breaking news
baloch
-
ఆగని పాక్ అరాచకం.. బలూచ్ మహిళల దీనగాథలు
బలూచిస్తాన్‌లో ఇంతవరకూ తమ ఇంటిలోని పురుషుల అదృశ్యాలతో గుండెకోతకు గురైన మహిళలు.. ఇప్పుడు నిత్యం వారే పాక్ దళాల కిడ్నాప్‌కు బలి అవుతున్నారు. తరతరాలుగా తమ వారి ఆచూకీ కోసం పోరాడుతున్న బలూచ్ మహిళల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. అపహరణలు, నిర్బంధాల రూపంలో పాక్ సాగిస్తున్న ఈ అణచివేత ఒక జాతి మనుగడను, ఆత్మగౌరవాన్ని కాలరాస్తోంది. మరోవైపు గడప దాటి బయటకు వచ్చి, న్యాయం అడుగుతున్న ఆడబిడ్డల గొంతు నొక్కే ప్రయత్నాలు సర్వసాధారణమయ్యాయి. బలూచ్ పోరాట పటిమను నీరుగార్చాలనే పాక్ కుట్రలు ఆ ప్రాంతాన్ని కన్నీ సంద్రంగా మార్చివేస్తున్నాయి. గతంలో బలూచ్ సంప్రదాయాల దృష్ట్యా మహిళలను నిర్బంధించడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ మానవ హక్కుల మండలి (హెచ్ఆర్సీబీ)నివేదిక ప్రకారం.. మహిళలను అపహరించడం అనేది పాకిస్తాన్ భద్రతా దళాలైన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ), ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ)లకు ఒక దైనందిన కార్యక్రమంగా మారింది. హక్కుల కోసం గొంతెత్తుతున్న మహిళలను భయపెట్టడం ద్వారా, బలూచ్ ప్రతిఘటనను అణచివేయడమే పాక్ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది.హెచ్ఆర్సీబీ వెల్లడించిన కేసుల్లో కొన్ని..గుల్జాది.. ఒకే ఏడాదిలో మూడుసార్లు వేధింపులు.. మానవ హక్కుల కార్యకర్త అయిన గుల్జాది జీవితం నేటి బలూచిస్తాన్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 2025, ఏప్రిల్ 7న క్వెట్టాలో ఆమెను సిటిడి బలగాలు కుటుంబ సభ్యుల ముందే ఈడ్చుకెళ్లాయి. మార్చిలో రెండుసార్లు ఆమె ఇంటిపై దాడి చేసిన బలగాలు.. చివరికి ఆమెపై 16 తప్పుడు కేసులు బనాయించాయి. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆమెను 3-MPO (మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్) కింద జైలులో నిర్బంధించారు. ఒక సామాన్య మహిళను ఉగ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని హెచ్ఆర్సీబీ పేర్కొంది.మహజబీన్ బలోచ్.. విద్యార్థిని అని కూడా చూడకుండా.. యూనివర్శిటీ ఆఫ్ బలూచిస్తాన్‌లో బీఎస్సీ లైబ్రరీ సైన్స్ చదువుతున్న 24 ఏళ్ల మహజబీన్, 2025, మే 29న క్వెట్టా సివిల్ హాస్పిటల్ హాస్టల్ నుంచి అదృశ్యమైంది. అర్ధరాత్రి మూడు గంటలకు హాస్టల్ గదుల్లోకి చొరబడిన బలగాలు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాయో నేటికీ వెల్లడి కాలేదు. బలూచ్‌లో విద్యార్థినులకు కూడా రక్షణ లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.రొబినా బలోచ్.. ఆరోగ్య కార్యకర్తపై అమానుషం.. 2025, జూన్ 30న టర్బత్‌లోని ఓవర్సీస్ కాలనీలో నివసిస్తున్న ప్రభుత్వ హెల్త్ విజిటర్ రొబినా ఇంటిని ఫ్రాంటియర్ కార్ప్స్ ధ్వంసం చేసింది. ఆమెను ఎటువంటి కారణం లేకుండా అపహరించి, తీవ్ర మానసిక వేదనకు గురిచేసి విడుదల చేశారు.సఫియా బీబీ.. సామూహిక శిక్షకు బలి2025, అక్టోబర్ 5న ఖుజ్దార్‌లోని జెహ్రీలో భారీ సైనిక ఆపరేషన్ జరిగింది. ఆ ఊరంతా కర్ఫ్యూ విధించి, ఇంటింటిలో సోదాలు చేసిన బలగాలు సఫియా బీబీని రహస్య ప్రదేశానికి తరలించారు. గ్రామాన్ని మొత్తం ముట్టడించి భయాందోళనకు గురిచేయడంలో భాగంగానే ఈ అపహరణ జరిగింది.నజియా షఫీ.. కస్టడీలో మృతి..2025, అక్టోబర్ 28న పంజ్గూర్లో జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదిగా నిలిచింది. తల్లి పారి బలోచ్, కుమార్తె నజియాలను పాక్ బలగాలు తుపాకీతో బెదిరించి తమతో పాటు తీసుకెళ్లాయి. మరుసటి రోజు నజియాను తీవ్ర గాయాలతో ఆసుపత్రి సమీపంలో పడేశారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇది నేరుగా ప్రభుత్వ కస్టడీలో జరిగిన హత్యేనని హెచ్ఆర్సీబీ చెబుతోంది. మృతురాలి తల్లి పారి బలోచ్ కూడా బలగాల చేతుల్లో చిత్రహింసలకు గురైన తర్వాత విడుదలైంది.నస్రీన్.. 15 ఏళ్ల బాలిక అదృశ్యం అవరాన్‌కు చెందిన నస్రీన్ అనే 15 ఏళ్ల మైనర్ బాలికను నవంబర్ 22న హబ్ చౌకీ వద్ద అపహరించారు. సిటిడి, మిలిటరీ ఇంటెలిజెన్స్ బలగాలు ఆమెను అపహరించాయి. చిన్నపిల్లలపై ఈ తరహా దాడులు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు వ్యతిరేకం.ఫర్జానా జెహ్రీ.. బహిరంగంగా కిడ్నాప్ 2025, డిసెంబర్ 1న ఖుజ్దార్లో ఆసుపత్రి నుండి వస్తున్న ఫర్జానాను దారి మధ్యలో పాక్ బలగాలు అపహరించాయి. ఇది జరిగింది ఎక్కడో గదుల్లోనే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో కూడా మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన రుజువు చేసింది.రహిమా: గృహిణులు కూడా టార్గెట్ 2025, డిసెంబర్ 9న దల్బందిన్లో 20 ఏళ్ల గృహిణి రహిమాను, ఆమె 18 ఏళ్ల తమ్ముడిని అర్ధరాత్రి దాడుల్లో భాగంగా తీసుకెళ్లారు. నేటికీ వారి ఆచూకీ లభించలేదు.చట్టం కనుమరుగు.. అణచివేత రాజ్యంపాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 (వ్యక్తిగత స్వేచ్ఛ), ఆర్టికల్ 10 (నిర్బంధంపై రక్షణ), ఆర్టికల్ 14 (మానవ గౌరవం)లను భద్రతా సంస్థలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయి. మహిళల హక్కుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థల, ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఏమాత్రం గౌరవించడం లేదు. మానవ హక్కుల కార్యకర్తలను, ఆరోగ్య సిబ్బందిని, చివరకు గృహిణులను కూడా వదలని ఈ నిరంకుశ పోకడలు బలూచిస్తాన్‌ను ఒక బహిరంగ జైలుగా మారుస్తున్నాయి. జవాబుదారీతనం లేని బలూచ్‌లో న్యాయం కనుమరుగవుతోంది. ఈ దుర్భర స్థితిపై అంతర్జాతీయంగా వచ్చే స్పందన కోసం వివిధ మానవహక్కుల సంఘాలు ఎదురుచూస్తున్నాయి. ఇది కూడా చదవండి: Japan: నిరసనల మధ్య అణు ప్లాంట్ పునఃప్రారంభం -
పాక్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన
మాంగోచార్ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్న బలూచ్ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఒకే దెబ్బ.... 14 మంది పాక్ సైనికులు ఖతం
-
బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆర్మీపై దాడి
-
కెనడా ప్రధాని ద్వంద్వ నీతి.. ఆమె సంగతేంటి?
ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యోదంతంపై అత్యుత్సాహం ప్రదర్శిస్తూ భారత్‌పై నేరారోపణ చేయడనికి కూడా వెనకాడని కెనడా ప్రధాని అనుమానాస్పద రీతిలో మరణించిన న్యాయవాది, బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించింది బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాదికి అండగా? ఈ ఏడాది జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని గురుద్వారా గుమ్మం వద్ద ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య చేయబడ్డాడు. ఈ హత్య జరిగిన మూడు నెలల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమ్నెట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందని, అందుకు తమ వద్ద కచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రకటించి వివాదానికి తెరలేపారు. మొదటిగా కెనడాలోని భారతీయ దౌత్యాధికారిని కూడా విధుల నుంచి తొలగించగా భారత్ కూడా అందుకు దీటుగా స్పందించి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని తొలగించి ఐదురోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ప్రధానికి లేఖ.. ఒక ఉగ్రవాది హత్య జరిగితే ఇంతగా స్పందించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మూడేళ్ళ క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ మరణంపై ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది కెనడాలోని బలూచ్ మానవహక్కుల సంఘం. ఉగ్రవాది హత్యపై ప్రధాని అత్యుత్సాహంతో చేసిన ఆరోపణలకు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ చేస్తుండడంపైనా కరీమా బలూచ్ మృతిపై కనీసం ఆయన స్పందించకపోవడంపై సూటిపోటి మాటలతో ప్రశ్నిస్తూ సంఘం ప్రధానికి ఒక లేఖను రాసింది. సమన్యాయం చేయండి.. బలూచ్ మానవహక్కుల సంఘం లేఖలో ఏమని రాసిందంటే.."కెనడాలో బలూచ్ వర్గం చాలా చిన్నది. పైగా పార్లమెంట్ ప్రతినిధుల ఎంపికలో కూడా మేము పెద్దగా ప్రభావం కూడా చూపలేము. బహుశా అందుకే కెనడా ప్రభుత్వం కరీమా విషయంలో ఇలా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని రాసింది. ఈ సందర్బంగా కెనడా సమాజంలోని ప్రజాస్వామ్య, లౌకిక విలువలను కాపాడటంలో బలూచ్ వర్గం ఎంతగా సహకరించింది గుర్తుచేశారు. కరీమా కేసులో కూడా కెనడా లిబరల్ ప్రభుత్వం పారదర్శకతతో విచారణ జరిపించాలని కోరారు. రెండేళ్లుగా మా గోడును పట్టించుకోని ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలని.. ఇప్పటికైనా బలూచ్ సంక్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కరీమాకు న్యాయం చేయాలని అభ్యర్ధించారు. ఎవరీ కరీమా బలూచ్? కెనడాలో మూడేళ్ళ క్రితం డిసెంబర్, 20న బలూచ్ మానవహక్కుల కార్యకర్త కరీమా బలోచ్ అదృశ్యమై రెండు రోజుల తర్వాత టొరంటోలోని ఒంటారియో సరస్సులో విగతజీవిగా కనిపించింది. ఈమె వృత్తి పరంగా న్యాయవాది కాగా బలూచ్ మానవహక్కుల కోసం బలంగా పోరాడారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ఆగడాలపై చేసిన పోరాటానికి 2016లో బీబీసీ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె చోటును దక్కించుకున్నారు. Karima Baloch had been exposing the reality of Pak throughout her life and #PakArmy got so scared of her that it murdered her. But it didn’t stop other Baloch from speaking the truth. She continues to inspire all of us. #FreeBalochistan@Hani_Baloch7@yalsarmachar@FawazBaloch7 pic.twitter.com/lSmaI0cIYi — Sohrab Haider (@SohrabHaider7) September 23, 2023 ఇది కూడా చదవండి: భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం' -
ఆకాశవాణిలో బలూచిస్థాన్ గళం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత సైన్యం జరిపిన దాడులను సమర్థిస్తున్న పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రజలకు మన ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)కి మధ్య ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. బలూచ్ భాషలో అక్కడి వార్తలను, వారి సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలను రోజుకు గంట చొప్పున ఆకాశవాణి 1974 నుంచే ప్రసారం చేస్తోంది. ప్రపంచం నలుమూలల విస్తరించి ఉన్న బలూచ్ ›ప్రజలను దృష్టిలో పెట్టుకొనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 15 ఆగస్టు రోజున మాట్లాడుతూ పాకిస్థాన్ ఆధీనంలోని బలూచి ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి ప్రస్తావించారు. కశ్మీర్లో పాకిస్థాన్ జోక్యాన్ని నిలువరించడం కోసమే ఆయన బలూచిస్థాన్ ప్రజల కష్టాల గురించి ప్రస్తావించినప్పటికీ మోదీ చొరవతోనే ఆకాశవాణి, బలూచి రేడియో సర్వీస్పైన యాప్, మల్టీమీడియా వెబ్‌సైట్‌ను సెప్టెంబర్ 21వ తేదీన ప్రారంభించింది. ఇలాంటి సర్వీసులను అందుబాటులోకి తీసుకరావాలని బలూచి ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నప్పటికీ అది ఇప్పటికి నెరవేరింది. బలూచి ప్రజల గళాన్ని వినిపిస్తున్న నేటి ఆకాశవాణియే నాడు అక్కడి ప్రజల స్వేచ్ఛను హరించేందుకు పరోక్షంగా కారణమైంది. అప్పటి వరకు స్వతంత్రంగా జీవిస్తున్న బలూచిస్థాన్‌ను పాక్ దురాక్రమణ నుంచి రక్షించుకునేందుకు బలూచిస్థాన్ రాజు అహ్మద్ యార్ ఖాన్ భారత్‌లో విలీనం చేసేందుకు భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారంటూ ఆకాశవాణి మార్చి 27, 1948లో వార్తను ప్రసారం చేసింది. అంతే ఆ మరుసటి రోజే పాక్ త్రివిద దళాలు బలూచ్‌లోని కలామ్ నగరాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి. అలాంటి ప్రతిపాదనేమీ తమ పరిశీలనలో లేదని, తమను ఎవరూ ఈ విషయంలో సంప్రతించలేదంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే రోజు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాకిస్థాన్ దురాక్రమణకు గురికాకుండా బలూచిస్థాన్ స్వయం ప్రతిపత్తినైనా రక్షించుకునేందుకు భారత్‌లో విలీనం చేయడానికి అక్కడి రాజు ఖాన్ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల నుంచి కృషి చేశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షులు మౌలానా అబ్దుల్ కలా ఆజాద్‌ను కలుసుకొని చర్చలు కూడా జరిపారు. ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూను కలుసుకొని విలీన పత్రాలను కూడా అందజేశారు. తర్జనభర్జనలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు ఖాన్ ప్రతిపాదనను తిరస్కరించాలని నిర్ణయించింది. నెహ్రూ ఖాన్ సంతకం చేసిన విలీన పత్రాలను వెనక్కి ఇచ్చేశారు. కశ్మీర్ విలీనం కోసమే భారత ప్రభుత్వం బలూచిస్థాన్‌ను వదులుకుందన్న వార్తలు ఉన్నాయి. మొదటి నుంచి బలూచిస్థాన్‌ను ముస్లిం రాజులే పాలిస్తూ వస్తున్నందున అది పాకిస్థాన్‌లో కలవడమే మంచిదని నెహ్రూ భావించి ఉంటారని కూడా అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. బలుచిస్థాన్లో కూడా బ్రిటిష్ పాలనే కొనసాగినప్పటికీ వారు వెళ్లేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వెళ్లిపోయారు. అప్పటి నుంచి బలూచిస్థాన్ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం నినాదాలు చేస్తూనే ఉన్నారు.


