breaking news
Basil Rajapaksa
-
అర్ధరాత్రి దుబాయ్ చెక్కేసేందుకు ప్రయత్నించిన గొటబాయ సోదరుడు, కానీ..
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల ఆగ్రహావేశాలు చూసి నాయకులు వణికిపోతున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సహా ఇప్పటికే చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా శ్రీలంక మాజీ మంత్రి, గొటబాయ సోదరుడు బసిల్ రాజపక్స దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దుబాయ్ వెళ్లేందుకు మంగళవారం ఉదయం 12:15గంటలకే కొలంబో విమానాశ్రయం చేరుకున్నారు బసిల్ రాజపక్స. చెక్ ఇన్ కౌంటర్లో ఉన్న ఆయనను అక్కడున్న వారు సహా ఇమ్మిగ్రేషన్ సిబ్బంది గుర్తుపట్టారు. దీంతో అతడ్ని దేశం దాటి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇక చేసేదేం లేక 3:15గం. వరకు వేచి చూసి విమానాశ్రయం నుంచి బసిల్ తిరిగివెళ్లిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక పరిస్థితులు చూసి ఉన్నతాధికారులు, నాయకులను దేశం వీడి వెళ్లేందుకు ఎయిర్పోర్టు సిబ్బంది అనుమతించట్లేదని సంబంధింత వర్గాలు తెలిపాయి. తమకు సరైన భద్రత కల్పించేవరకు వీఐపీ సేవలు కొనసాగించమని పేర్కొన్నట్లు చెప్పాయి. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ బుధవారం అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో శ్రీలంక అఖిల పక్షాలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చదవండి: లంకకు 20న కొత్త అధ్యక్షుడు -
మాజీ అధ్యక్షుడి సోదరుడు అరెస్టు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ భూవివాదానికి సంబంధించి ఆయన సోదరుడు బాసి రాజపక్సను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు ఈయన ఆర్థిక వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీలంకలోని ఫైనాన్సియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(ఎఫ్సీఐడీ) అధికారులు మతారా పట్టణంలో అరెస్టు చేశారు. రేపు అతడిని కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. గత ఏడాది కూడా ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణల కిందట ఒకసారి అరెస్టయ్యాడు.