యాంక్ తెలిపింది. నవంబర్ 1న అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని ఉద్యోగుల శ్రేయస్సు కోసం ప్రవేశపెట్టినట్లు సీఈఓ మార్క్ ముల్లెన్ బీబీసీకి తెలిపారు. ఉద్యోగులు ఇంతకు ముందు ఉన్న 37.5 పని గంటలకు బదులుగా వారానికి 34 గంటలే పనిచేస్తారు అని పేర్కొన్నారు. కంపెనీలోని 430 మంది ఉద్యోగులకు ఈ విధంగా సెలవులు ఇస్తోంది. దీంతో ఆ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వారానికి సోమ, శుక్రవారంతో పాటు మరో రోజును సెలవుగా ఎంచుకునే అవకాశం కల్పించింది. కరోనా వేళ ఉద్యోగులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండి సక్రమంగా పని చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ చెబుతోంది. దీనిని ఉపయోగించుకునే ఉద్యోగులు వారు పని రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారని కంపెనీ ఆశిస్తుంది. బ్యాంకు ఖాతాదారులు అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి అందరికీ ఒకే రోజు సెలవు ఇవ్వకుండా వారినికి రొటేషనల్ మాదిరి సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది. ఎక్కువ రోజులు సెలవులు రావడం ఉద్యోగులు తమ అవసరాలను కూడా తీర్చుకోవచ్చు అని, కుటుంబంతో ఎక్కువ సమయం గడపటంతో మానసిక ఒత్తిడి తగ్గి ఉద్యోగాన్ని కూడా సక్రమంగా చేస్తారని కంపెనీ తెలిపింది. (చదవండి: స్టార్టప్ రంగంలో భారత్ అగ్రస్థానం: మోదీ) -
ఉగ్రవాదుల్లా చేసినందుకు ఉద్యోగాలు ఊడాయి
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎలా ఉరితీస్తారో అలాంటి చర్యనే మాక్గా నిర్వహించినందుకు ఆరుగురు ఉద్యోగులను బ్రిటన్కు చెందిన ఓ బ్యాంక్ తొలగించింది. వీరంతా కూడా ఆసియా వాసులే కావడం గమనార్హం. హెచ్ఎస్బీసీ బ్యాంక్లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మాదిరిగా ఓ ఎనిమిది నిమిషాల వీడియో రూపొందించి దానిని ఆన్లైన్లో పెట్టారు. దాని ప్రకారం ఐదుగురు వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి నవ్వుతుండగా మరో వ్యక్తికి ఆరెంజ్ దుస్తులు వేసి మొకాళ్లపై కూర్చుబెట్టారు. అందులో ఒకరు 'అల్లాహు అక్బర్' అని గట్టిగా కేక వేయగా మొకాళ్లపై నిల్చున్న వ్యక్తి మెడపై ఫేక్ కత్తిని ఉంచారు'. ఈ వీడియో బయటకుపొక్కడంతో బ్యాంకు అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యను తాము ఏమాత్రం సహించేది లేదని, వారందరిని తొలగించాలని నిర్ణయించామని చెప్పారు.