వైద్యం వికటించి బాలింత మృతి
ఖమ్మం మామిళ్లగూడెం: స్టేషన్ రోడ్డులోని లుంబిని ఆస్పత్రికి ప్రసవానికొచ్చిన మహిళ సమీరా(20) మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. సమీరా తల్లి ఆయేషా చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన మార్బుల్ల్లో పనిచేసే అక్రం భార్యను శుక్రవారం డెలివరీ కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలొ శనివారం డాక్టర్లు ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. రక్తహీనత ఉండటంతో రక్తం ఎక్కించారు. కాని వైద్యం వికటించి సమీరా మృతి చెందింది. పాపా క్షేమంగా ఉంది. సమీరా మృతితో బంధువుల రోధన కలిచివేసింది.