breaking news
baskar
-
మావోయిస్టు భాస్కర్ దశాబ్దాల అజ్ఞాతం
సాక్షి,ఆదిలాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఉమ్మడి జిల్లా అడవుల్లో సంచారం తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. భాస్కర్ దళాన్ని పట్టుకోవడమా లేదా తెలంగాణ నుంచి తరమికొట్టడమా అనే లక్ష్యంగా పోలీసుల కూంబింగ్ సాగుతోంది. అయితే ఈ మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్‌ది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర సొంత గ్రామం. దళ సభ్యుడిగా నక్సల్ బరిలోకి దిగి దండకారణ్యంలో పని చేసి ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు వహిస్తున్నాడు. దీంతో పోలీసులు ఆపరేషన్ భాస్కర్ లక్ష్యంగా ముందుకు కదులుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భాస్కర్ నేపథ్యం.. బోథ్ మండలం పొచ్చెర గ్రామంలో జన్మించిన భాస్కర్ 10వ తరగతి వరకు బోథ్‌లోనే చదివారు. ఆ తర్వాత 1989–91 మధ్యలో నిర్మల్‌లో ఇంటర్ చేశారు. ఆ సమయంలో ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) ప్రెసిడెంట్‌గా పని చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన భాస్కర్ ఆ సమయంలోనే నక్సల్ బరి వైపు ఆకర్షితులయ్యారు. అంతకు ముందు విద్యార్థి దశలోనే 1989 కాలంలో భూపోరాటాలు విస్తృతంగా సాగుతున్న సమయంలో తానుకూడా అందులో పాల్గొన్నాడు. 1994–95 లో దళంలోకి ప్రవేశించాడు. బోథ్ దళ సభ్యుడిగా పని చేసి అక్కడి నుంచి ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. అక్కడి నుంచి కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు చత్తీస్ఘడ్ దండకారణ్యంలోకి వెళ్లాడు. 25 ఏళ్ల వయసులో భాస్కర్ దళంలో చేరినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రసుతం 50 ఏళ్లు ఉంటాయని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు. భాస్కర్‌కు ముగ్గురు సోదరులు ఉండగా వారు ప్రస్తుతం పొచ్చెరలోనే వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. భాస్కర్ దళంలో పని చేస్తున్న సమయంలోనే సహచరురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నట్లు చెప్తారు. అయితే దళంలోకి వెళ్లిన తర్వాత సోదరులకు భాస్కర్‌తో సంబంధాలు దూరమయ్యాయి. రెండున్నర దశాబ్దాలుగా ఆయన అజ్ఞాతం కొనసాగుతోంది. రిక్రూట్మెంట్ కోసం.. కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్ విస్తృతంగా నిర్వహించడంతో ఛత్తీస్‌ఘడ్ దండకారణ్యం నుంచి బయటకు వచ్చినట్లు ప్రచారం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్చిలోనే ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. బోథ్, సిరికొండ అటవీ ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసుల దృష్టిలో ఉంది. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో పోలీసులకు దళం తారస పడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని ఓ మండలం నుంచి కొంత మంది యువకులు మిస్సింగ్ ఉండడంతోనే పోలీసులు దీన్ని సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మావో రిక్రూట్మెంట్ అనుమానాలు పోలీసుల్లో బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టుకోవడమో లేని పక్షంలో తరిమికొట్టడమో అనే రీతిలో అడవులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కడే కాదు.. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ సంచారం నేపథ్యంలో మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పటి నక్సల్ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మంగీ, ఇంద్రవెల్లి, బోథ్, చెన్నూర్, సిర్పూర్, పిప్పల్‌ధరి, ఖానాపూర్ దళాలు ఒకప్పుడు అడవుల్లో అలజడి సృష్టించినవి. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికీ దళంలో సుమారుగా 20 మంది ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అందులో కొంత మంది కీలక పదవుల్లో ఉండటం గమనార్హం. మే నెలలో బోథ్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలిశాయి. ప్రజాపోరాట ముసుగులో నరహంతక నక్సలైట్లు అనే శీర్షికతో ఉన్నటు వంటి ఆ పోస్టర్లలో మావోయిస్టులకు సహకరించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. భాస్కర్ తలపై ప్రస్తుతం రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే పోస్టర్లో రూ.8లక్షలుగా ఉండటం గమనార్హం. -
వాట్సాప్ యాడ్.. హీలర్ భాస్కర్ అరెస్ట్
కోయంబత్తూర్: ప్రకృతి వైద్యం పేరిట ప్రజలను మభ్య పెడుతున్న హీలర్ భాస్కర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26న నిట్శాయ్ ట్రెయినింగ్ సెంటర్లో భారీ ఎత్తున్న వర్క్‌షాపు నిర్వహించేందుకు భాస్కర్ ప్రజలకు పిలుపునిచ్చాడు. ప్రసవం సమయంలో వైద్యులు అవసరం లేకుండా.. సహజ పద్ధతిలోనే కాన్పులు చేయొచ్చన్న అంశం అవగాహన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేశాడు. ఈ నేపథ్యంలో యాడ్లు ఇండియన్ మెడికల్ అసోషియేషన్ దృష్టికి చేరటంతో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఆరోగ్యశాఖ దర్యాప్తునకు ఆదేశించింది. అతని చర్యలు అనైతికమని.. జనాల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నాయని, ప్రమాదకరమైన వైద్య విధానాన్ని భాస్కర్ అవలంభిస్తున్నాడని ఐఎంఏ వాదిస్తోంది. సివిల్ ఇంజనీరింగ్ చదివిన భాస్కర్.. గత కొన్నేళ్లుగా ప్రాణిక్ హీలింగ్, సహజ పద్ధతులంటూ వంద సంఖ్యలో పెషంట్లకు చికిత్స చేశాడు. పలు టీవీ షోల్లో కూడా అతను పాల్గొంటుడటం విశేషం. ప్రసవానికి సంబంధించిన వీడియోలు చూసి ఈ మధ్యే తిరువూరుకు చెందిన కీర్తిక(28) అధిక రక్తస్రావంతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏఎంఏ దర్యాప్తుకు ఆదేశించింది. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ... -
పర్యాటక హబ్‌గా పశ్చిమ
ఏలూరు (మెట్రో) : జిల్లాను రూ.6,550 కోట్ల అంచనాలతో పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు పలు ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో ఆధ్యా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బీవీకే ప్రొడక్ట్స్, కెనడా ఫైనాన్షియల్ టై అప్ విత్ ఎకనమిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రతినిధులతో కలెక్టర్ పర్యాటక అభివృద్ధిపై సమీక్షించారు. జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయన్నారు. 32 కిలోమీటర్ల పొడవున ఉన్న కోస్తాతీర ప్రాంతంలో 22 కిలోమీటర్ల పొడవున అల్లూరి సీతారామరాజు కోస్టల్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్ చెప్పారు. దీని కోసం 150 ఎకరాల భూమి అభివృద్ధికి, అల్లూరి హైవే నిర్మాణానికి రూ.2,300 కోట్లు ఖర్చుకాగలవని ప్రతిపాదనలు సిద్ధం చేశారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 100 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో వాటర్ స్పాట్స్, వాటర్ ట్రా¯Œ్సపోర్ట్స్ అభివృద్ధి చేసి 7 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు కలెక్టర్ వివరించారు. కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వపరంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. 2030 నాటికి జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మూడు దశల్లో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 17న చించినాడలో వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తొలిదశగా చించినాడ యలమంచిలిలంకలో ఈనెల 17న వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రారంభించనున్నట్టు టూరిజం కంపెనీ ప్రతినిధి శేషుబాబు చెప్పారు.