ధోనీకి ప్రమోషన్ | Dhoni becomes father of a baby girl | Sakshi
Sakshi News home page

ధోనీకి ప్రమోషన్

Feb 6 2015 9:49 PM | Updated on Sep 2 2017 8:54 PM

ధోనీకి ప్రమోషన్

ధోనీకి ప్రమోషన్

వన్డే ప్రపంచ కప్ ముందు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రమోషన్ లభించింది.

గుర్గావ్: వన్డే ప్రపంచ కప్ ముందు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రమోషన్ లభించింది. ఈ ప్రమోషన్ కెరీర్లో కాదండోయ్.. నిజ జీవితంలో. ధోనీ తండ్రయ్యాడు. శుక్రవారం రాత్రి ఇక్కడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ధోనీ భార్య సాక్షి సింగ్ రావత్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  ధోనీ, సాక్షి దంపతులకిది మొదటి సంతానం. బిడ్డ బరువు 3.7 కిలోలు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. 2010లో ధోనీ సాక్షిని వివాహం చేసుకున్నాడు.

ధోనీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం ధోనీ సమాయత్తమవుతున్నాడు. కాగా ధోనీ తన ముద్దుల కుమార్తెను చూసేందుకు త్వరలో వీలు చూసుకుని భారత్కు వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement