breaking news
becomes father
-
గుడ్ న్యూస్
హీరో కార్తీ ఇంట్లో ఓ గుడ్ న్యూస్. కార్తీ కుటుంబం పెద్దది కాబోతోంది. ఆయన మరోసారి తండ్రి కాబోతున్నారు. 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్ అని పేరు పెట్టారు. తాజాగా మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ జంట. -
ధోనీకి ప్రమోషన్
గుర్గావ్: వన్డే ప్రపంచ కప్ ముందు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రమోషన్ లభించింది. ఈ ప్రమోషన్ కెరీర్లో కాదండోయ్.. నిజ జీవితంలో. ధోనీ తండ్రయ్యాడు. శుక్రవారం రాత్రి ఇక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ధోనీ భార్య సాక్షి సింగ్ రావత్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ధోనీ, సాక్షి దంపతులకిది మొదటి సంతానం. బిడ్డ బరువు 3.7 కిలోలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. 2010లో ధోనీ సాక్షిని వివాహం చేసుకున్నాడు. ధోనీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం ధోనీ సమాయత్తమవుతున్నాడు. కాగా ధోనీ తన ముద్దుల కుమార్తెను చూసేందుకు త్వరలో వీలు చూసుకుని భారత్కు వచ్చే అవకాశముంది.